టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్, బాలీవుడ్ ఐటెమ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా మధ్య ఏదో ఉందంటూ గతంలో గుసగుసలు వినిపించాయి. ఇద్దరూ డేటింగ్ లో ఉన్నారనే వార్తలు కూడా వచ్చాయి. గతంలో తను పలు క్రికెట్ మ్యాచ్ లు చూడ్డానికి వెళ్లినప్పుడు కూడా ఇలాంటి వార్తలే వెల్లువెత్తాయి. ఇటీవల ఆమె మ్యాచ్ లకు వెళ్లపోయినా, నిత్యం వార్తల్లో నిలుస్తోంది. అవన్నీ రిషబ్ పంత్ చుట్టే తిరగడం విశేషం.
ప్లకార్డుపై స్పందించిన ఊర్వశి రౌతేలా
తాజాగా ఐపీఎల్ మ్యాచ్ లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ అమ్మాయి స్టేడియంలో పట్టుకున్న ప్లకార్డు నెట్టిటంట్లో వైరల్ అవుతోంది. ‘థ్యాంక్ గాడ్ ఊర్వశి ఇక్కడ లేదు’ అని ఆ ప్లకార్డులో రాసి ఉంది. ఈ పోస్టును ఊర్వశి తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ “ఎందుకు?” అని క్వశ్చన్ చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ Vs గుజరాత్ టైటాన్స్ మ్యాచ్‌లో రిషబ్ పంత్ కనిపించారు. గతేడాది డిసెంబర్‌లో జరిగిన కారు ప్రమాదం తర్వాత రిషబ్ బయట కనిపించలేదు. తొలిసారిగా ఈ మ్యాచ్ లో తెల్లటి చొక్కా వేసుకుని కనిపించాడు.
ఊర్వశి, రిషబ్ మధ్య సంబంధం ఏంటి?
రిషబ్ పంత్ కారు యాక్సిడెంట్ తర్వాత, ఊర్వశి రౌతేలా ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రి చిత్రాన్ని పోస్టు చేసి వార్తల్లో నిలిచింది. ఆమె ఆ హాస్పిటల్లో రిషబ్ ను పరామర్శించి ఉండవచ్చని ఊహాగానాలు వచ్చాయి. ప్రమాదం తర్వాత చికిత్స కోసం రిషబ్ డెహ్రాడూన్ నుంచి సబర్బన్ అంధేరీలోని ఆసుపత్రికి తీసుకెళ్లిన కొద్దిసేపటికే ఈ పోస్ట్ చేసింది. ఊర్వశి రౌతేలా, రిషబ్ పంత్ సోషల్ మీడియాలో పెట్టే పోస్టుల ద్వారా బాగా చర్చనీయాంశం అయ్యాయి. 2018లో వారు పలు ఈవెంట్లలో కలిసి కనిపించారు. తర్వాత వారిద్దరి మధ్య ఏదో ఉందనే వార్తలు వచ్చాయి. అయితే, 2019లో, రిషబ్ పుకార్లకు ముగింపు పలికాడు. స్నేహితురాలు ఇషా నేగితో ప్రేమలో ఉన్నట్లు వెల్లడించాడు.
ఊర్వశి మాటలన్నీ అబద్దాలేనన్న పంత్
ఓసారి రిషబ్ గురించి ఊర్వశి ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పింది. "నేను వారణాసిలో షూటింగ్ లో ఉన్నాను. అదే సమయంలో ఓ షో కోసం ఢిల్లీకి వచ్చాను. నేను ఫుల్ డే షూటింగ్‌లో ఉన్నాను. ఆ తర్వాత నేను నిద్రపోయాను. కానీ, నన్ను కలవడానికి మిస్టర్ RP వచ్చాడు. అతను లాబీలో కూర్చుని నా కోసం వేచి ఉన్నాడు. నా కోసం వేచి చూస్తూ ఫోన్ చేశాడు. లేచి చూసే సరికి 16, 17 మిస్డ్ కాల్స్ ఉన్నాయి” అని చెప్పింది. ఈ వ్యాఖ్యలకు రిషబ్ కౌంటర్ ఇచ్చారు. “కొంత పాపులారిటీ కోసం, వార్తల్లో నిలవడం కోసం ఇంటర్వ్యూల్లో ఎలాంటి అబద్దాలు అయినా చెప్తారు అనడానికి ఉదాహరణ. కొంత మంది కీర్తి, పేరు కోసం అబద్దాలు చెప్పడం బాధాకరం” అన్నాడు. ఇటీవల, రిషబ్ పంత్ కారు ప్రమాదం తర్వాత, ఊర్వశి రౌతేలా ఇన్‌స్టాగ్రామ్‌లో వైట్ హార్ట్ ఎమోజి, వైట్ డోవ్ ఎమోజి పెట్టి తన కోసం ప్రార్థిస్తున్నట్లు ఓ పోస్టు పెట్టింది.
Read Also: పవన్ కళ్యాణ్ వద్దని శంకర్‌కు చెప్పా, ఒక్కో పాటకు రూ.12 కోట్లు ఖర్చు: దిల్ రాజు