విజయ్ దేవరకొండ, రష్మికా మందన్నా ప్రేమలో ఉన్నారని గత కొన్ని రోజులుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే, వాళ్ళు ఎప్పుడూ కన్ఫర్మ్ చేయలేదు. కానీ, ఎప్పటికప్పుడు వీళ్లు డేటింగ్ లో ఉన్నారనే వార్తలకు బలం చేకూర్చేలా వ్యవహరిస్తూనే ఉన్నారు. గతంలో న్యూ ఇయర్ వేడుకల కోసం మాల్దీవ్స్ కు వెళ్లి అక్కడ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇద్దరు ఎవరి ఫోటోలు వారు షేర్ చేసినా, ఒకే ప్లేస్ లో ఫోటోలు దిగినట్లు ఉండటంతో పెద్ద చర్చ జరిగింది. ఇద్దరూ కలిసే న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్నారనే గుసగుసలు వినిపించాయి. మాల్దీవ్స్ కు వెళ్లే సమయంలో ఇద్దరూ ఒకే సమయంలో వెళ్తూ మీడియాకు కనిపించారు కూడా.  


డేటింగ్ లో రష్మిక - విజయ్, సాక్ష్యం ఇదే!


తాజాగా విజయ్, రష్మిక ప్రేమలో ఉన్నారనే దానికి మరో ఫ్రూఫ్ దొరికిందంటూ నెటిజనులు ఫొటోలు పెడుతున్నారు. ఈ ఫొటోల్లో విజయ్ కి ఇష్టమైన రింగ్, రష్మిక వేలికి కనిపించింది. అంతేకాదు, వీరిద్దరు ఒకే ఇంట్లో, ఒకే రూమ్ లో ఉన్నట్లుగా ఆ ఫొటోల ద్వారా తెలుస్తోంది. దీనిపై ఓ మిడియా సంస్థ ఓ కథనం వండి వడ్డించేసింది. ఆ ట్వీట్ చూసిన రష్మిక వెంటనే స్పందించింది. విజయ్ దేవరకొండను ట్యాగ్ చేస్తూ.. ‘‘అయ్యో, డోన్ట్ ఓవర్ థింక్.. బాబు’’ అంటూ వ్యంగ్యంగా స్పందించింది. ఈ ట్వీట్ చూసి.. ఆమె అభిమానులు అంటే ఏదో ఉందన్న మాట అని అంటున్నారు. మరి, ఈ సాక్ష్యాల సంగతి ఏంటో అని అంటున్నారు.






గతంలో డేటింగ్ వార్తలపై స్పందించిన రష్మిక!


గతంలో ఓసారి డేటింగ్ గురించి తన మనసులో మాట బయట పెట్టింది రష్మిక. ''నువ్వు మాకు అందుబాటులో ఉండటం లేదని కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆల్రెడీ నాతో ఎప్పుడూ చెబుతూ ఉంటారు. రిలేషన్షిప్‌లో ఉన్నప్పుడు మనం చాలా టైమ్ ఇవ్వాలి. చాలా ఓర్పుతో ఉండాలి. బంధం నిలబెట్టుకోవడానికి ప్రయత్నించాలి. ప్రస్తుతం సినిమాలతో నేను చాలా బిజీగా ఉన్నాను. నా కోసం అస్సలు టైమ్ ఉండటం లేదు. రాబోయే రోజుల్లో ఏదైనా ఉంటే చెబుతా'' అని రష్మిక తెలిపారు. గత ఏడాది విజయ్ తో ప్రేమ పుకార్ల గురించి కూడా  రష్మిక స్పందించారు. ''మేమిద్దరం (విజయ్ దేవరకొండ, రష్మిక) మా కెరీర్ స్టార్ట్ చేసిన కొత్తల్లో భారీ హిట్ సినిమాలు చేశాం. ఇప్పుడు విజయ్ దేవరకొండ పాన్ ఇండియా సినిమా చేశారు. నేను స్ట్రెయిట్ హిందీ సినిమా చేశా. హిందీలో నాకు ఇది తొలి సినిమా. మా ఇద్దరి కెరీర్స్ చాలా డిఫరెంట్. మేం ఒకరి కోసం మరొకరం మాట్లాడుకోవడం ఉండదు. ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలు ఏవైనా అడగాలంటే... అతడిని అడుగుతాను. కానీ, మా దారులు వేర్వేరు'' అని రష్మిక వివరించారు. విజయ్ దేవరకొండతో రిలేషన్షిప్ గురించి మా ఫ్రెండ్స్ మధ్య డిస్కషన్ జరుగుతుందని రష్మిక తెలిపారు. అయితే, విజయ్ తో వీటి గురించి ఎప్పుడూ డిస్కస్ చేయలేదని చెప్పారు. తమది పదిహేను మంది సభ్యులతో కూడిన గ్యాంగ్ అని, అందరం కలిసినప్పుడు బోర్డు గేమ్స్ వంటివి ఆడతామని రష్మిక చెప్పారు.  


Read Also: అక్కడ ఊర్వశి ఉంటే ఏమయ్యేది? మ్యాచ్ లో ప్లకార్డుపై ఐటెమ్ బ్యూటీ రియాక్షన్!