Pawan Kalyan's OG 2 News: ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'ఓజీ 2' ప్రకటనతో అభిమానుల్లో సందడి మొదలైంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పాలనా వ్యవహారాల్లో బిజీగా ఉన్న పవన్, ఇప్పట్లో సినిమాలు చేసే అవకాశం లేదని మెగా ఫ్యాన్స్, ప్రేక్షకులు భావించారు. వాళ్ళకు 'ఓజీ 2' అప్డేట్ బిగ్ సర్ ప్రైజ్. దాంతో హ్యాపీ. మరి, సినిమా ఎప్పుడు లాంచ్ అవుతుందో తెలుసా?

Continues below advertisement

నవంబర్ తర్వాత 'ఓజీ 2' షురూ!?ఓపెనింగ్ ముహూర్తం ఖరారు చేశారా?థియేటర్లలో 'ఓజీ' బ్లాక్ బస్టర్ హిట్. మూడు వందల కోట్లకు పైగా వసూలు చేసింది. ఆ సినిమాకు సీక్వెల్ 'ఓజీ 2'ను ప్రకటించడం అటు అభిమానులను, ఇటు తెలుగు చిత్రసీమను ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి చేశారు పవన్ కళ్యాణ్. 'ఉస్తాద్ భగత్ సింగ్' విడుదల తర్వాత నటనకు స్వస్తి పలికి పూర్తిగా రాజకీయాలకే పరిమితం అవుతారని ఊహాగానాలు వినిపిస్తున్న తరుణంలో... సొంత ప్రొడక్షన్ హౌస్ 'పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్' నుంచి వచ్చిన అప్డేట్ అందరిలోనూ చాలా ఉత్సాహాన్ని నింపింది. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... నవంబర్‌లో పూజా కార్యక్రమాలతో 'ఓజీ'ని లాంఛనంగా ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారట.

Also ReadDeva Katta On Dragon - ఎన్టీఆర్ సినిమాకు దేవకట్టా డైరెక్షన్... ఇదిగో క్లారిటీ వచ్చేసింది

Continues below advertisement

'ఓజీ' తర్వాత నానితో 'బ్లడీ రోమియో' సినిమా చేయాలని దర్శకుడు సుజీత్ ప్లాన్ చేశారు. ఇప్పుడు గనుక పవన్ కళ్యాణ్ డేట్స్ ఇస్తే... నానితో చేయాలనుకున్న ప్రాజెక్ట్ పక్కనపెట్టి, దాని కంటే ముందు 'ఓజీ 2'ని స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నారట. ఆల్రెడీ స్క్రిప్ట్ గురించి ఆయనకు ఓ ఐడియా ఉందని, 'ఓజీ' చేసే సమయంలో సీక్వెల్ గురించి పవన్ కళ్యాణ్‌తో డిస్కషన్స్ చేశారని, ఆయన ఓకే అంటే నవంబర్‌లో ప్రారంభం అవుతుంది. ఒకవేళ పవన్ పొలిటికల్ షెడ్యూల్ వల్ల డేట్స్ ఇవ్వడం ఆలస్యం అయితే... వచ్చే ఏడాది ఇస్తే... అప్పుడు నాని సినిమాను సుజీత్ పూర్తి చేసే అవకాశం ఉంది. ముందు ఏ సినిమా ఉంటుంది? అనేది కొన్ని వారాల్లో క్లారిటీ వస్తుంది. 

Also Read: Maa Inti Bangaram - సమంతకు లైన్ క్లియర్ చేసిన అఖిల్... బంగారం లాంటి ఛాన్స్

'ఓజీ' సీక్వెల్ నుంచి నిర్మాతను తప్పిస్తారా?'ఓజీ'ని నిర్మించిన డీవీవీ దానయ్య ఈ సీక్వెల్ 'ఓజీ 2'ని కూడా నిర్మిస్తారా? లేదా పవన్ సొంత ప్రొడక్షన్ హౌస్ 'పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్' రంగంలోకి వస్తుందా? అనేది తెలియాల్సి ఉంది. 'ఓజీ' సమయంలో దర్శకుడు సుజీత్ - నిర్మాత దానయ్య మధ్య చిన్నపాటి మనస్పర్థలు వచ్చాయట. జపాన్ షెడ్యూల్ కోసం సుజీత్ తన కారును అమ్మేశారని, సినిమా విడుదల తర్వాత అది తెలిసి పవన్ కొత్త కారు కొని ఇచ్చారని ఫిల్మ్ నగర్ వర్గాల కథనం. నాని - సుజీత్ 'బ్లడీ రోమియో'ను కూడా డీవీవీ దానయ్య నిర్మించాల్సి ఉండగా... తర్వాత ప్రొడక్షన్ హౌస్ మారింది. మరి ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి. 'ఓజీ 2'కి కూడా తమన్ సంగీతం అందించనున్నారు. ఈసారి కొన్ని కొత్త క్యారెక్టర్లు ఎంటర్ కానున్నాయి.

Also ReadPeddi Collections Day 9 - ఓవర్సీస్‌లో 'పెద్ది'గాడి కలెక్షన్స్ మళ్ళీ పెరిగాయ్... సెకండ్ వీకెండ్ రామ్ చరణ్ జోరు కంటిన్యూ అవుతుందా?