ప్రముఖ దర్శకుడు ప్రశాంత వర్మ దర్శకత్వంలో ‘హనుమాన్’ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. సోషియో ఫాంటసీ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో యంగ్ హీరో తేజ సజ్జ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వస్తున్న తొలి పాన్ వరల్డ్ మూవీ కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. అంజనాద్రి అనే కాల్పనిక ప్రదేశం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. హను-మాన్‌లా శక్తులు పొందిన సామాన్యుడు అంజనాద్రిని కాపాడుకోవడానికి ఏం చేశాడనే నేపథ్యంలో ఈ కథ ఉండబోతోంది. ఈ సినిమా నుంచి విడుదలవుతున్న పోస్టర్లు, టీజర్ సహా పలు అప్ డేట్స్ అంచనాలను భారీగా పెంచుతున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి మరో క్రేజ్ అప్ డేట్ వచ్చింది.
‘హనుమాన్’ నుంచి పవర్ ఫుల్ హనుమాన్ చాలీసా విడుదల
చిత్ర బృందం ముందుగా ప్రకటించినట్లుగానే ఈ సినిమాకు సంబంధించిన పవర్ ఫుల్ హనుమాన్ చాలీసాను విడుదల చేశారు. వినసొంపుగా ఉండటంతో పాటు పవర్ ఫుల్ గా అనిపిస్తోంది ఈ హనుమాన్ చాలీసా. హనుమాన్ జయంతి సందర్భంగా చిత్ర బృందం హనుమాన్ చాలీసాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. దీన్ని సాయి చరణ్ భాస్కరుని అద్భుతంగా ఆలపించారు. గౌర హరి, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్ మ్యూజిక్ ఇచ్చారు. ఇప్పటికే విడుదల అయిన ‘హనుమాన్’ టీజర్ సినిమాపై ఓరేంజిలో అంచనాలను పెంచుతోంది. ఇక హనుమాన్ చాలీసా సైతం అద్భుతంగా ఉంటడంతో ప్రేక్షకులలో మరింత ఆసక్తి పెరిగింది.
అదిరిపోయే విజువల్స్ తో ఆకట్టుకుంటున్న హనుమాన్ చాలీసా
ఇక హనుమాను చాలీసాలో ఓవైపు పాట వస్తూనే మరోవైపు అదిరిపోయే విజువల్స్ చూపించారు. రిచ్ విజువల్ వండర్ గా అనిపిస్తోంది. మ్యూజిక్ మరింత అద్భుతం అని చెప్పుకోవచ్చు. అందాల తార అమృత అయ్యర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్, రాజ్ దీపక్,వెన్నెల కిషోర్, గెటప్ శ్రీను, సత్య సహా పలువురు నటీనటులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, మరాఠీలోనే కాకుండా స్పానిష్, కొరియన్, జపనీస్, చైనీస్ భాషల్లో పాన్ వరల్డ్ మూవీగా.. మే 12న రీలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ప్రైమ్ షో ఎంటర్ టైన్మెంట్ పై నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి గౌర హరి, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్ సంగీతం అందిస్తున్నారు.
‘హనుమాన్’ కోసం శ్రమిస్తున్న తేజ సజ్జ
‘జాంబీరెడ్డి’, ‘అద్భుతం’ సినిమాలతో ప్రేక్షకులకు తన టాలెంట్‌ను రుచి చూపించిన తేజ సజ్జ ఈ సినిమా కోసం తన లైఫ్‌ని రిస్క్ చేసి మరీ కష్టపడ్డాడు. ఈ సినిమాలో అండర్ వాటర్ సీన్ ఒకటి ఉందట. ఈ సీన్‌లో తేజ రిస్కీగా కొన్ని సెకన్ల పాటు నీటిలో ఊపిరి బిగపట్టి ఉండాలి. ఈ సీన్ బాగా రావాలని హైదరాబాద్‌లో దాదాపు 15 రోజుల పాటు ట్రైనింగ్ కూడా తీసుకున్నాడట. ప్రేక్షకులకు ఒక మంచి సినిమా అందించాలని కష్టపడుతున్న తేజాకు ఈ సినిమా మంచి పేరు తీసుకురావాలని ప్రేక్షకులు కూడా కోరుకుంటున్నారు. ఈ సినిమా ఊహించిన స్థాయిలో హిట్ అయితే మాత్రం ప్రశాంత్ వర్మ కూడా ప్రశాంత్ నీల్, ఎస్.ఎస్ రాజమౌళిలా పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోతారు.
Read Also: అతిగా ఆలోచించకండి - విజయ్‌తో డేటింగ్‌పై రష్మిక సెటైర్స్, మరి ఈ సాక్ష్యాల సంగతేంటో!