Pawan Kalyan OG 2 Latest Update : మెగా ఫ్యాన్స్‌కు సూపర్ గుడ్ న్యూస్. పవర్ స్టార్ బ్లాక్ బస్టర్ గ్యాంగ్ స్టర్ డ్రామా OG సీక్వెల్ అప్డేట్ వచ్చేసింది. పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై దీనిపై బిగ్ సర్ప్రైజ్ ఇచ్చింది. 

Continues below advertisement

OG2 ఎప్పుడంటే?

నిజానికి OG మూవీ క్లైమాక్స్ సీక్వెల్‌పై హింట్ ఇచ్చారు డైరెక్టర్ సుజీత్. ఆ తర్వాత ఇంటర్వ్యూల్లో సీక్వెల్‌తో పాటు ప్రీక్వెల్ కూడా ఉంటాయని కన్ఫర్మ్ చేశారు. తాజాగా పవన్ సొంత నిర్మాణ సంస్థ పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ దీనిపై ట్వీట్ చేసింది. 'మాట ఇచ్చినట్లుగా ఆయన చేస్తారు. ఎప్పుడు అనేది త్వరలోనే తెలియజేస్తారు. విదేశాల నుంచి సుజీత్ తిరిగి వచ్చిన తర్వాత OG 2పై చర్చలు మొదలవుతాయి.' అంటూ రాసుకొచ్చింది. దీంతో OG 2 కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తుండగా... ఎప్పుడు ట్రాక్ ఎక్కుతుందో తెలియాల్సి ఉంది.

Continues below advertisement

ఓజీ ఫస్ట్ పార్ట్‌లో పవన్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించారు. బాలీవుడ్ యాక్టర్ ఇమ్రాన్ హష్మీ విలన్ రోల్ చేయగా... ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్, హరీష్ ఉత్తమన్, శుభలేఖ సుధాకర్ కీలకపాత్రలు పోషించారు. తమన్ మ్యూజిక్ అందించగా... డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య, దాసరి కల్యాణ్ నిర్మించారు. ప్రస్తుతం ఈ మూవీ ఇంటర్నేషనల్ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్'లో తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులోకి ఉంది.

Also Read : Gopichand Birthday : గోపీచంద్‌ బర్త్ డే స్పెషల్ - అలా సినిమాల్లోకి ఎంట్రీ... మ్యాచో స్టార్ గురించి ఈ విషయాలు తెలుసా?

OG సీక్వెల్ కోసం అభిమానులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. సీక్వెల్‌లో కానీ, ప్రీక్వెల్‌లో కానీ పవన్ కుమారుడు అకీరా నందన్ ఎంట్రీ ఉంటుందని కూడా ఫ్యాన్స్ భావిస్తున్నారు. పవన్ లాస్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ కూడా మంచి సక్సెస్ అందుకుంది. ఆయన ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా పాలనలో బిజీగా ఉండడంతో సీక్వెల్ ట్రాక్ ఎక్కడానికి చాలా టైం పడుతుందని అందరూ భావించారు. అయితే, తాజా ట్వీట్‌తో OG 2పై క్లారిటీ ఇస్తూనే త్వరలోనే ట్రాక్ ఎక్కనుందని కన్ఫర్మ్ అయ్యింది.

ప్రస్తుతం సుజీత్ నానితో మూవీ చేస్తున్నారు. రీసెంట్‌గానే ఆ మూవీ షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది. ఆ మూవీ పూర్తైన తర్వాత OG సీక్వెల్ ప్రీక్వెల్‌పై ఫోకస్ చేయనున్నట్లు టాక్.

Also Read : Sing Geetham OTT : సింగీతం గారి సింగ్ గీతం ఓటీటీ ఫిక్స్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.