'అఖండ 2' టీజర్ రికార్డులు క్రియేట్ చేసింది. విడుదలైన 24 గంటల్లో అత్యధిక వ్యూస్, లైక్స్ సంపాదించిన టీజర్లలో ఆల్ టైం టాప్ 5 లిస్టులో చేరింది. గాడ్ ఆఫ్ మాసెస్,‌ నట సింహం నందమూరి బాలకృష్ణ అభిమానులతో పాటు చిత్ర బృందం కూడా ఈ టీజర్‌కు లభించిన స్పందన పట్ల సంతోషంగా ఉంది. ఒక అభిమాని అయితే నేరుగా బాలకృష్ణకు ఫోన్ చేసి తన సంతోషాన్ని పంచుకున్నారు. ఆ కాల్ రికార్డింగ్ సోషల్ మీడియాలో లీక్ అయ్యింది. అందులో బాలకృష్ణ ఏమన్నారు? అభిమాని ఏం చెప్పారు? అనేది ఒకసారి చూస్తే...

ఆల్ ఇండియాలో ఈ లుక్కు కొట్టేవాడు లేడు! - అభిమాని జగన్'అఖండ 2' టీజర్ అద్భుతంగా ఉందని, అరాచకం అని బాలకృష్ణతో ఒక అభిమాని (Ananthapuram Jagan) చెప్పారు. ఆల్ ఇండియాలో బాలయ్య లుక్కును కొట్టేవాడు లేడని గర్వంగా తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.‌ చరిత్ర ఉన్నంత వరకు ఈ‌ లుక్ అందరికీ గుర్తు ఉంటుందని, 'దాన వీర శూరకర్ణ'లో అన్న ఎన్టీఆర్ గారి లుక్కుతో కంపేర్ చేశారు. వరల్డ్ వైడ్ 'అఖండ 2'తో రికార్డు కొట్టాలని అభిమాని చెప్పగా... డౌట్ ఏముందని బాలకృష్ణ అన్నారు. 

అభిమానులకే‌ కాదు... అందరికీ టీజర్ నచ్చింది! - బాలకృష్ణBalakrishna first reaction on Akhanda 2 teaser response: అభిమానులు ఒక్కరే కాదని ప్రేక్షకులు అందరికీ 'అఖండ 2' టీజర్ నచ్చిందని బాలకృష్ణ తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ''నాకు బయట వాళ్ళు ఫోన్ చేసి ఇప్పటికి పది సార్లు టీజర్ చూశామని చెప్పారు. రాత్రి అంతా చూడండి మీకు నిద్ర ఉండదు పొండి అని చెప్పాను'' అని తెలిపారు. ప్రస్తుతం ఈ కాల్ రికార్డింగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Readఒక్క లుక్కుతో చంపేశాడు... 'అఖండ 2' టీజర్‌లో ఆది పినిశెట్టి - అదీ బాలయ్య సినిమాలో విలన్ ఇంపాక్ట్

'సింహా', 'లెజెండ్', 'అఖండ' వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న నాలుగో చిత్రమే. హ్యాట్రిక్ విజయాల తర్వాత డబుల్ హ్యాట్రిక్ సినిమాకు శ్రీకారం చుట్టారు. విజయదశమి సందర్భంగా సెప్టెంబర్ 25న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో చిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేయమన్నారు. 14 రీల్స్ పతాకం మీద రామ్ ఆచంట గోపీ‌ ఆచంట ప్రొడ్యూస్ చేస్తున్న చిత్రం ఇది. దీనికి తమన్ సంగీతం అందిస్తున్నారు.

Also Read: వీరమల్లు వాయిదా: ఖాళీ అయిన జూన్ రెండో వారం.. డబ్బింగ్ సినిమాలకు కలిసొచ్చింది