Pooja Hegde About Male Dominance In Movie Industry: ఒకప్పుడు టాలీవుడ్‌లో అగ్ర హీరోల సరసన నటించిన స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే (Pooja Hegde). ప్రస్తుతం ఆమెకు కాస్త అవకాశాలు తగ్గినా స్క్రిప్ట్స్ ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో అగ్ర హీరోల సరసన నటించి బుట్టబొమ్మగా మెప్పించారు. తాజాగా.. ఓ ఇంటర్వ్యూలో పూజా.. మూవీ ఇండస్ట్రీలో పురుషాధిక్యం, వివక్షపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Continues below advertisement


'నేనూ వివక్ష ఎదుర్కొన్నా..'


తోటి నటుల కారణంగా ఎప్పుడైనా ఇబ్బంది పడ్డారా.? అన్న ప్రశ్నకు సమాధానంగా.. సినిమా సెట్స్‌లో తానూ వివక్ష ఎదుర్కొన్నట్లు చెప్పారు. 'తోటి నటుల కారణంగా ఇబ్బంది అనేది అన్ని పరిశ్రమల్లోనూ ఉంది. అయితే, ఒక్కో చోట ఒక్కో రకంగా ఉంటుంది. అయితే, పరిస్థితులను బట్టి దాని స్థాయిలు మారిపోతూ ఉంటాయి. ఉదాహరణకు షూటింగ్ సెట్ పక్కనే హీరో వ్యానిటీ వ్యాన్ ఉంచుతారు. మిగిలిన వారివి దూరంగా ఉంటాయి. మేము బరువైన కాస్ట్యూమ్స్, బారీ లెహంగాలు ధరించి సెట్ వరకూ నడుచుకుంటూ రావాలి. కొన్నిసార్లు అది చూసేందుకు బాగున్నా.. బరువైన దుస్తులతో ఈడ్చుకుంటూ షూట్ అయ్యాక వెళ్లాల్సి ఉంటుంది. ఇదో రకమైన వివక్ష.' అని తెలిపారు.


Also Read: రాకింగ్ స్టార్ యష్ యాక్షన్ మూవీ 'టాక్సిక్' వచ్చేస్తోంది! - రిలీజ్ డేట్ ఎప్పుడో తెలుసా.?, యష్ లుక్ అదుర్స్


'ఎలాంటి గుర్తింపు ఉండదు'


ఇంకొన్ని సార్లు పోస్టర్‌లో తమ పేరు కూడా ఉండదని పూజా హెగ్డే అన్నారు. 'లవ్ స్టోరీలో నటించినా ఎలాంటి గుర్తింపు ఇవ్వరు. సినిమా అనేది సమిష్టి కృషి అని అంతా గుర్తించాలి. అందరూ నా అభిమాన హీరోలే. నాకు అనుష్క శర్మ అంటే ఎంతో ఇష్టం. ఎందుకంటే ఆమె వ్యక్తిత్వానికి నేను దగ్గరగా ఉంటాను. ఒకప్పుడు ఇండస్ట్రీలో ఆమెకు ఎలాంటి సపోర్ట్ లేదు. ఆమెకు కూడా నాలానే పార్టీలంటే ఇష్టం ఉండదు. అచ్చం నాలానే మరొకరు ఉన్నారంటే సంతోషంగా ఉంటుంది.' అని అన్నారు.


ఫస్ట్ సంతోషించేది నేనే..


హీరోయిన్లు భారీగా రెమ్యునరేషన్ అందుకుంటున్నారంటే ముందుగా సంతోషించేది తానే అని పూజా హెగ్డే అన్నారు. దశాబ్దాలుగా అగ్ర హీరోలతో, భారీగా రెమ్యునరేషన్ అందుకుంటున్న వారితో కలిసి నటించినా తనను తాను ఎప్పుడూ రెండో తరగతి పౌరురాలిగానే చూసుకుంటానని అన్నారు.


ఇక సినిమాల విషయానికొస్తే.. పూజా హెగ్డే ఈ ఏడాది షాహిద్‌కపూర్ 'దేవ'లో నటిస్తున్నారు. ప్రస్తుతం సూర్యతో 'రెట్రో', లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో 'కూలీ', రాఘవ లారెన్స్ 'కాంచన 4', విజయ్‌తో కలిసి 'జన నాయగన్'లో నటిస్తున్నారు.