గత కొంత కాలంగా హాలీవుడ్ లో సమ్మె కొనసాగుతోంది. హాలీవుడ్ నటీనటులు, రచయితలు స్ట్రైక్ లో పాల్గొంటున్నారు. కొత్త కార్మిక ఒప్పందాన్ని కుదుర్చుకోవడంలో యూనియన్ సక్సెస్ కాలేదు. దీంతో గత కొంత కాలంగా సమ్మె కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో చాలా టీవీ షోలు, సినిమాలు నిలిచిపోయాయి. తాజాగా సినీ నటీనటులు, రచయితలు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో  ‘RRR’ మూవీ పోస్టర్ కనిపించడం ఆసక్తి కలిగిస్తోంది.  


గత కొంతకాలంగా హాలీవుడ్ స్టార్స్, రైటర్స్ సమ్మె


చాలా కాలంగా వేతనాల విషయంలో హాలీవుడ్ స్టార్స్, రైటర్స్ అసంతృప్తిగా ఉన్నారు. ఎక్కువ పని చేయించుకోవడంతో పాటు, తక్కువ రెమ్యునరేషన్ ఇస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేతనాలతో పాటు  త‌మ ఉద్యోగాల‌ను ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ టేక్ ఓవ‌ర్ చేస్తోంద‌ని, ఇలాగైతే త‌మ‌కు ప‌ని లేకుండా పోతుందంటూ  స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్- అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ టెలివిజన్ అండ్ రేడియో ఆర్టిస్ట్స్ (SAG-AFTRA) యూనియన్ సమ్మెకు దిగింది. గత కొంత కాలంగా ఈ సమ్మె కొనసాగుతోంది. ఈ యూనియన్‌లో లక్షా 60 వేల మంది నటులు, మీడియా ఉద్యోగులు, జర్నలిస్టులు, హోస్టులు ఉన్నారు. డిస్నీ, వార్నర్ బ్రదర్స్, నెట్‌ ఫ్లిక్స్ వంటి స్టూడియోలతో పాటు స్ట్రీమింగ్ సేవలను కలిగి ఉన్న అలయన్స్ ఆఫ్ మోషన్ పిక్చర్, టెలివిజన్ ప్రొడ్యూసర్స్ తో పాటు SAG-AFTRA ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి అగ్రిమెంట్ చేసుకుంటుంది. అయితే, తాజాగా కుదుర్చుకున్న ఒప్పందం విఫలం అయ్యింది.  దీంతో స్క్రీన్ యాక్టర్స్, గిల్డ్ చేస్తున్న సమ్మె కారణంగా టీవీ షోలో, సినిమాలకు బ్రేక్ పడింది.  


హాలీవుడ్ సమ్మెలో ‘RRR’ పోస్టర్ ప్రదర్శన


రీసెంట్ గా ఈ సమ్మెలో భాగంగా నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో రాజమౌళి తెరకెక్కించిన ఆస్కార్ విన్నింగ్ మూవీ ‘RRR’ పోస్టర్ కనిపించింది. ‘నాటు నాటు’  పాటకు సంబంధించి రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హుక్ స్టెప్ చేస్తున్న పోస్టర్ ను ఓ వ్యక్తి పట్టుకుని ర్యాలీలో వెళ్లడం బాగా వైరల్ అవుతోంది.  ఈ పోస్టర్ పై రకరకాలుగా స్పందిస్తున్నారు నెటిజన్లు. ఈ పోస్టర్ ను పట్టుకోవడం అనేది ఉద్యమ స్ఫూర్తిని కలిగిస్తోందని చెప్తున్నారు. న్యాయమైన పోరాటం ఎప్పటికైనా విజయం సాధిస్తుంది అనడానికి ఇది ఉదాహారణ అంటున్నారు. ఈ సమ్మెలో ఆ పోస్టర్ ను ఎందుకు పట్టుకున్నారో అర్థం కావడం లేదని మరికొంత మంది కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా హాలీవుడ్ సమ్మెలో ‘RRR’ పోస్టర్ పట్టుకోవడం పట్ల భారతీయులు గర్వంగా ఫీలవుతున్నారు. ఈ ధర్నాకు ప్రియాంక చోప్రాతో చాలా మంది నటీనటులు మద్దతు పలుకుతున్నారు.   






Read Also: కొత్త సినిమాలో హనీరోజ్‌ హాట్‌ లుక్‌, బ్యాన్‌ చేయాలంటూ నెటిజన్ల లొల్లి!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial