పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) కథానాయకుడిగా నాలుగు సినిమాలు ఇప్పుడు సెట్స్ మీద ఉన్నాయి. అందులో 'బ్రో' చిత్రీకరణ దాదాపుగా చివరి దశకు చేరుకుంది. బహుశా... పవన్ చిత్రీకరణ చేయాల్సిన రోజులు వారం కంటే తక్కువ. మిగతా మూడు చిత్రాల్లో 'హరి హర వీరమల్లు'ను ఎప్పుడో మొదలు పెట్టారు. ఎంత వరకు ఫినిష్ చేశారనేది తెలియదు. ఆ సినిమా కంటే తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో 'ఉస్తాద్ భగత్ సింగ్', సుజీత్ దర్శకత్వంలో 'ఓజీ - ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్' స్టార్ట్ చేశారు. 


'ఓజీ' కోసం పక్కా ప్లాన్ రెడీ!
'ఓజీ'లో పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంకా అరుల్ మోహన్ కథానాయిక. నాని 'గ్యాంగ్ లీడర్' తర్వాత తెలుగులో ఆమె చేస్తున్న చిత్రమిది. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ పక్కా ప్లాన్ ప్రిపేర్ చేశారట. ఈ ఏడాది అక్టోబర్ నెలకు చిత్రీకరణ ఫినిష్ చేస్తానని, అందుకు తగ్గట్టుగా షెడ్యూల్స్ ప్లాన్ చేసుకోమని చెప్పారట. 


'బ్రో' తర్వాత 'ఓజీ' వస్తుందా?
'ఓజీ' చిత్రీకరణ అక్టోబర్ నెలకు పూర్తి అయితే పవర్ స్టార్ అభిమానులకు పండగే. జూలై 28న 'బ్రో' ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఆ తర్వాత 'ఓజీ' విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ ఏడాది పవన్ నుంచి మరో సినిమా రావచ్చు. హరీష్ శంకర్ 'ఉస్తాద్ భగత్ సింగ్'ను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని ఫిల్మ్ నగర్ టాక్.   


'ఓజీ' చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై శ్రీమతి పార్వతి సమర్పణలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. 'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం' తర్వాత ఆయన నిర్మిస్తున్న చిత్రమిది. ఆల్రెడీ ముంబైలో ఓ షెడ్యూల్ చేశారు. అందులో పవన్ పాల్గొనగా కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ (Prakash Raj In OG) కూడా నటిస్తున్నారు.


Also Read : డింపుల్‌కు ప్రాణహాని - డీసీపీ కేసులో సంచలన విషయాలు బయటపెట్టిన లాయర్



పదిహేను సార్లు క్లైమాక్స్ మార్చిన సుజీత్!
షూటింగ్ మొదలైన సందర్భంగా విడుదల చేసిన వీడియోలో క్లైమాక్స్ గురించి సుజీత్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. నోటితో నేరుగా ఏదీ చెప్పలేదు. కానీ, వీడియో మీద ఓ లుక్ వేస్తే... క్లైమాక్స్ కోసం చాలా డ్రాఫ్ట్స్ రాసినట్టు ఈజీగా అర్థమైంది. 'క్లైమాక్స్ 15' అని రాసి, చివరకు దాన్ని చెత్తబుట్టలో పడేశారు. అంటే... 15 సార్లు క్లైమాక్స్ చేంజ్ చేశారన్నమాట. చివరకు, 16వ క్లైమాక్స్ ఓకే చేసినట్టు తెలుస్తోంది. అలాగే, ముంబైలో పవన్ ఇంట్రో సీన్ కూడా అభిమానుల దృష్టిని ఆకర్షించింది. 


వీడియోలో వినిపించిన తమన్ సంగీతం సైతం సూపర్ ఉంది. పవన్ కళ్యాణ్ అభిమానులు కోరుకునే అంశాలు అన్నీ సినిమాలో ఉన్నట్టు అర్థం అవుతోంది. ముఖ్యంగా సుజీత్ ఈ వీడియోను తీసిన విధానం చాలా మందిని ఆకట్టుకుంది. బాల్ బాంబ్ కావడం, పెన్సిల్స్ బుల్లెట్స్ అవ్వడం, స్కేల్ జపనీస్ స్వార్డ్ కింద మారడం చూస్తుంటే... సినిమాలో ఎన్ని ఫైట్స్ ఉన్నాయనేది, పవన్ కళ్యాణ్ ఎన్ని వెపన్స్ వాడతారనేది ఈజీగా అర్థం అవుతోంది. 


Also Read కోర్టుకు ఎక్కిన నరేష్ మూడో భార్య - 'మళ్ళీ పెళ్లి' విడుదలపై స్టే ఇవ్వాలని విజ్ఞప్తి