Netizens Trooling On Actress Pooja Hegde: పూజా హెగ్డేను (Pooja Hegde) ఆమె అభిమానులు గత కొంతకాలంగా బుట్టబొమ్మ అని పిలుచుకుంటున్నారు. పాన్ ఇండియా హీరోయిన్‌గా ఎదగడానికి, ఆ పేరు రావడానికి కారణమైన మూవీ 'అల వైకుంఠపురంలో' విషయంలో నోరు జారి, దారుణమైన ట్రోలింగ్‌ను ఎదుర్కొంటోంది. ఆమెను సోషల్ మీడియా వేదికగా ఏకిపారేస్తున్న నెటిజన్లు. పూజా హెగ్డేను ఊర్వశి రౌతెలతో పోలుస్తూ ఆడుకుంటున్నారు. 

అసలేం జరిగిందంటే? పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన లేటెస్ట్ మూవీ 'దేవా'. ఈ సినిమా ప్రమోషన్స్ సందర్భంగా మాట్లాడుతూ.. "అల వైకుంఠపురంలో' మూవీ నిజానికి తమిళ సినిమా. ఇది పాన్ ఇండియా సినిమా కాదు. కానీ ఈ మూవీని హిందీలో కూడా ప్రేక్షకులు ఆదరించారు. అంటే కంటెంట్ బాగుంటే చాలు, మూవీని జనాలు తప్పకుండా ఆదరిస్తారు" అని చెప్పుకొచ్చింది. 

పూజా హెగ్డేపై ట్రోలింగ్ పూజా హెగ్డే 'అల వైకుంఠపురంలో' మూవీ తమిళ మూవీ అని చెప్పడంతో, ఆమెకు లైఫ్ ఇచ్చిన మూవీని ఏ భాషలో చేసిందో కూడా మర్చిపోయింది అంటూ ఏకిపారేస్తున్నారు నెటిజన్లు. అంతేకాకుండా టాలీవుడ్‌లో ఇలాంటి హీరోయిన్లను బ్యాన్ చేయాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొంత మంది ఊర్వశి రౌతెలా 2.0 అంటున్నారు. ముఖ్యంగా అల్లు అర్జున్ అభిమానులు తన కెరీర్‌ను కీలక మలుపు తిప్పిన మూవీనే ఎలా మర్చిపోయింది అంటూ మండిపడుతున్నారు. 

ఇదిలా ఉండగా, 'అల వైకుంఠపురములో' మూవీలో అల్లు అర్జున్, పూజా హెగ్డే, టబు, జయరామ్, సుశాంత్, నివేదా పేతురాజ్ ప్రధాన పాత్రలు పోషించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. నిర్మాతలు అల్లు అరవింద్, రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మించారు. 2020లో రెండవ హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన మూవీగా రికార్డును క్రియేట్ చేసింది. అలాగే బెస్ట్ మ్యూజిక్ కేటగిరీలో ఈ మూవీ జాతీయ అవార్డును గెలుచుకుంది. అక్కడితో 'అల వైకుంఠపురంలో' సందడి అయిపోలేదు. హిందీలో 'షెహజాదా' పేరుతో రీమేక్ చేశారు. ఇందులో కార్తీక్ ఆర్యన్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటించారు. 2022లో హిందీలో రిలీజ్ అయిన 'షెహజాదా' మూవీ పెద్దగా ఆడలేదు. 

'రాధే శ్యామ్' సినిమా వల్లే 'రెట్రో' ఛాన్స్ 'దేవా' మూవీ ప్రమోషన్లలోనే పూజా 'రెట్రో' ఛాన్స్ గురించి మాట్లాడుతూ.. మళ్లీ ట్రోలింగ్ బారిన పడింది. పూజా హెగ్డే మాట్లాడుతూ.. "రాధే శ్యామ్ సినిమాలో కొన్ని సీన్లలో తన యాక్టింగ్ చూసి, 'రెట్రో' మూవీలో డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ ఛాన్స్ ఇచ్చారు" అని చెప్పుకొచ్చింది. అసలే 'రెట్రో' మూవీలో ఆమె లుక్‌పై అభిమానులు డిసప్పాయింట్ అయ్యారు. అది సరిపోలేదు అన్నట్టు ఫ్లాప్ మూవీ 'రాధేశ్యామ్' వల్ల ఈ మూవీలో ఛాన్స్ వచ్చింది అని చెప్పి మళ్లీ వార్తల్లో నిలిచింది. ఇలా వరుసగా వివాదాస్పద స్టేట్మెంట్లు ఇస్తూ, సినిమాల కంటే ఎక్కువగా ట్రోలింగ్‌తోనే అందరి దృష్టిని ఆకర్షిస్తోంది బాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే. అందుకే ఇటీవల సందర్భం చూసుకోకుండా వివాదాస్పద స్టేట్మెంట్లు ఇచ్చిన ఊర్వశితో పూజాను పోలుస్తున్నారు. 

Also Read: ఎస్వీఆర్ మనవడితో ఎంట్రీ... సీఎం కొడుకుతో సినిమా... ప్రియాంకా చోప్రా మరదలు టాలీవుడ్ హీరోయినే