Pawan Kalyan's The Transe Of Omi From OG Movie Released: పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు ఫుల్ మ్యూజిక్ ట్రీట్, బిగ్గెస్ట్ సర్ ప్రైజ్ వచ్చేసింది. మూవీ రిలీజ్‌కు ముందు మ్యూజిక్ లెజెండ్ తమన్... సోషల్ మీడియా వేదికగా ఒక్కో సర్ ప్రైజ్ ఇస్తూ గూస్ బంప్స్ తెప్పిస్తున్నారు. ఇప్పటికే 'ఓజస్ గంభీర' అంటూ అటు యూట్యూబ్ ఇటు సోషల్ మీడియా మోత మోగుతోంది. దానికి మరింత హైప్ ఇస్తూ తాజాగా 'ట్రాన్స్ ఆఫ్ ఓమి' అంటూ స్పెషల్ బీజీఎం రిలీజ్ చేశారు తమన్.
పవర్ స్టార్ గ్రేస్‌కు తగ్గట్లుగానే బీజీఎం థియేటర్స్ దద్దరిల్లేలా క్రియేట్ చేస్తున్నారు తమన్. ఇందు కోసం జపనీస్ స్పెషల్ ఇన్‌స్ట్రుమెంట్ 'కోటో'ను యూజ్ చేశారు. రీసెంట్‌గా లండన్‌లో బీజీఎం రికార్డింగ్ పనులు 117 మంది మ్యుజీషియన్స్‌తో చేయగా దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో '#Hungrycheetah' ట్రెండ్ అవుతుండగా... తాజాగా '#TranseOfOmi' ట్రెండ్ అవుతోంది.
ఈ మూవీకి సుజిత్ దర్శకత్వం వహిస్తుండగా పవన్ గ్యాంగ్ స్టర్ 'గంభీర'గా కనిపించనున్నారు. పవర్ స్టార్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్ రోల్ చేస్తుండగా... శ్రియా రెడ్డి, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య, దాసరి కల్యాణ్ నిర్మిస్తున్నారు. ఈ నెల 25న 'ఓజీ' ప్రేక్షకుల ముందుకు రానుంది.