ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ హీరో హీరోయిన్లుగా నటించిన తాజా సినిమా ‘బలగం‘. జబర్దస్త్ కమెడియన్ వేణు యెల్దండి ఈ సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. దిల్‌రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై హర్షిత్ రెడ్డి, హన్షిత ఈ సినిమాను నిర్మిస్తున్నరు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పిస్తున్నారు. ‘ధమాకా’ సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా మార్చి 3న విడుదలై సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. తొలి షో నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ సినిమాను చూసిన ప్రతి ఒక్కరు చాలా బాగుందంటున్నారు. పల్లెటూరి ప్రేమలను, ఆప్యాయతలను ఈ చిత్రంలో బాగా చూపించారని చెప్తున్నారు. పెద్ద పెద్ద స్టార్స్ నటించకపోయినా, కథలోని బలం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. చక్కటి మౌత్ పబ్లిసిటీతో మంచి ప్రేక్షకాదరణ పొందుతోంది. రోజు రోజుకు ఈ సినిమా చూసే ప్రేక్షకుల సంఖ్య పెరుగుతోంది.
ఓటీటీ రైట్స్ దక్కించుకున్న అమెజాన్ ప్రైమ్
ఇక ఈ హిట్ మూవీ డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజ సంస్థ అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. ఎంతకు కొనుగోలు చేసింది? అనే వివరాలు మాత్రం బయటకు రాలేదు. ఓటీటీలో ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే విషయం కూడా వెల్లడికాలేదు. కానీ, ఏప్రిల్ రెండో వారంలో ఓటీటీ వేదికగా ‘బలగం’ స్ట్రీమింగ్ కు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
సినిమా కథేంటంటే?
కొమురయ్య (సుధాకర్ రెడ్డి) మనవడు సాయిలు (ప్రియదర్శి) పెళ్ళి చేసుకోవలి అనుకుంటాడు. రెండు రోజుల్లో నిశ్చితార్థం అనగా, అతడి తాత కొమురయ్య (సుధాకర్ రెడ్డి) చనిపోతాడు. అప్పటికే సాయిలు (ప్రియదర్శి) అప్పుల్లో ఉంటాడు. ఎంగేజ్ మెంట్ రోజు రూ. 10 లక్షల కట్నం వస్తే అప్పు తీరుద్దామనుకుంటాడు. కానీ, తన తాత చనిపోవడంతో ఆయన ఆశ నిరాశ అవుతుంది. చావు ఇంట్లో అప్పు వాళ్ల గొడవ కారణంగా పెళ్ళి క్యాన్సిల్ అవుతుంది. కానీ, తన తాత చావుకు వచ్చిన మేనత్త బిడ్డ సంధ్య (కావ్య కళ్యాణ్ రామ్)ను చూసి లవ్ లో పడతాడు. ఆమె తండ్రికి కోటీశ్వరుడు అని తెలిసి, ఎలాగైనా తనను పెళ్లి చేసుకుని, అప్పుతీర్చుకోవాలని భావిస్తాడు. ఆ తర్వాత సంధ్యను ఎలా ప్రేమలో పడేశాడు? తన ప్రేమ కోసం చనిపోయిన తాతను ఎలా వాడుకుంటాడు? సంధ్య తల్లిదండ్రులు, సాయిలు మధ్య గొలడవలు ఎందుకు జరుగుతాయి? చివరకు ఏమవుతుంది? అనేది సినిమా కథ.
వివాదంలో ‘బలగం’ సినిమా
ఈ సినిమాకు ఓ వైపు పాజిటివ్ టాక్ వస్తుంటే, మరోవైపు వివాదం చుట్టుముట్టింది. ఈ కథ తనదేనంటూ జర్నలిస్టు గడ్డం సతీష్ తెరమీదకు వచ్చారు. 2011లో తాను రాసిన ‘ పచ్చికి’ అనే కథను కాపీ కొట్టి వాడుకున్నారని ఆరోపించారు. తనకు క్రెడిట్ ఇవ్వకుంటే న్యాయ పోరాటం చేస్తానని హెచ్చరించారు. వివాదాలు ఎలా ఉన్నా సినిమా మాత్రం సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.
Read Also: ‘అహింస’ రిలీజ్ డేట్ ఫిక్స్, మళ్ళీ వాయిదా ఉండదుగా తేజ గారూ?