అక్కినేని అఖిల్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'లెనిన్' విడుదల మళ్ళీ వాయిదా పడింది. జూన్ 26న థియేటర్లలోకి రావాల్సిన ఈ సినిమా, ఇప్పుడు జూలైకు వెళ్ళినట్టు టాలీవుడ్ టాక్. దాంతో సమంత రూత్ ప్రభు సినిమాకు లైన్ క్లియర్ అయ్యింది.

Continues below advertisement

బాక్సాఫీస్‌లో బంగారానికి మంచి ఛాన్స్అఖిల్ అక్కినేని 'లెనిన్' సినిమా వెనక్కి వెళ్ళడం వల్ల సమంత రూత్ ప్రభు ప్రధాన పాత్రలో నటించిన 'మా ఇంటి బంగారం' చిత్రానికి బాక్స్ ఆఫీస్ బరిలో పోటీ అనేది లేకుండా పోయింది. రెండు మూడు వారాలు మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయి.

నందినీ రెడ్డి దర్శకత్వం వహించిన 'మా ఇంటి బంగారం' జూన్ 19న థియేటర్లలో విడుదల కానుంది. ట్రలాలా పిక్చర్స్ పతాకంపై సమంత స్వయంగా నిర్మించిన ఈ చిత్రానికి ఆమె భర్త రాజ్ నిడిమోరు కథ అందించారు. అఖిల్ సినిమా జూన్ 26న రాకపోతే... సమంత సినిమాకు దాదాపు రెండు వారాల పాటు బాక్సాఫీస్ బరిలో ఇతర సినిమాలతో పోటీ లేకుండా స్వేచ్ఛగా వసూళ్ళు రాబట్టుకునే అవకాశం లభించింది.

Continues below advertisement

Also Read: Deva Katta On Dragon - ఎన్టీఆర్ సినిమాకు దేవకట్టా డైరెక్షన్... ఇదిగో క్లారిటీ వచ్చేసింది

జూన్ 19కి ముందు వారం... జూన్ 12న తెలుగులో 'సింగ్ గీతం' మినహా మరొక మంచి సినిమా ఏదీ రాలేదు. అది సమంత సినిమాకు పోటీ కాదు. 'సింగ్ గీతం' కంటే జూన్ 4న థియేటర్లలోకి వచ్చిన రామ్ చరణ్ 'పెద్ది'కి ఎక్కువ కలెక్షన్లు వస్తున్నాయి. ఆ సినిమా థియేట్రికల్ రన్ జూన్ 19వ తేదీకి దాదాపుగా ముగింపు దశకు చేరుకుంటుంది. థియేటర్లలో ఉన్నా కొత్త సినిమా 'మా ఇంటికి బంగారం'కి పోటీ కాదు. థియేటర్లలో సినిమా చూడాలని కోరుకునే ప్రేక్షకులకు ఫస్ట్ ఆప్షన్ అప్పుడు సమంత సినిమాయే అవుతుంది. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే... సమంత స్టార్‌డమ్, ఇమేజ్ వల్ల భారీ వసూళ్ళను సాధించడం గ్యారెంటీ. జూలై మొదటి వారం కొత్త సినిమాలు వచ్చే వరకు పోటీ ఉండదు.

Also ReadPeddi Collections Day 9 - ఓవర్సీస్‌లో 'పెద్ది'గాడి కలెక్షన్స్ మళ్ళీ పెరిగాయ్... సెకండ్ వీకెండ్ రామ్ చరణ్ జోరు కంటిన్యూ అవుతుందా?

అఖిల్ 'లెనిన్' ఎందుకు వాయిదా పడింది?Why Akhil Lenin Was Postponed?: మాజీ వదిన సమంతకు అఖిల్ లైన్ క్లియర్ చేసినట్టు అయ్యింది 'లెనిన్' వాయిదా పడటంతో. అసలు ఈ వాయిదాకు ప్రధాన కారణం ఇంకా కొంత ప్యాచ్ వర్క్ మిగిలి ఉండటం, థియేట్రికల్ బిజినెస్ డీల్స్ పూర్తిస్థాయిలో క్లోజ్ చేయకపోవడం అని ఖబర్. ఆల్రెడీ సాంగ్స్ హిట్ కావడంతో సినిమాపై మంచి బజ్ నెలకొంది. జూలైలో లెనిన్ సినిమా విడుదల అయ్యే అవకాశం ఉందని టాలీవుడ్ టాక్.

Also ReadSing Geetham Review - 'సింగ్ గీతం' రివ్యూ: ఊరికి శాపం, మాటల బదులు పాటలు... సింగీతం సినిమా ఎలా ఉందంటే?