Actor Posani Latest News : గుంటూరు జైలు నుంచి నటుడు పోసాని కృష్ణమురళి విడుదల 

Actor Posani Latest News :అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్టై జైల్లో ఉన్న పోసాని కృష్ణమురళి విడుదలయ్యారు. ఆయనకు శుక్రవారం బెయిల్ వచ్చింది. పోసాని ఫిబ్రవరి 26న అరెస్టు అయ్యారు.

Continues below advertisement

Actor Posani Latest News : ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ఇరుక్కొని జైలు పాలైన పోసాని కృష్ణమురళి ఇవాళ విడుదలయ్యారు. ఈ కేసులో ఆయన్ని ఫిబ్రవరి 26 అన్నమయ్య జిల్లా పోలీసులు అరెస్టై చేశారు. అనంతరం ఆయనపై ఉన్న వివిధ కేసుల్లో కర్నూలు, గుంటూరు పోలీసులు కూడా విచారించారు. అందుకే ఆయన్ని కర్నూలు జైలులో కొన్నిరోజులు, గుంటూరు జిల్లా జైలులో మరికొన్ని రోజులు ఉంచారు. అన్ని కేసుల్లో కూడా శుక్రవారం నాడు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన్ని ఇవాళ మధ్యాహ్నం విడుదల చేశారు.  

Continues below advertisement

పోసాని కృష్ణమురళికి సీఐడీ కోర్టు శుక్రవారం బెయిల్ ఇచ్చింది. మార్ఫింగ్ ఫోటోలు చూపిండం, చంద్రబాబు, లోకేష్, పవన్‌ను దూషించిన వ్యవహరంపై రాష్ట్రవ్యాప్తంగా పదికిపైగా కేసులు నమోదు అయ్యాయి. వాటిలో ఒక్కో ప్రాంత పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకొని విచారించారు. సమాజంలో వర్గాల మధ్య ద్వేషాన్ని పెంచి అల్లర్లు చెలరేగే కుట్ర పన్నారని ఆయనపై కేసులు నమోదు అయ్యాయి. మొన్నీ మధ్య కర్నూలు జైలులో ఉన్నప్పుడు బెయిల్ వచ్చింది. కానీ ఆయన విడుదల టైంలోనే సీఐడీ పోలీసులు పీటీ వారెంట్‌పై అదుపులోకీ తీసుకున్నారు. 
ఫిబ్రవరి 26 నుంచి పోసాని బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు. 

పెట్టిన కేసుల్లో చెప్పినట్టు అంశాలు అంత తీవ్రమైనవి కావని కోర్టుల్లో వాదిస్తూ వచ్చారు పోసాని. అయితే సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నటైంలో ఆయన తీవ్ర నిరాశతో మాట్లాడారు. కోర్టు న్యాయమూర్తి రిమాండ్‌కు తరలించిన తర్వాత న్యాయమూర్తితో మాట్లాడారు. తనకు 70ఏళ్ల వయసు వచ్చిందని చాలా ఆరోగ్య సమస్యలు ఉన్నాయని తెలిపారు. తనకు బెయిల్ ఇవ్వకపోతే ఆత్మహత్య శరణ్యమని అన్నారు. ఎప్పుడు ఏ కేసులో తనను తీసుకెళ్తున్నరో  కూడా తెలియడం లేదని ఈ వయసులో ఇలా చేయడం సరికాదని అన్నారు. పీపీలు కూడా అన్యాయంగా వాదిస్తున్నారని వాపోయారు.  

లైడిటెక్టర్‌ పరీక్ష చేసి తాను తప్పు చేసినట్టు నిరూపితమైతే నరికేయాలని న్యాయమూర్తితో అన్నారు పోసాని. రెండుసార్లు స్టంట్‌లు వేశారని ఆరోగ్యం సహకరించడం లేదని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పోసానిపై 30కి పైగా ఫిర్యాదులు వచ్చాయి. వాటిని పరిశీలించిన అధికారులు 17 చోట్ల కేసులు పెట్టారు. అందులో భాగంగా ఫిబ్రవరి 26న అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌లోని మైహోంభుజాలో అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచి ఆయన్ని వివిధ కేసుల్లో స్టేషన్ల చుట్టూ తిప్పుతూనే ఉన్నారు.   

కేవలం వ్యంగ్యంగా మాట్లాడినందుకే పోసాని కృష్ణమురళిపై 18 కేసులు పెట్టి 24 రోజులు జైల్లో పెట్టారని వైసీపీ నేత అంబటి రాంబాబు విమర్శించారు.  గుంటూరు జైలు నుంచి విడుదలైన పోసాని కృష్ణమురళిని అంబటి రాంబాబు పరామర్శించారు. కోర్టు షరతుల మేరకు పోసాని మీడియాతో మాట్లాడటం లేదనన్న రాంబాబు... తాను మాట్లాడతానుంటూ చెప్పుకొచ్చారు.  70 ఏళ్ల వయసులో పోసానని రాష్ట్రమంతా తిప్పడం ఏంటని ప్రశ్నించారు. వెటకారంగా మాట్లాడారని పోసానిపై కేసులుపెట్టారన్నారు. ఇలాంటి అక్రమ కేసులు పెట్టిన వారిని వదిలే ప్రసక్తి లేదని హెచ్చరించారు. 

Continues below advertisement