Poonam Kaur on Trivikram: నటి పూనమ్ కౌర్‌కు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటే అస్సలు పడదు. దానికి కారణం ఏంటో స్పష్టంగా బయటపెట్టకపోయినా.. సోషల్ మీడియా వేదికగా త్రివిక్రమ్‌ను టార్గెట్ చేస్తూ పలుమార్లు వ్యాఖ్యలు చేసింది ఈ భామ. తాజాగా మరోసారి త్రివిక్రమ్‌పై ఇన్‌డైరెక్ట్‌గా కామెంట్ చేస్తూ.. గురూజీ థింగ్స్ అంటూ హ్యాష్‌ట్యాగ్‌ను జతచేసింది.
గుడ్డివారు అయిపోయారు..
‘‘ఆయన ఏదైనా చేసి తప్పించుకోగలడు. ఆయన చేసే తప్పు పనులను గుర్తించలేనంత గుడ్డివారు అయిపోయారు జనాలు. గత ప్రభుత్వంలో మామూలు ప్రజలకు తమ సమస్యలను చెప్పుకోవడానికి ముఖ్యమంత్రి ఆఫీస్‌కు వెళ్లలేనంత స్వేచ్ఛ ఆయనకు మాత్రమే ఉండేది. అది ఎందుకు అని నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉంది’’ అంటూ ఒక వ్యక్తిపై ట్విటర్ ద్వారా ఆరోపణలు చేసింది పూనమ్ కౌర్. కానీ ఆ వ్యక్తి ఎవరు అని మాత్రం చెప్పలేదు. చివరిగా ‘గురూజీ థింగ్స్’ అంటూ హ్యాష్‌ట్యాగ్ పెట్టడంతో మరోసారి పూనమ్.. త్రివిక్రమ్‌ను టార్గెట్ చేస్తూ మాట్లాడిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. పూనమ్ కౌర్.. త్రివిక్రమ్‌పై ఆరోపణలు చేయాలనుకున్న ప్రతీసారి ఇలా గురూజీ హ్యాష్‌ట్యాగ్‌ను తన ట్వీట్స్‌కు జతచేరుస్తూ ఉంటుంది.
సొంత కథ కాదు..
ప్రస్తుతం త్రివిక్రమ్.. తన అప్‌కమింగ్ మూవీ ‘గుంటూరు కారం’ రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్నారు. జనవరి 12న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. మహేశ్ బాబు హీరోగా తెరకెక్కిన ఈ మూవీలో శ్రీలీల, మీనాక్షి చౌదరీ హీరోయిన్లుగా నటించారు. సంక్రాంతికి ఇతర పెద్ద హీరోల సినిమాలతో పోటీ ఉన్నా కూడా ‘గుంటూరు కారం’కు తగినంత హైప్ క్రియేట్ అవ్వడంతో మూవీ టీమ్ ధీమాతో ఉన్నారు. పైగా అన్ని సినిమాలతో పోలిస్తే.. ప్రేక్షకులంతా ముందుగా ‘గుంటూరు కారం’కే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక ఈ మూవీ విడుదల దగ్గర పడుతున్న సమయంలో ‘గుంటూరు కారం’ కథపై సోషల్ మీడియాలో పలు రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇది త్రివిక్రమ్ సొంతంగా రాసుకున్న కథ కాదని కొందరు నెటిజన్లు అనుకుంటున్నారు.
‘కీర్తి కిరీటాలు’ నవల ఆధారంగా..
యద్ధనపూడి సులోచనారాణి రాసిన ‘కీర్తి కిరీటాలు’ అనే నవలలోని కథ ఆధారంగా ‘గుంటూరు కారం’ మూవీ తెరకెక్కిందని సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. కానీ ఒక నవలను సినిమా రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలంటే కాపీరైట్స్‌ను దక్కించుకోవాలి. ఆ తర్వాత నవల రాసినవారికి తగిన క్రెడిట్స్ ఇవ్వాలి. కానీ త్రివిక్రమ్ అవేమీ చేయకుండానే కీర్తి కిరీటాలు కథను కాపీ కొట్టారని కొందరు ఆరోపిస్తున్నారు. అయితే మాటల మాంత్రికుడిగా పేరు తెచ్చుకున్న త్రివిక్రమ్‌పై ఇలాంటి ఆరోపణలు రావడం ఇదేమీ మొదటిసారి కాదు. నితిన్ హీరోగా తను తెరకెక్కించిన ‘అ..ఆ..’ మూవీ సమయంలో కూడా ఇదే విధంగా కాంట్రవర్సీ క్రియేట్ అయ్యింది. ఇప్పుడు మరోసారి ‘గుంటూరు కారం’ విషయంలో కూడా అదే విధంగా కాంట్రవర్సీలు క్రియేట్ అవుతున్నాయి.
Also Read: ఏంటి గురూజీ, 'గుంటూరు కారం' కూడా కాపీయేనా?