Bandla Ganesh Hospitalised: ప్రముఖ టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ తాజాగా అస్వస్థతతో అపోలో ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. సోమవారం మధ్యాహ్నం బండ్ల గణేష్ అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఆయనను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స జరుగుతోంది. ఆసుపత్రిలో బండ్ల గణేష్ ఉన్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో తను సెలైన్‌తో కనిపించారు. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగానే ఉందని కుటుంబ సభ్యులు, సన్నిహితులు చెప్తున్నారు. బండ్ల గణేశ్ త్వరగా కోలుకోవాలని పలువురు నెటిజన్లు వైరల్ అవుతున్న వీడియోకు కామెంట్లు పెడుతున్నారు.


ఎప్పుడూ హాట్ టాపిక్..


నిరంతరం వార్తల్లో నిలిచే సినీ సెలబ్రిటీల్లో బండ్ల గణేష్ ఒకరు. ఆయన వేసే కౌంటర్లకు, పంచ్‌లకు ఫ్యాన్స్ కూడా ఉన్నారు. బండ్ల గణేష్ ఎప్పుడు స్క్రీన్‌పై కనిపించినా ఏదో ఒక విధంగా సెన్సేషన్ క్రియేట్ చేసే వెళ్తారు. ఇక నిర్మాత నుండి రాజకీయ నాయకుడిగా మారిన తర్వాత బండ్ల గణేష్ వేసే కౌంటర్లకు మరింత పాపులారిటీ పెరిగింది. ఎన్నికలు వచ్చాయంటే చాలు ఆయన కొట్టే డైలాగులు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ఈసారి కూడా ఎన్నికల్లో యాక్టివ్‌గా పాల్గొన్న బండ్ల గణేష్.. కొన్నిరోజులకే అస్వస్థతకు గురికావడంతో నెటిజన్లు.. ఆయన కోలుకోవాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.






డాక్టర్లు క్లారిటీ..


ప్రస్తుతం బండ్ల గణేష్ ఆరోగ్యం నిలకడగా ఉండడంతో త్వరలోనే డిశ్చార్జ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు స్పందించారు. ఒత్తిడి వల్లే ఇలా అయ్యిందని, వైద్య పరీక్షలు నిర్వహించామని తెలిపారు. వీలైనంత త్వరగా డిశ్చార్జ్ చేస్తామని బయటపెట్టారు. ఇంతకు ముందు కూడా పలుమార్లు బండ్ల గణేష్‌కు ఇలాంటి ఆరోగ్య సమస్యలు ఎదురయ్యి ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి వచ్చింది. కోవిడ్ సమయంలో కూడా రెండు, మూడుసార్లు అస్వస్థతకు గురయ్యి ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు బండ్ల గణేష్. కొన్నాళ్ల పాటు ఏ సమస్య లేకుండా ఆరోగ్యంగానే కనిపించిన బండ్ల గణేష్.. మళ్లీ ఒత్తిడితో హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యారు.


ఎన్నికల్లో యాక్టివ్..


తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బండ్ల గణేష్ చాలా యాక్టివ్‌గా ఉన్నారు. అదే విధంగా ఆ సమయంలో ఆయన చేసిన ఇంటర్వ్యూలు, అందులో ఆయన ఇచ్చిన స్టేట్‌మెంట్స్ వైరల్ అయ్యాయి కూడా. ముఖ్యంగా కాంగ్రెస్‌కు సపోర్ట్ చేస్తూ టీఆర్ఎస్ నాయకులపై ఫైర్ అవుతూ వ్యాఖ్యలు చేశారు బండ్ల గణేష్. కాంగ్రెస్ పార్టీని ఎవరు ఏమన్నా కూడా వారికి గట్టిగా కౌంటర్లు ఇస్తూ వచ్చారు. ఇక త్వరలోనే కాంగ్రెస్‌లో బండ్ల గణేష్ కీలక నాయకుడిగా మారనున్నాడని వార్తలు కూడా వచ్చాయి. ఇక ఆయన ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యి బయటికి వస్తే ఈ విషయంపై క్లారిటీ వస్తుంది.


Also Read: ప్రశాంత్ నీల్ బర్త్‌డే స్పెషల్ - ఆంధ్రలో పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ ఫ్యామిలీ నుండి వచ్చి ఇండియాను ఏలేస్తున్న దర్శకుడు