కోలీవుడ్ స్టార్ ధనుష్, కింగ్ నాగార్జున, నేషనల్ క్రష్ రష్మికా మందన్న ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన పాన్ ఇండియా సినిమా 'కుబేర'. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. తెలుగు, తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో జూన్ 20న థియేటర్లలోకి రానుంది. ముంబైలో మంగళవారం మూడో పాట 'పీ పీ డుమ్ డుమ్'ను గ్రాండ్‌గా లాంచ్ చేశారు. ఆ లాంచ్ హైలైట్స్ ఏమిటో తెలుసుకోండి.
డంప్ యార్డులో రష్మికకు వాసన రాలేదట - ధనుష్Dhanush speech at Kuberaa 3rd Single launch: 'కుబేర' తనకు చాలా స్పెషల్ ఫిల్మ్ అని ధనుష్ చెప్పారు. ఇదొక డిఫరెంట్ ఫిల్మ్ అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... ''నా మనసుకు దగ్గరైన సినిమా 'కుబేర'. నాగార్జున గారితో వర్క్ చేయడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఈ సినిమా కోసం పాజిటివ్ టీంతో కలిసి పని చేశా. ఇందులో బెగ్గర్ క్యారెక్టర్ చేశా. శేఖర్ కమ్ముల బ్రిలియంట్ డైరెక్టర్. ఈ సినిమా కోసం ఆయన చెప్పింది ఫాలో అయ్యా. శేఖర్ గారు చాలా స్వచ్ఛమైన మనిషి. ఆయన చెప్పిన 20 నిమిషాలు కథ, ఆయన ఎనర్జీ నాకు నచ్చింది. వెంటనే ఓకే చేశా. మేం నిజాయతీగా చేసిన చిత్రమిది. చిత్రీకరణ కోసం డంప్ యార్డులో దాదాపు ఏడు గంటలు నేను, రష్మిక ఉన్నాం. అక్కడ అంత సేపున్నా 'నాకేం వాసన రావట్లేదు' అని రష్మిక చెప్పింది'' అని అన్నారు. అందరికీ సినిమా నచ్చుతుందని చెప్పారు.
కెరీర్ స్టార్టింగ్ నుంచి హిందీలో ఆదరణ సూపర్ - నాగార్జునNagarjuna speech at Pippi Pippi Dum Dum Dum Single launch: శివ, క్రిమినల్ నుంచి మొదలు పెడితే తన కెరీర్ స్టార్టింగ్ నుంచి హిందీ ప్రేక్షకుల ఆదరణ చాలా బావుందని కింగ్ నాగార్జున చెప్పారు. ఆయన ఇంకా మాట్లాడుతూ... ''నాకు 'కుబేర' చాలా స్పెషల్ ఫిల్మ్. ఏదోకటి డిఫరెంట్‌గా చేయాలనుకున్నప్పుడు శేఖర్ కమ్ముల వచ్చారు. ఆయనతో సినిమా చేయాలని పదిహేను ఏళ్లుగా అనుకుంటున్నా. 'కుబేర' గురించి చెప్పినప్పుడు మరో ఆలోచన లేకుండా ఓకే చేశా. శేఖర్ మనసు స్వచ్ఛంగా ఉంటుంది. అది తెరపై కనిపిస్తుంది. జిమ్ సర్బ్ నాకంటే చాలా చక్కగా తెలుగు మాట్లాడారు. రష్మిక పవర్ హౌస్ ఆఫ్ టాలెంట్. తన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్స్ అవుతున్నాయి. రెండు వేల కోట్లు, మూడు వేల కోట్లు కలెక్ట్ చేసిన సినిమాలు ఉన్నాయి. దేవిశ్రీ ప్రసాద్ నా ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్. ఈ సినిమాకు అవుట్ స్టాండింగ్ మ్యూజిక్ ఇచ్చారు. అతని సంగీతం ఈ సినిమాను నెక్ట్స్ లెవల్‌కు తీసుకు వెళ్ళింది. ధనుష్ బ్రిలియంట్ యాక్టర్. ప్రతి సినిమాకు వైవిధ్యం చూపించే అతను ఈ సినిమాలో అద్భుతంగా చేశారు. అతనితో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది'' అని చెప్పారు. జూన్ 20న థియేటర్లలో సినిమాను చూడమని ప్రేక్షకులను కోరారు.
Also Read: వీరమల్లు వాయిదా: ఖాళీ అయిన జూన్ రెండో వారం.. డబ్బింగ్ సినిమాలకు కలిసొచ్చింది
గీతాంజలి, శ్రీవల్లిలా ఈ క్యారెక్టర్ గుర్తుంటుంది - రష్మిక'యానిమల్'లో గీతాంజలి, 'పుష్ప'లో శ్రీవల్లి, 'ఛావా'లో యేసుబాయి క్యారెక్టర్స్ తరహాలో 'కుబేర'లో తాను చేసిన క్యారెక్టర్ ఆడియన్స్ అందరికీ గుర్తు ఉంటుందని రష్మిక చెప్పారు. ధనుష్, నాగార్జునతో నటించడం ఆనందంగా ఉందన్నారు. ఇంకా రష్మిక మాట్లాడుతూ... ''రియల్ లొకేషన్స్‌లో 'కుబేర' షూటింగ్ చేశాం. శేఖర్ కమ్ముల గారితో వర్క్ చేయడం మంచి ఎక్స్పీరియన్స్'' అని అన్నారు. ఈ సినిమా కోసం తెలుగులో డైలాగ్స్ చెప్పానని బాలీవుడ్ యాక్టర్ జిమ్ సర్భ్ అన్నారు. 'కుబేర' కోసం తెలుగు నేర్చుకోవడం సవాలుగా అనిపించిందని, ఇదొక అద్భుతమైన సినిమా అని చెప్పారు.
Also Read: ఒక్క లుక్కుతో చంపేశాడు... 'అఖండ 2' టీజర్‌లో ఆది పినిశెట్టి - అదీ బాలయ్య సినిమాలో విలన్ ఇంపాక్ట్