Indian 2 Completes Censor: చాలారోజుల వరకు సౌత్ నుండి పెద్దగా ప్యాన్ ఇండియా చిత్రాలు ఏమీ విడుదలకు సిద్ధంగా. అందుకే ‘కల్కి 2898 AD’ హవా ఇంకా చాలాకాలం కొనసాగే అవకాశం ఉంది. ఆ తర్వాత కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ఇండియన్ 2’ (తెలుగులో ‘భారతీయుడు 2’) రంగంలోకి దిగనుంది. ఈ మూవీ రిలీజ్ అయిన చాలారోజుల వరకు ఇతర పెద్ద సినిమాలు ఏవీ రిలీజ్ లేకపోవడంతో ‘ఇండియన్ 2’కు ప్లస్‌గా మారింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ పూర్తయ్యింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికెట్ (సీబీఎఫ్‌సీ).. ‘ఇండియన్ 2’కు U/A సర్టిఫికెట్‌ను అందించింది.
పదాలు తొలగింపు..
కమల్ హాసన్ హీరోగా నటించిన ‘ఇండియన్ 2’లో పలు మార్పులు చేయాలని సీబీఎఫ్‌సీ ఆదేశించింది. అందులో భాగంగా ఏడు ఇంగ్లీష్, తమిళ పదాలను తొలగించమని చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో పాటు అయిదు అత్యవసరమైన మార్పులు చేసింది. స్మోకింగ్ సీన్స్ వచ్చినప్పుడు పొగత్రాగడం ఆరోగ్యానికి హానికరం అని అందరికీ స్పష్టంగా కనిపించేలా జాగ్రత్తలు తీసుకోమన్నారు. ‘లంచం మార్కెట్’ అనే లేబుల్‌ను తొలగించమన్నారు. ఎక్స్‌పోజింగ్ ఎక్కువగా ఉన్న సీన్‌లో బాడీని కాస్త బ్లర్ చేయమన్నారు. అంతే కాకుండా ‘ఇండియన్ 2’ సినిమాలో ‘ఇండియన్’, ‘డర్టీ ఇండియన్’తో పాటు మరొక ఇంగ్లీష్ బూతును కూడా మార్చమని సీబీఎఫ్‌సీ ఆదేశించినట్టు సమాచారం.
నిడివి ఎంతంటే.?
శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఇండియన్ 2’లో కొంచెం కాపీరైట్ కంటెంట్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. దాని నుండి తర్వాత ఎలాంటి సమస్యలు రాకుండా మూవీ టీమ్‌ను ఎన్‌ఓసీ సర్టిఫికెట్ తీసుకోమని సలహా ఇచ్చింది సెన్సార్ బోర్డ్. ఇప్పటికే మేకర్స్ ఆ సర్టిఫికెట్‌ను తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక సీబీఎఫ్‌సీ చెప్పిన మార్పులు అన్నీ చేసిన తర్వాత ‘ఇండియన్ ’.. జులై 12 తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో కూడా విడుదలకు సిద్ధమయ్యింది. అన్ని మార్పులు చేసిన తర్వాత సినిమా నిడివి మూడు గంటలు అయినట్టు తెలుస్తోంది. ఇప్పటికే దాదాపు 3 గంటల నిడివితో ఉన్న పలు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌ను అందుకున్నాయి. ఇప్పుడు ‘ఇండియన్ 2’ కూడా ఆ లిస్ట్‌లో యాడ్ అవ్వనుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
పాజిటివ్ ఇంపాక్ట్..
1996లో విడుదలయిన ‘భారతీయుడు’కు సీక్వెల్‌గా తెరకెక్కిన చిత్రమే ‘ఇండియన్ 2’. ఈ సినిమాలో నటించడం కోసం కమల్ హాసన్ రూ.150 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నట్టు సమాచారం. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్, కాజల్, సిద్దార్థ్, ప్రియా భవానీ శంకర్, బాబీ సింహా.. ఇతర కీలక పాత్రల్లో కనిపించారు. తాజాగా ‘కల్కి 2898 AD’లో చిన్న పాత్రలో మెరిశారు కమల్ హాసన్. దీంతో ఈ మూవీ రిజల్ట్.. ‘ఇండియన్ 2’పై పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ అయ్యేలా చేసింది. ఇప్పటికే పలుమార్లు విడుదలను వాయిదా వేసుకున్న ‘ఇండియన్ 2’.. జులై 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read: కల్కిగా కనిపించే హీరో ఎవరు? - డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఏం చెప్పారంటే?