Toxic Movie Release Date: రాకింగ్ స్టార్ యష్ యాక్షన్ మూవీ 'టాక్సిక్' వచ్చేస్తోంది! - రిలీజ్ డేట్ ఎప్పుడో తెలుసా.?, యష్ లుక్ అదుర్స్

Rocking Star Yash: రాకింగ్ స్టార్ యష్ లేటెస్ట్ మూవీ 'టాక్సిక్' రిలీజ్ డేట్ వచ్చేసింది. వచ్చే ఏడాది మార్చి 19న మూవీ రిలీజ్ చేయనున్నట్లు టీం అధికారికంగా ప్రకటించింది.

Continues below advertisement

Yash's Toxic Movie Release Date Announced: 'కేజీఎఫ్', 'కేజీఎఫ్ 2' వంటి హిస్టారికల్ సక్సెస్ తర్వాత కన్నడ రాకింగ్ స్టార్ యష్ (Yash) రేంజ్ మారిపోయింది. ఆయన ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు. ఆయన తన లేటెస్ట్ మూవీ నేషనల్ అవార్డ్ విన్నర్, లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్‌తో కలిసి 'టాక్సిక్ : ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్' (Toxic) అనే గ్యాంగ్ స్టర్ డ్రామాలో నటిస్తున్నారు. కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో తెరకెక్కుతోన్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Continues below advertisement

రిలీజ్ ఎప్పుడంటే..?

తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ను మేకర్స్ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. 'టాక్సిక్'ను వచ్చే ఏడాది మార్చి 19న విడుదల చేయబోతోన్నట్లు ప్రకటించారు. ఉగాది, గుడి పడ్వాతో మార్చి 19న కొత్త సంవత్సరాన్ని ప్రారంభించడంతో పాటు, మార్చి 20/21న ఈద్ వేడుకలతో 'టాక్సిక్' భారతదేశం అంతటా సందడి చేయనుందంటూ రాసుకొచ్చారు. అంతర్జాతీయ ప్రాజెక్ట్‌‌గా టాక్సిక్ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. ఈ చిత్రాన్ని హిందీ, తెలుగు, తమిళం, మలయాళంతో పాటు ఇతర భాషల్లోకీ డబ్ చేయనున్నారు. 

Also Read: 'అదే జరిగుంటే నేను సూసైడ్ చేసుకునేవాడినేమో' - 'ఖుషి' మూవీ రిజల్ట్‌పై ఎస్‌జే సూర్య ఏమన్నారంటే.?

పోస్టర్ అదుర్స్

'టాక్సిక్' మూవీ విడుదల తేదీ ప్రకటన సందర్భంగా రాకింగ్ స్టార్ యష్ 'టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్' నుంచి అద్భుతమైన పోస్టర్‌ను రిలీజ్ చేశారు. పోస్టర్‌లో కనిపించే మంటలు, చుట్టూ ఉన్న పొగ, హీరోని చూపించిన తీరు, ఆ గన్‌ను పట్టుకున్న విధానం, హీరో పెట్టుకున్న టోపీ ఇలా అన్నీ కూడా ఎంతో స్టైలిష్‌గా ఉన్నాయి. యష్ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేసిన గ్లింప్స్ నేషనల్, ఇంటర్నేషనల్ వైడ్‌గా ట్రెండింగ్‌గా మారాయి.

ఈ ప్రతిష్టాత్మక వెంచర్‌కు అంతర్జాతీయంగా ప్రశంసలు పొందిన మేకర్ గీతు మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. జాతీయ అవార్డు, సన్‌డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రతిష్టాత్మక గ్లోబల్ ఫిల్మ్‌ మేకింగ్ అవార్డు వంటి వాటితో ఆమె ప్రపంచ వేదికలపై తన సత్తా చాటారు. ఇప్పుడు 'టాక్సిక్' మూవీతో మరోసారి తన మార్క్ వేయబోతోన్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్‌పై.. వెంకట్ కె.నారాయణ, యష్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో డారెల్ డిసిల్వా అనే హాలీవుడ్ నటుడితో పాటు అక్షయ్ ఒబెరాయ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. అలాగే నయనతార, కియారా అద్వానీ ఫిమేల్ లీడ్స్‌గా కనిపించబోతున్నారు. ఈ సినిమా కోసం కియారా భారీగా రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆమె రూ.15 కోట్ల రెమ్యునరేషన్ అందుకోనున్నట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్. సినిమాను ఇంటర్నేషనల్ వైడ్‌గా రిలీజ్ చేయడానికి గ్లోబల్ స్టూడియోతో 'టాక్సిక్' మేకర్స్ చేతులు కలుపుతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన పనిని ఇటీవలే పూర్తి చేసినట్టు హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ జెజె పెర్రి ఇటీవల తన ఇన్ స్టాలో ప్రకటించారు. ఇండియాలో ఈ మూవీకి పని చేయడం సంతోషంగా ఉందని.. సినిమాను ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు చూస్తారా..? అని ఆతృతగా ఉందన్నారు.

Continues below advertisement