'హరిహర వీరమల్లు' వాయిదా పడుతుందని ఎవరూ ఊహించలేదు.‌ అందుకని పవన్ కళ్యాణ్ సినిమాతో పాటు తమ సినిమాను విడుదల చేసే సాహసం ఎవరూ చేయలేరు. దాంతో జూన్ రెండో వారం రిలీజ్ చేయాలనే ఆలోచనతో సినిమాలేవి రెడీ కాలేదు. మూడో వారంలో 'కుబేర', నాలుగో వారంలో 'కన్నప్ప' రెడీగా ఉన్నాయి. అందుకని ముందు నుంచి రెండో వారాన్ని సినిమా ఇండస్ట్రీస్ లైట్ తీసుకుంది. ఇప్పుడు వీరమల్లు వాయిదా పడడంతో ఒక్కసారిగా జూన్ రెండో వారం స్లాట్ ఖాళీ అయింది. దాంతో మూడు డబ్బింగ్ సినిమాలకు మోక్షం లభించింది. 

మూడున్నర ఏళ్ల క్రితం సినిమా...తెలుగులోకి సత్యరాజ్ 'కట్టప్ప జడ్జిమెంట్'జూన్ 13వ థియేటర్లలోకి వస్తున్న సినిమాలలో కట్టప్ప జడ్జిమెంట్' ఒకటి. దీని తమిళ్ టైటిల్ ఏంటో తెలుసా? 'తీర్పుగల్ విర్కపడుమ్'. కథ ప్రకారం ఆ టైటిల్ పెట్టారు. తమిళంలో ఈ సినిమా డిసెంబర్ 31, 2021లో విడుదల అయింది. ఆల్మోస్ట్ మూడున్నరేళ్ల తర్వాత ఉన్నట్టుండి ఈ సినిమాను ఇప్పుడు తెలుగులో డబ్బింగ్ చేసి థియేటర్లలో రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు. 'బాహుబలి'లో కట్టప్ప క్యారెక్టర్ ద్వారా తెలుగులో సత్యరాజ్ పాపులర్ అయ్యారు. అందుకని కట్టప్ప జడ్జిమెంట్' టైటిల్ పెట్టేశారు.

వాయిదాల మీద వాయిదాలు...రెండేళ్ల తర్వాత తెలుగులోకి 'పాపా'కోలీవుడ్ యంగ్ హీరోలలో ప్రామిసింగ్ స్టార్ అని పేరు తెచ్చుకున్న యువకుడు కెవిన్ రాజ్. అతడి హిట్ సినిమాలలో 'దాదా' ఒకటి. అందులో అపర్ణ దాస్ హీరోయిన్. వైష్ణవ్ తేజ్ 'ఆదికేశవ' సినిమాలో అక్క క్యారెక్టర్ చేసింది ఆ అమ్మాయి. తమిళంలో ఫిబ్రవరి 10, 2023లో సినిమా రిలీజ్ అయింది.‌ ఆల్మోస్ట్ రెండున్నర సంవత్సరాలు తర్వాత థియేటర్లలోకి ఈ సినిమా వస్తుంది. నిజం చెప్పాలంటే తమిళ్ వెర్షన్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో అందుబాటులో ఉంది. మరి, తెలుగులో ఈ సినిమా చూసేందుకు ఎవరు థియేటర్లలోకి వెళతారో చూడాలి. 

కోదండ రామిరెడ్డి కొడుకు...తమిళంలో విడుదలైన ఏడాదికి!సీనియర్ దర్శకుడు కోదండరామిరెడ్డి తనయుడు వైభవ్ రెడ్డి తెలుగు ప్రేక్షకులకు కూడా తెలుసు. హీరోగా తెలుగులో కెరీర్ స్టార్ట్ చేశారు. తమిళంలో అతనికి అవకాశాలు ఎక్కువ వచ్చాయి. అక్కడ సెటిల్ అయ్యాడు. ఒకవైపు స్టార్ హీరోల సినిమాలలో ఇంపార్టెంట్ క్యారెక్టర్లు చేస్తూ... మరోవైపు హీరోగా చిన్న సినిమాలు చేస్తున్నాడు. అతను హీరోగా నటించిన మిస్టరీ‌ థ్రిల్లర్ 'రణం అరం తవరెల్'. తెలుగులో ఈ సినిమాను 'ది హంటర్ ఛాప్టర్ 1' పేరుతో డబ్బింగ్ చేశారు. తమిళంలో ఫిబ్రవరి 23, 2024న రిలీజ్ కాగా... తెలుగులో ఈ శుక్రవారం విడుదలకు రెడీ అయింది.

Also Readఒక్క లుక్కుతో చంపేశాడు... 'అఖండ 2' టీజర్‌లో ఆది పినిశెట్టి - అదీ బాలయ్య సినిమాలో విలన్ ఇంపాక్ట్

జూన్ రెండో వారంలో తెలుగు సినిమా ఒక్కటి కూడా థియేటర్లలోకి రావడం లేదు. దాంతో హాళ్లు అన్నీ ఖాళీ. థియేటర్లకు ఏదో ఒకటి ఫీడింగ్ కావాలి. హిందీ, తమిళ్ సినిమాలు రూరల్ ఏరియాల్లో ఆడవు. అక్కడ థియేటర్లు ఖాళీగా ఉన్నాయని ఈ సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. వీరమల్లు వాయిదాతో వీటికి మోక్షం లభించింది.

Also Readషాక్ ఇచ్చిన 'కుబేర' సెన్సార్ రిపోర్ట్... ఇప్పుడు భారం అంతా ధనుష్, నాగార్జున పైనే