Prabhas Role In Kannappa Movie: విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్ కూడా వున్నారు. ఆయన అతిథి పాత్రలో సందడి చేయనున్నారు. ఆల్రెడీ తనకు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ పూర్తి చేశారు. అయితే, ఆయన క్యారెక్టర్ ఏమిటి? అనేది ఇంకా రివీల్ చెయ్యలేదు. టాలీవుడ్ నుంచి వినబడుతున్న లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం... 


రావణ బ్రహ్మగా రెబల్ స్టార్ ప్రభాస్!
Prabhas As Ravana Brahma: 'కన్నప్ప' సినిమాలో రావణ బ్రహ్మగా ప్రభాస్ కొన్ని నిమిషాల పాటు కనిపిస్తారని తెలుస్తోంది. ఆ మహాశివునికి రావణుడు సైతం అపర భక్తుడు. కన్నప్ప కూడా శివ భక్తులు. తొలుత కన్నప్ప పాత్రలో ప్రభాస్ నటిస్తే చూడాలని ఆయన పెదనాన్న కృష్ణంరాజు కోరుకున్నారు. అది తీరకుండా ఆ పెద్దాయన కన్ను మూశారు. ఆయన జీవించిన సమయంలో విష్ణు 'కన్నప్ప' రోల్ చెయ్యాలని అనుకోవడం, కృష్ణం రాజును మోహన్ బాబు కలిసి మాట్లాడటం వంటివి జరిగాయి. అది పక్కన పెడితే... 


Prabhas Role In Kannappa: 'కన్నప్ప'లో ప్రభాస్ నటించాలని విష్ణు కోరుకున్నారు. తొలుత శివుని పాత్రలో నటిస్తారని ప్రచారం జరిగింది. అది చెప్పలేదు కానీ ''మేం ప్రభాస్ దగ్గరకు ఒక పాత్ర చెయ్యమని వెళ్లాం. ఆయన మరొక పాత్ర చేస్తానని చెప్పారు'' అని విష్ణు వెల్లడించారు. ప్రభాస్ ఏ క్యారెక్టర్ చేస్తున్నారనేది మాత్రం చెప్పలేదు. ఇటీవల విడుదలైన టీజర్ చూస్తే శివుని క్యారెక్టర్ బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ యాక్ట్ చేసినట్లు అర్థం అవుతోంది. మరి, ప్రభాస్ రోల్ ఏమిటి? అని ఆరా తీయగా... ఆయన రావణ బ్రహ్మ రోల్ చేశారని తెలిసింది.


Also Read: కల్కి ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... మూవీ సెన్సార్ పూర్తి... ప్రభాస్ సినిమాకు ముంబై నుంచి షాకింగ్ రిపోర్ట్స్!


'కన్నప్ప' టీజర్‌లో ప్రభాస్ కొన్ని సెకన్స్ పాటు కనిపించారు. నుదుట అడ్డంగా నామాలు, నిలువున ఎర్రటి నామంతో కనిపించారు. రెబల్ స్టార్ అభిమానులకు ఆ కొన్ని సెకన్స్ సంతోషాన్ని కలిగించాయి. ఫుల్ ఫేస్ చూపిస్తే రావణ బ్రహ్మ అనేది అర్థం అవుతుంది కనుక చూపించలేదని టాక్. మరి, ప్రభాస్ క్యారెక్టర్ గురించి విష్ణు ఎప్పుడు రివీల్ చేస్తారో? ఆయన వికీపీడియా పేజీలో 'కన్నప్ప' సినిమాలో రావణుడి రోల్‌ చేసినట్టు ఉంది.


Also Readలాభాలు రావాలంటే ఎన్టీఆర్ బాక్సాఫీస్ కుంభస్థలాన్ని గట్టిగా కొట్టాలి... తెలుగు రాష్ట్రాల్లో 'దేవర'కు రికార్డ్ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్



'కన్నప్ప'లో ప్రభాస్, అక్షయ్ కుమార్ కాకుండా మోహన్ లాల్, కాజల్ అగర్వాల్, శరత్ కుమార్, మధుబాల సహా పలువురు కీలకమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై పద్మశ్రీ పురస్కార గ్రహీత, లెజెండరీ నటుడు మోహన్ బాబు నిర్మిస్తున్నారు. హిందీలో మహాభారత సిరీస్ తీసిన ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. అన్నీ కుదిరితే ఈ ఏడాది డిసెంబర్ నెలలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని ఆలోచిస్తున్నారట. విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ వర్క్ పూర్తి కావడంపై విడుదల తేదీ ఆధారపడి ఉంది. ఈ చిత్రానికి పరుచూరి గోపాల కృష్ణ, బుర్రా సాయి మాధవ్, తోట ప్రసాద్ రచనా సహకారం అందిస్తుండగా... మణిశర్మ, స్టీఫెన్ దేవాసి సంగీత బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.