పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జెట్ స్పీడ్‌లో ఒక సినిమా తర్వాత మరొక సినిమా షూటింగ్ స్టార్ట్ చేస్తున్నారు. గత నెలలో హరిహర వీరమల్లు చిత్రీకరణ పూర్తి చేశారు. ఆ వెంటనే సుజిత్ దర్శకత్వంలో 'దే కాల్ హిమ్ ఓజీ'లో తన క్యారెక్టర్ షూటింగ్ ఫినిష్ చేశారు.‌ ఇప్పుడు ఆ సినిమా నాలుగైదు రోజులు ప్యాచ్ వర్క్ మినహా పూర్తి అయ్యిందని యూనిట్ వర్గాల ద్వారా తెలిసింది. ఇప్పుడు మరొక సినిమా సెట్స్‌లో‌ పవన్ కళ్యాణ్ అడుగు పెట్టారు.

ఉస్తాద్ ఆగయా... షెడ్యూల్ షురూ!తెలుగు చిత్ర సీమలో పవన్ అభిమానులు ఉన్నారు. అలాగే ఆయనకు డై హార్డ్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. పవన్ వీరాభిమానులలో హరీష్ శంకర్ ఒకరు. వాళ్ళిద్దరి కలయికలో వచ్చిన 'గబ్బర్ సింగ్' రికార్డులు తిరగ రాసింది. ఆ సినిమా వచ్చిన పుష్కర కాలం తర్వాత పవన్, హరీష్ శంకర్ కలయికలో మరో సినిమా మొదలైంది అదే 'ఉస్తాద్ భగత్ సింగ్'.

పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా హరీష్ శంకర్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ పతాకం మీద నవీన్ ఎర్నేని, రవిశంకర్ వై ప్రొడ్యూస్ చేస్తున్న సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్'. లేటెస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ సిటీలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో మొదలు అయ్యింది. పవన్ కళ్యాణ్ పాల్గొనగా కీలక తారాగణం మీద దర్శకుడు సన్నివేశాలు తెరకెక్కించారు. సుమారు నెల పాటు ఈ షెడ్యూల్ కొనసాగుతుందని, దీంతో సినిమా దాదాపుగా పూర్తి అవుతుందని యూనిట్ వర్గాల ద్వారా తెలిసింది.

Also Read: వీరమల్లు వాయిదా: ఖాళీ అయిన జూన్ రెండో వారం.. డబ్బింగ్ సినిమాలకు కలిసొచ్చింది

పవన్ కళ్యాణ్ సరసన శ్రీ లీల కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇంకా ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఆయనంక బోస్, ఎడిటర్: ఉజ్వల్ కులకర్ణి, యాక్షన్ సీక్వెన్స్‌: రామ్-లక్ష్మణ్, ప్రొడక్షన్ డిజైనర్: ఆనంద్ సాయి, స్క్రీన్ ప్లే: కె. దశరథ్, అడిషినల్ రైటింగ్: సి చంద్ర మోహన్.

Also Readఒక్క లుక్కుతో చంపేశాడు... 'అఖండ 2' టీజర్‌లో ఆది పినిశెట్టి - అదీ బాలయ్య సినిమాలో విలన్ ఇంపాక్ట్