దర్శకుడు దేవ కట్టా (Deva Katta)కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. విలక్షణ కథలు, సినిమాలతో తెలుగు చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. రాజకీయ నేపథ్యంలో ప్రజలలో ఆలోచన రేకెత్తించే, అవగాహన కల్పించే సినిమాలు తీయడం ఆయన స్టైల్. నారా చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డిని గుర్తు చేసేలా 'మయసభ' వెబ్ సిరీస్ తీసి ఓటీటీలో భారీ హిట్ కొట్టారు. ఆ తర్వాత మరొక ప్రాజెక్ట్ స్టార్ట్ చేయలేదు. అయితే కొన్ని రోజులుగా ఆయన నెక్స్ట్ సినిమా గురించి సోషల్ మీడియాలో కొన్ని రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. సదరు పుకార్లపై ఆయన స్పందించారు. వాటిపై క్లారిటీ ఇచ్చారు.
ఎన్టీఆర్ 'డ్రాగన్'కు దేవ కట్టా డైరెక్షన్.... దేవ కట్టా మీద వచ్చిన రూమర్లు ఏమిటి?ఎన్టీఆర్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న పాన్ ఇండియా యాక్షన్ డ్రామా 'డ్రాగన్'. దీనికి దేవ కట్టా డైలాగులు రాస్తున్నారని కొన్ని రోజుల నుంచి ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి 'డ్రాగన్' సినిమాలో కొన్ని కీలకమైన ఘట్టాలకు దేవ కట్టా దర్శకత్వం వహిస్తున్నారని ప్రచారం మొదలు పెట్టారు.
ఎన్టీఆర్ 'డ్రాగన్'కు దేవ కట్టా ఘోస్ట్ డైరెక్షన్ చేస్తున్నాని మాత్రమే కాదు... ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హీరోగా దేవ కట్టా సినిమా చేయనున్నారని కూడా మరో ప్రచారం ఎప్పట్నుంచో జరుగుతోంది. ఈ ప్రచారాలకు ఆయన చెక్ పెట్టారు.
అవన్నీ క్లిక్స్ కోసం చేసే పనులు...దేవ కట్టా మీద రూమర్స్ ఎక్కువ అవ్వడంతో సోషల్ మీడియాలో ఆయన ఒక పోస్ట్ చేశారు. దాంతో రూమర్లు అన్నిటికీ క్లారిటీ ఇచ్చినట్టు అయ్యింది. వెబ్ సైట్లకు వచ్చే క్లిక్స్, వ్యూస్ కోసం అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని దేవ కట్టా ఆవేదన వ్యక్తం చేశారు. ఇతరుల సినిమాలకు తాను ఒక్క షాట్ కూడా డైరెక్ట్ చేయలేదని ఆయన స్పష్టం చేశారు. అటువంటి వార్తలను అభిమానులు అస్సలు నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. దాంతో ఎన్టీఆర్ 'డ్రాగన్'కు దేవ కట్టా డైరెక్షన్ చేస్తున్నారని వచ్చిన వార్తలు ఫేక్ అని తేలింది. తన 'ఎక్స్' పోస్ట్ (ట్వీట్)లో 'డ్రాగన్' పేరును దేవ కట్టా ప్రస్తావించలేదు. కానీ, క్లారిటీ మాత్రం వచ్చింది.
