FIFA Post: దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన 'ఆర్ఆర్ఆర్' సినిమాలోని సూపర్ హిట్ సాంగ్ 'నాటు నాటు'ని తాజాగా అంతర్జాతీయ ఫుట్ బాల్ సంస్థ వారి సోషల్ మీడియా హ్యాండిల్‌లో ప్రస్తావించడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాలో ఒక మెయిన్ లీడ్‌గా నటించిన జూనియర్ ఎన్టీఆర్ రియాక్ట్ అవ్వడం మరింత క్రేజీగా మారింది. 

'నాటు' సాంగ్ రిఫరెన్స్ తో ఫిఫా పోస్ట్ 2022 లో రిలీజ్ అయిన 'ఆర్ఆర్ఆర్' సినిమాలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి చిందులేసిన 'నాటు నాటు' సాంగ్ ప్రపంచవ్యాప్తంగా మ్యూజిక్ లవర్స్‌ని ఉర్రూతలూగించిన సంగతి తెలిసిందే. ఈ పాటకి ఏకంగా ఆస్కార్ సైతం ఫిదా అయింది. ఇక తాజాగా అంతర్జాతీయ ఫుట్ బాల్ సంస్థ తమ అఫిషియల్ సోషల్ మీడియా హ్యాండిల్‌లో 'ఆర్ఆర్ఆర్' మూవీలోని 'నాటు నాటు' సాంగ్ ఐకానిక్ స్టెప్‌ను ప్రస్తావిస్తూ ఒక పోస్ట్‌ను షేర్ చేసింది. 

లెజెండరీ ఫుట్ బాల్ ప్లేయర్స్ నెమారో, కార్లోస్ టెవ, క్రిస్టియానో రోనాల్డోల పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పోస్ట్‌ని చేసింది. ఫిబ్రవరి 5న ఈ లెజెండ్స్ జన్మించారు. ఒక స్టిల్ రూపంలో, ఈ దిగ్గజ ప్లేయర్లు ముగ్గురూ ఆ 'నాటు నాటు' సిగ్నేచర్ హూక్ స్టెప్‌ను వేస్తున్నట్టుగా ఉండే ఫోటోని షేర్ చేసింది. పైగా దానిపై నెమారో, కార్లోస్ టెవ, క్రిస్టియానో రోనాల్డోల పేర్లలోని ఫస్ట్ లెటర్‌తో NTR అని డిజైన్ చేశారు. ఇంకేముంది క్షణాల్లో ఆ పోస్ట్ వైరల్ కావడంతో ఎన్టీఆర్ వరకూ చేరింది వార్త. వెంటనే ఎన్టీఆర్ ఫిఫా పోస్ట్‌పై స్పందిస్తూ "హహ... హ్యాపీ బర్త్ డే నెమారో, కార్లోస్, రోనాల్డో" అంటూ రిప్లై ఇచ్చారు. ఫిఫా ఈ పోస్ట్ చేసిన గంటలు వ్యవధిలోనే లక్షకు పైగా లైకులను సంపాదించింది. మొత్తానికి నెటిజన్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ పోస్ట్‌పై సినిమా, స్పోర్ట్స్ మధ్య పర్ఫెక్ట్ క్రాస్ ఓవర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

'డ్రాగన్'పై ఎన్టీఆర్ ఫోకస్ 'ఆర్ఆర్ఆర్' మూవీలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రను పోషించిన సంగతి తెలిసిందే. ఇందులో ఆయన అద్భుతమైన నటన అంతర్జాతీయ స్థాయిలో అభిమానులను తెచ్చిపెట్టింది. ఇక ఆస్కార్ అవార్డును గెలుచుకున్న 'నాటు నాటు' పాటతో తెలుగు సినిమా కీర్తిని ఇంటర్నేషనల్ లెవెల్‌కి తీసుకెళ్లారు జక్కన్న, కీరవాణి. దాదాపు 1200 కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టిన ఈ మూవీలో రామ్ చరణ్ కూడా మరో హీరోగా నటించారు. ఇక ఈ మూవీ తర్వాత ఎన్టీఆర్ హీరోగా నటించిన 'దేవర' మూవీ పాన్ ఇండియా రేంజ్‌లో తెరపైకి వచ్చింది. దాదాపు రూ. 466 కోట్ల కలెక్షన్స్‌తో తారక్ ఖాతాలో మరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం ఎన్టీఆర్ 'వార్ 2'లో హృతిక్ రోషన్‌తో కలిసి నటిస్తున్నారు. ఎన్టీఆర్‌కు ఇదే ఫస్ట్ హిందీ మూవీ. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం ముంబైలో శరవేగంగా జరుగుతుంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ 2025 ఆగస్టు 15న రిలీజ్ కాబోతోంది. మరోవైపు తారక్ 'ఎన్టీఆర్ 31' మూవీ కోసం సిద్ధమవుతున్నారు. ఈ మూవీకి 'డ్రాగన్' అనే టైటిల్‌‍ను పెట్టారని ప్రచారం జరుగుతుండగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందబోతున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే హైదరాబాద్లో మొదలు కాబోతోంది.

Also Read: పవన్, మహేష్ సినిమాలతో 100 కోట్ల నష్టం... రమేష్‌దే తప్పు - బండ్ల గణేష్ వైరల్ ట్వీట్