టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. పలు చిత్రాలకు సైన్ చేసిన ఆయన.. ఒక్కొక్కటిగా కంప్లీట్ చేసుకుంటూ వెళ్తున్నారు. అందులో 'ఉస్తాద్ భగత్ సింగ్' ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ మాస్ చిత్రానికి ‘గబ్బర్ సింగ్’తో పవన్ కు బ్లాక్ బస్టర్ హిట్ అందించిన హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఆల్రెడీ ఒక షెడ్యూల్ కంప్లీట్ కాగా, తర్వాతి షెడ్యూల్ ఎప్పుడు మొలవుతుందా? అని  పవన్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొన్నటి వరకు పవన్.. 'వారాహి యాత్ర'తో బిజీగా ఉండగా.. రీసెంట్ గా ఆయన మరో సినిమా ‘OG’కి ఎక్కువ సమయం ఇస్తున్నారు. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా షూటింగ్ పై ఎలాంటి క్లారిటీ లేదు.

  


‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్ తాత్కాలిక వాయిదా


ప్రస్తుతం టాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా షూటింగ్ తాత్కాలికంగా వాయిదా పడింది. పవన్ కల్యాణ్ ప్రస్తుతం తన వారాహి విజయ యాత్రలో బిజీగా గడుపుతున్నారు. అటు AP అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా కొన్ని నెలలు మిగిలి ఉన్నందున, పాలిటిక్స్ పై ఎక్కవ ఫోకస్ పెట్టాలి అనుకుంటున్నారు. అందుకే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్ కొన్ని నెలల పాటు వాయిదా పడింది. ఈ నేపథ్యంలో మాస్ మహారాజా రవితేజ ప్రధాన పాత్రలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తున్న మరో ప్రాజెక్ట్‌కి హరీష్ శంకర్ వెళ్లనున్నాడని టాక్. అయితే, దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.   


అభిమానుల ఆశలు ఆవిరి!


రీసెంట్ గా 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీ షూటింగ్ పై మైత్రి మూవీ మేకర్స్ కీలక ప్రకటన చేసింది. త్వరలోనే ఈ సినిమా తర్వాతి షెడ్యూల్ మొదలవుతుందని వెల్లడించింది. మూవీపై మరింత హైప్ పెంచుతూ అదిరిపోయే పోస్టర్స్ ను కూడా రిలీజ్ చేసింది. ‘ఉస్తాద్ భగత్ సింగ్’, 'గబ్బర్ సింగ్' సినిమాకు సంబంధించి పవన్, హరీష్ శంకర్ వర్కింగ్ స్టిల్స్ ఉన్నాయి.  ఏదైతేనేం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్ మొదలవుతుందంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. తాజాగా ఈ మూవీ షూటింగ్ వాయిదా పడిందని తెలియడంతో నిరాశ చెందుతున్నారు.  


ఇక ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలో పవన్ కల్యాణ్ సరసన శ్రీ లీల  హీరోయిన్ గా నటిస్తోంది. అశుతోష్ రాణా, నవాబ్ షా, 'కేజీఎఫ్' అవినాష్, గౌతమి, నర్రా శ్రీను, నాగ మహేష్, 'టెంపర్' వంశీ సహా పలువురు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది రిలీజ్ చేసేందుకు  ప్లాన్ చేస్తున్నారు. అటు పవన్ కల్యాణ్ పలు సినిమాతో బిజీగా ఉన్నారు.


Read Also: హాలీవుడ్ స్టార్స్ నిరసన ర్యాలీలో ‘RRR’ పోస్టర్- నెట్టింట్లో వైరల్


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial