ఆకాశమే హద్దుగా అభిమానుల మనసుల నిండా భారీ అంచనాలు నెలకొన్న తరుణంలో గాడ్ ఆఫ్ మాసెస్ నట సింహం నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు కానుకగా 'అఖండ 2' టీజర్ (Akhanda 2 Teaser) విడుదల అయ్యింది. అభిమానులను మాత్రమే కాదు... అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ టీజర్ మెప్పించింది. సోషల్ మీడియాలో డిస్కషన్ పాయింట్ అయింది. విడుదలైన 24 గంటల్లో రికార్డుల మోత మోగించింది.


ఆల్ టైం టాప్ 5 లిస్టులో 'అఖండ 2' టీజర్!
బాలకృష్ణ కథానాయకుడిగా బ్లాక్ బస్టర్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన తాజా సినిమా 'అఖండ 2 తాండవం' (Akhanda 2 Thaandavam). జూన్ 9వ తేదీ సాయంత్రం 6.03 గంటలకు టీజర్ విడుదల అయ్యింది. జూన్ 10వ తేదీ సాయంత్రానికి ఆల్మోస్ట్ 25 మిలియన్స్ వ్యూస్ (తెలుగు, హిందీ సహా మిగతా భాషల్లో కలిపి) సాధించింది. అలాగే 5.9 లక్షల లైక్స్ వచ్చాయి.


Also Read: అభిమానితో బాలకృష్ణ ఫోన్ కాల్ రికార్డింగ్ లీక్...‌ అఖండ 2 టీజర్ గురించి డిస్కషన్






అత్యధిక వ్యూస్ సాధించిన తెలుగు సినిమా టీజర్లలో రెబల్ స్టార్ 'రాధే శ్యామ్' మొదటి స్థానంలో ఉంది. 42.67 మిలియన్ వ్యూస్ దానికి వచ్చాయి. ఆ తరువాత 32.40 మిలియన్ వ్యూస్‌తో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 'గేమ్ చేంజర్' సినిమా నిలిచింది. మూడో స్థానంలో సూపర్ స్టార్ మహేష్ బాబు 'సర్కారు వారి పాట' ఉంది. ఆ టీజర్ 23.06 మిలియన్ న్యూస్ సొంతం చేసుకుంది. ఇక నాలుగో స్థానంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'ఇంట్రడ్యూసింగ్ పుష్ప రాజ్' టీజర్ ఉంది దానికి 22.33 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇప్పుడు 'అఖండ 2' టీజర్ 22.33 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుని 5వ స్థానంలో ఉంది. ఈ వ్యూస్ కేవలం తెలుగు టీజర్స్ లెక్కలు. 


Also Readఒక్క లుక్కుతో చంపేశాడు... 'అఖండ 2' టీజర్‌లో ఆది పినిశెట్టి - అదీ బాలయ్య సినిమాలో విలన్ ఇంపాక్ట్


'అఖండ 2' టీజర్ విడుదల తరువాత సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ముఖ్యంగా హీరో లుక్, ఆయనను బోయపాటి చూపించిన విధానం, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అన్నీ కలగలిపి ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పించాయి. హిందీలోనూ బాలకృష్ణ డబ్బింగ్ చెప్పడం విశేషం. ఆయన సరసన సంయుక్త కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో ఆది పినిశెట్టి విలన్. 14 రీల్స్ ప్లస్ పతాకం మీద రామ్ ఆచంట గోపి ఆచంట ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. విజయదశమి కానుకగా సెప్టెంబర్ 25న ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానున్న సంగతి తెలిసిందే.