Vijay Devarakonda Kushi Fights : విజయ్ దేవరకొండ ప్రేమకథలో పీటర్ హెయిన్ ఫైట్స్ - యాక్షన్ ఉంది బాస్

విజయ్ దేవరకొండ అభిమానులకు గుడ్ న్యూస్ ఇది. ఇప్పుడు ఆయన 'ఖుషి' అని ఓ ప్రేమ కథ చేస్తున్నారుగా! అందులో ఫైట్స్ కూడా ఉన్నాయి 

Continues below advertisement

విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) అభిమానులకు ఇది గుడ్ న్యూస్. రౌడీ బాయ్ లేటెస్ట్ సినిమా అతి త్వరలో సెట్స్ మీదకు వెళ్ళనుంది. ఈ వారమే సెట్స్ మీదకు సినిమా వెళుతుంది. కొత్త షెడ్యూల్ స్టార్ట్ కానుంది. అదీ యాక్షన్ సీక్వెన్సుతో!

Continues below advertisement

మార్చి 8 నుంచి 'ఖుషి' లేటెస్ట్ షెడ్యూల్!
 Kushi Latest Schedule : సమంత రూత్ ప్రభు అనారోగ్యం (మయోసైటిస్) బారిన పడటంతో 'ఖుషి' చిత్రీకరణకు బ్రేక్ పడింది. గత ఏడాది ఆగస్టులో షూటింగుకు బ్రేకులు పడ్డాయి. అప్పటి నుంచి మళ్ళీ ఎప్పుడు షూటింగ్ మొదలు అవుతుందా? అని విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఎదురు చూశారు. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే...  మార్చి 8 నుంచి 'ఖుషి' లేటెస్ట్ షెడ్యూల్ స్టార్ట్ కానుంది.
 
'ఖుషి'లో పీటర్ హెయిన్ ఫైట్స్!
Peter Hein for Kushi : 'ఖుషి' ప్రేమ కథ అని తెలిసిందే. అయితే, ఈ ప్రేమ కథలో ఫైట్స్ కూడా ఉన్నాయ్! ఫేమస్ స్టంట్ కొరియోగ్రాఫర్ పీటర్ హెయిన్ ఆ ఫైట్స్ కంపోజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు శివ నిర్వాణ ట్వీట్ చేశారు. అదీ సంగతి!

Also Read 'ఎలోన్' రివ్యూ : హాట్‌స్టార్‌లో మోహన్ లాల్ సినిమా - మలయాళంలో కూడా వరస్ట్ సినిమాలు తీస్తారని చెప్పడానికి ఒక ఉదాహరణ   

కొన్ని రోజుల క్రితం 'సిటాడెల్' వెబ్ సిరీస్ షూటింగ్ స్టార్ట్ చేశారు సమంత. దాంతో రౌడీ బాయ్ ఫ్యాన్స్ కొందరు డిజప్పాయింట్ అయ్యారు. ఓ అభిమాని అయితే 'ఖుషి' సంగతి ఏంటి? అని సమంతను ప్రశ్నించారు. అందుకు బదులుగా ఆమె ''అతి త్వరలో 'ఖుషి' మళ్ళీ మొదలు అవుతుంది. విజయ్ దేవరకొండ అభిమానులకు క్షమాపణలు చెబుతున్నా'' అని రిప్లై ఇచ్చారు.  సమంత పూర్తి ఆరోగ్యంగా తిరిగి రావాలని కోరుకుంటున్నట్లు విజయ్ దేవరకొండ ట్వీట్ చేశారు. 

మ్యూజిక్ సిట్టింగ్స్ షురూ!
ఇటీవల 'ఖుషి' దర్శకుడు శివ నిర్వాణ (Shiva Nirvana), సంగీత దర్శకుడు హేషామ్ అబ్దుల్ వాహాబ్ (Hesham Abdul Wahab) ను హీరో విజయ్ దేవరకొండ కలిశారు. సినిమాలో సాంగ్స్ ఎలా ఉండాలనేది డిస్కస్ చేశారు. మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలు అయ్యాయని చిత్ర బృందం తెలిపింది. 

Also Read : 'పఠాన్' కలెక్షన్స్ గ్రేట్, కానీ సౌత్‌పై ఏడుపెందుకు? రాజమౌళిని ట్రోల్ చేసే దమ్ము బాలీవుడ్‌కు ఉందా?

'ఖుషి'ను తొలుత గత ఏడాది డిసెంబర్ 23న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. ఆ తేదీకి ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఎందుకు? అనేది ప్రేక్షకులు అందరికీ తెలుసు. అనుకున్న ప్రకారం చిత్రీకరణ జరగలేదు. హీరో విజయ్ దేవరకొండ కూడా 'లైగర్' చిత్రీకరణలో గాయాలు కావడంతో చికిత్స తీసుకున్నారు. ఆ తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేస్తే ఎలా ఉంటుందని డిస్కషన్స్ జరిగాయి. ప్రస్తుత పరిస్థితి చూస్తే ఫిబ్రవరిలో విడుదల అయ్యే ప్రస్తక్తి లేదు. వేసవికి విడుదల కావచ్చని టాక్. అప్పటికి అయినా వస్తుందో? లేదో?

శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యేర్నేని, రవిశంకర్ యలమంచిలి 'ఖుషి' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనిని తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో మలయాళ నటుడు జయరామ్, మరాఠీ నటుడు సచిన్ ఖేడేకర్, ఇంకా మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, రోహిణి, 'వెన్నెల' కిశోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య ప్రదీప్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఫైట్స్: పీటర్ హెయిన్, సంగీత దర్శకుడు : హిషామ్ అబ్దుల్ వాహాబ్, సీఈవో : చెర్రీ, ఛాయాగ్రహణం: జి. మురళి

Continues below advertisement