OG New Poster Released: ఒకవైపు ఏపీలో ఎన్నికల కౌంటింగ్ హడావిడి నడుస్తోంది. జనసేనాని పవన్ కళ్యాణ్ విజయం వైపు దూసుకుపోతున్నారు. ఇదే సమయంలో తన అప్ కమింగ్ మూవీ ‘ఓజీ’కి సంబంధించిన కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది మూవీ టీమ్. ఇది చూసిన ఫ్యాన్స్ అంతా మేకర్స్ మంచి టైమింగ్‌ను ఫాలో అవుతున్నారని కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ పేరు ట్రెండింగ్‌లో ఉండగా.. ఈ సందర్భాన్ని క్యాష్ చేసుకుంటోంది ‘ఓజీ’ టీమ్. ఇక ఈ కొత్త పోస్టర్ పవన్ ఫ్యాన్స్‌లో మరింత జోష్ నింపుతోంది. పోస్టర్‌తో పాటు ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ కూడా అటాచ్ చేశారు మేకర్స్.
రగిలింది రివెంజ్..
‘ఎవ్వరికీ అందదు అతని రేంజ్.. రెప్ప తెరిచెను రగిలే రివెంజ్..’ అనే క్యాప్షన్‌తో పాటు ‘ఓజీ’ కొత్త పోస్టర్‌ను రివీల్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్‌లో కాలిపోతున్న కుర్చీలో పవన్ కళ్యాణ్ కూర్చున్నారు. తన చేతిలో ఒక వాచ్ కూడా ఉంది. దీన్ని బట్టి చూస్తే ఏపీ రాజకీయాల్లో పవన్ టైమ్ వచ్చిందని చెప్పకనే చెప్తున్నట్టు ఉందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఇప్పటివరకు విడుదలయిన ‘ఓజీ’ ఇతర పోస్టర్స్‌లాగానే ఇందులో కూడా పవన్ కళ్యాణ్ చాలా స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. అంతే కాకుండా ఈ పోస్టర్‌లో ‘ఓజీ టైమ్ మొదలయ్యింది’ అని కూడా ఉంది. దీంతో ఈ పోస్టర్‌ను పవన్ ఫ్యాన్స్ తెగ లైక్ చేయడంతో పాటు షేర్ కూడా చేస్తున్నారు.
ఫ్యాన్స్‌లో ఉత్సాహం..
సెప్టెంబర్ 27న విడుదలకు సిద్ధమయ్యింది ‘ఓజీ’. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే పవన్ కళ్యాణ్.. ఏపీ ఎన్నికల ప్రచారం కోసం షూటింగ్‌ను మధ్యలో వదిలేసి వెళ్లిపోయారు పవన్ కళ్యాణ్. కానీ అప్పటికే జరిగిన షూటింగ్‌ను బట్టి.. దానికి తగినట్టుగా అప్డేట్స్‌ను వదిలారు మేకర్స్. ఎట్టి పరిస్థితుల్లోనూ మూవీని అనుకున్న తేదీనే విడుదల చేయాలని ఫిక్స్ అయ్యి ఉన్నారు. ఒకసారి ఎన్నికలు ముగిసిన తర్వాత కచ్చితంగా తన అప్‌కమింగ్ మూవీ సెట్స్‌లో పవన్ కళ్యాణ్ అడుగుపెడతాడని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఇంతలోనే ‘ఓజీ’ నుండి విడుదలయిన కొత్త పోస్టర్ వారిలో మరింత ఉత్సాహాన్ని నింపుతోంది.
ఒరిజినల్ గ్యాంగస్టర్..
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న దర్శకుడు సుజీత్.. ‘ఓజీ’ గురించి పలు ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నాడు. అసలు ‘ఓజీ’ అనే టైటిల్‌కు అర్థం ఏంటో బయటపెట్టారు. ఓజీ అంటే ఓజస్ గంభీర అని రివీల్ చేశాడు. 'ఓజస్' అంటే మాస్టర్ అని, 'గంభీర' అనేది హీరో పేరు అని చెప్పాడు. దాంతో పాటు ‘ఓజీ’ అంటే ఒరిజినల్ గ్యాంగస్టర్ అనే అర్థం కూడా వస్తుందన్నాడు సుజీత్. తనకు, పవన్ కళ్యాణ్‌కు కామన్‌గా జపానీస్ సినిమాలు అంటే ఇష్టమని, అందుకే ‘ఓజీ’లో జపాన్ రిఫరెన్స్ చాలా ఉంటుందని తెలిపాడు. ‘ఓజీ’లో పవన్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో కనిపించనున్నాడు.
Also Read: పవన్ ఫ్యాన్స్ ముగింట ట్రెండ్స్ ఎంత - వాట్సాప్ స్టేటస్, ట్విట్టర్ వీడియో షేర్స్‌తో హల్‌చల్