Rohini In Rave Party: ప్రస్తుతం బుల్లితెరపై మోస్ట్ వాంటెడ్ ఆర్టిస్ట్‌గా వెలిగిపోతున్న వారిలో రోహిణి కూడా ఒకరు. బుల్లితెరపై తన కామెడీకి చాలా డిమాండ్ ఉంది. అలాంటి రోహిణి.. తాజాగా రేవ్ పార్టీలో దొరికింది అంటూ ఒక వీడియో బయటికొచ్చింది. అందులో తను.. మరికొందరు కుర్రాళ్లతో కనిపించింది. రేవ్ పార్టీలో పాల్గొన్నందుకు తనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కానీ రోహిణి మాత్రం బర్త్ డే పార్టీ అనుకొని వచ్చానని, రేవ్ పార్టీకి తనకు సంబంధం లేదని మీడియాతో మాట్లాడింది. ఈ మొత్తం సంఘటనలో చిన్న ట్విస్ట్ కూడా ఉంది. రోహిణి రేవ్ పార్టీకి రావడం, పోలీసులకు దొరకడం.. అంతా ఒక మూవీ ప్రమోషన్ కోసమే.
టెస్టులు చేయలేదు..
తాజాగా విడుదలయిన వీడియోలో ముందుగా రేవ్ పార్టీలో పాల్గొన్నందుకు పోలీసులు.. రోహిణిని అదుపులోకి తీసుకుంటారు. అక్కడే మీడియా కూడా వచ్చి రేవ్ పార్టీ గురించి తనను ప్రశ్నిస్తుంది. తనకు ఇంకా ఎలాంటి టెస్టులు చేయలేదని, పాజిటివ్ కూడా రాలేదని వాపోతుంది రోహిణి. ‘‘మీకు దండం పెడతాను. ఇలాంటి ఎన్ఆర్ఐలు పార్టీలు ఉన్నాయని పిలిచినప్పుడు వివరాలు తెలుసుకోకుండా వెళ్లొద్దు’’ అని చెప్పింది. దీంతో అసలు కథ ఫ్యాష్‌బ్యాక్‌లోకి వెళ్తుంది. హైదరాబాద్‌లోని ఒక పబ్‌లో కొందరు కుర్రాళ్లంతా పార్టీ చేసుకుంటూ ఉంటారు. అప్పుడే రోహిణి కూడా అక్కడికి వస్తుంది. అది ఒక బర్త్ డే ఈవెంట్ అనుకొని, దానిని హోస్ట్ చేయాలేమో అనుకుంటుంది. కానీ అసలు విషయం అది కాదు.
తెల్లవార్లు పార్టీ..
రోహిణి లోపలికి రాగానే ఫోన్స్ అనుమతి లేదని చెప్తారు ఆ కుర్రాళ్లు. అది నమ్మి తన ఫోన్‌ను వెయిటర్‌కు ఇచ్చేస్తుంది. గెస్ట్ లిస్ట్ ఇవ్వమంటే అలాంటిది ఏమీ ఉండదని చెప్తారు. రాత్రి 12 వరకు పార్టీ అయిపోతుందా అని అడగగా.. వారంతా నవ్వి ‘‘తెల్లవార్లు పార్టీ నడుస్తూనే ఉంటుంది’’ అంటారు. ‘‘తెల్లవార్లు అంటే అవ్వదిక్కడ. నా మొగుడు వెయిటింగ్’’ అని చెప్తుంది రోహిణి. అదే సమయంలో అక్కడికి పోలీసులు వస్తారు. వారి నుండి తప్పించుకోవడానికి పిఠాపురం ఎమ్మెల్యేగారి తాలుకా అని చెప్తాడు ఒక కుర్రాడు. అప్పుడే అది రేవ్ పార్టీ అని రోహిణికి అర్థమవుతుంది. అలా ఆ కుర్రాళ్లతో పాటు రోహిణిని కూడా రేవ్ పార్టీ కేసులో అదుపులోకి తీసుకుంటారు పోలీసులు.
యూత్‌ఫుల్ కథ..
ఫైనల్‌గా ఈ వీడియో అంతా ‘ది బర్త్ డే బాయ్’ మూవీ ప్రమోషన్ కోసమే ఇదంతా చేశారు. యూత్‌ఫుల్ కథలతో వచ్చిన సినిమాలు సైలెంట్‌గా వచ్చి హిట్‌ను అందుకుంటున్నాయి. అలాంటి కథతోనే ‘ది బర్త్ డే బాయ్’ మూవీ కూడా జులై 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. బొమ్మ బొరుసా బ్యానర్‌లో నిర్మించిన ఈ మూవీని విషీ డైరెక్ట్ చేశాడు. రవికృష్ణ, సమీర్ మల్లా, రాజీవ్ కనకాల.. ఇందులో ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఇక ఇప్పటికే ‘ది బర్త్ డే బాయ్’ మూవీ నుండి విడుదలయిన ప్రతీ ప్రమోషనల్ వీడియో.. యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. తాజాగా విడుదలయిన రేవ్ పార్టీ వీడియో కూడా ప్రమోషన్స్‌లో వేగం పెంచింది.
Also Read: సమంత హెల్త్ టిప్ ప్రాణాలు తీస్తుందా? హైడ్రోజన్ పెరాక్సైడ్ అంత డేంజరా.. నిపుణులు ఏమంటున్నారు?