హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput)కు ప్రేక్షకుల్లో గ్లామరస్ ఇమేజ్ ఉంది. ఆ అమ్మాయి తెలుగు సినిమా ఇండస్ట్రీకి కథానాయికగా పరిచయమైన 'ఆర్ఎక్స్ 100' ఎఫెక్ట్ అటువంటిది. ఆ సినిమా విజయం తర్వాత ఆవిడకు వరుస ఆఫర్లు వచ్చాయి. అందులో విక్టరీ వెంకటేష్ జోడీగా నటించిన 'వెంకీ మామ' కూడా ఉంది. అయితే, 'ఆర్‌డిఎక్స్ లవ్'తో పాటు 'మంగళవారం' సినిమాల్లో ఆవిడ చేసిన గ్లామర్ రోల్స్ హైలైట్ అయ్యాయి. ఇప్పుడు ఆ ఇమేజ్ నుంచి ఆవిడ బయట పడటం కోసం ట్రై చేస్తున్నట్లు ఉన్నారు. రూట్ మార్చి కంప్లీట్ డిఫరెంట్ రోల్ చేస్తున్నారు. 


'రక్షణ' కోసం ఖాకీ చొక్కా వేసిన పాయల్!
Payal Rajput Role In Rakshana Movie: అందాల భామ పాయల్ రాజ్‌పుత్ ప్ర‌ధాన పాత్ర‌లో రూపొందుతున్న సినిమా 'ర‌క్ష‌ణ‌'. ఇందులో రోష‌న్‌, మాన‌స్ కీల‌క పాత్ర‌ల్లో కనిపించనున్నారు. ఇదొక క్రైమ్‌ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్‌. ఇందులో పాయ‌ల్ ప‌వ‌ర్‌ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ రోల్ చేశారు. ఆవిడ ఖాకీ చొక్కా వేయడం ఇది తొలిసారి అని చెప్పాలి.


హ‌రిప్రియ క్రియేష‌న్స్ 'రక్షణ' సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి ప్ర‌ణ‌దీప్ ఠాకోర్ ద‌ర్శ‌క‌ నిర్మాత. స్వీయ దర్శకత్వంలో ఆయన ప్రొడ్యూస్ చేస్తున్నారు. అతి త్వ‌ర‌లో చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రావ‌టానికి స‌న్నాహాలు చేస్తున్నామని ప్ర‌ణ‌దీప్ ఠాకోర్‌ తెలిపారు. ఈ సందర్భంగా సినిమా టైటిల్  పోస్ట‌ర్‌ విడుద‌ల చేశారు.


Also Readఓటేసిన యువ తారలు ఏపీలో ఇద్దరు హీరోలు, పిఠాపురంలో ఓ దర్శకుడు, గుడివాడలో మరో దర్శకుడు... మరి హైదరాబాద్‌లో ఎవరెవరు?


'రక్షణ' ద‌ర్శ‌క నిర్మాత ప్ర‌ణ‌దీప్ ఠాకోర్ మాట్లాడుతూ... ''క్రైమ్‌ ఇన్వెస్టిగేటివ్ నేపథ్యంలో రూపొందుతున్న మిస్టరీ డ్రామా 'రక్షణ'. ఇప్ప‌టి వ‌ర‌కు పాయ‌ల్ చేసిన పాత్రలకు, సినిమాల‌కు పూర్తి భిన్న‌మైన చిత్రమిది. ఆమెను సరికొత్త కోణంలో చూపించే సినిమా. నటిగా పాయల్ రాజ్‌పుత్‌కు మంచి ఇమేజ్‌ను తీసుకు వస్తుంది. ప్రేక్షకులకు సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. ఒక పోలీస్ అధికారి జీవితంలో జరిగిన వాస్తవ సంఘటనల స్పూర్తితో చిత్ర కథ రాశా. నిర్మాణ పరంగా ఏ దశలోనూ రాజీ పడకుండా ఉన్నత విలువలతో తెరకెక్కించాం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి'' అని చెప్పారు.


Also Readమెగా డాటర్ నిహారిక కొణిదెల మాజీ భర్త చైతన్య సెన్సేషనల్ పోస్ట్... జనసేనకు ఆయన వ్యతిరేకమా?



పాయ‌ల్ రాజ్‌పుత్‌, రోష‌న్‌, మాన‌స్‌, రాజీవ్ క‌న‌కాల‌, వినోద్ బాల‌, శివ‌న్నారాయ‌ణ త‌దిత‌రులు నటిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: అనిల్ బండారి, సంగీతం: మహతి స్వ‌ర‌ సాగర్, కూర్పు: గ్యారీ బి హెచ్, స్టంట్స్: వెంకట్ మాస్టర్, ప్రొడక్షన్ డిజైనర్: రాజీవ్ నాయర్, రచయిత:  తయనిధి శివకుమార్, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: ప్రకాష్ జోసెఫ్ - రమేష్ రెడ్డి, నిర్మాణ సంస్థ: హరిప్రియ క్రియేషన్స్, దర్శక నిర్మాత: ప్రణదీప్ ఠాకోర్.


Also Readఅభిమాని గుండెలపై ఎన్టీఆర్ సంతకం - పోలింగ్ బూత్ వద్ద అరుదైన దృశ్యం