పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సామాజిక మాధ్యమాల్లో అంత చురుగ్గా ఉండరు. ఆయనకు ట్విట్టర్ అకౌంట్ ఉంది. అందులో ఎక్కువగా రాజకీయాలకు సంబంధించిన పోస్టులే చేస్తారు. ఆయన ట్విట్టర్ అకౌంటులో సాహిత్య రచనలు, రాజకీయ విమర్శలకు ప్రాధాన్యం ఇస్తారు. ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లోనూ పవన్ కళ్యాణ్ అడుగు పెట్టారు. ఈ రోజు అందులో తొలి పోస్ట్ చేశారు. 


ఇన్‌స్టాలో సినిమాలకు పవన్ ప్రిఫరెన్స్!
Pawan Kalyan First Instagram Post : పవన్ కళ్యాణ్ మొదటి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ చూస్తే... ఆయన సినిమాలకు ప్రిఫరెన్స్ ఇచ్చారని అర్థం చేసుకోవచ్చు. 


''ఎప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపకాలు! చలన చిత్ర పరిశ్రమలో భాగమై ఎంతో మంది ప్రతిభావంతులతో, నిరాడంబరమైన వ్యక్తులతో కలిసి ప్రయాణిస్తున్నందుకు కృతజ్ఞుణ్ణి'' అని పవన్ ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన వీడియోలో మొదట కనబడుతుంది. ఆ తర్వాత హీరోలు, దర్శకులు, హీరోయిన్లు, ఇతర సాంకేతిక నిపుణులతో కలిసి దిగిన ఫోటోలను పోస్ట్ చేశారు. 


Pawan Kalyan Photos With Heroes : అన్నయ్య చిరంజీవి తనకు ముద్దు పెట్టిన ఫోటోను ఇన్‌స్టా పోస్టులో మొదట పొందు పరిచారు పవన్ కళ్యాణ్. ఆ తర్వాత బాలకృష్ణ, అన్నయ్య కాకుండా తనకు ఎంతో ఇష్టమైన కథానాయకుడు అని చెప్పే అమితాబ్ బచ్చన్, నాగార్జున, వెంకటేష్ సహా తోటి హీరోలు మహేష్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్, రవితేజతో పాటు ఎంతో మంది సీనియర్ & జూనియర్ హీరోల, దర్శకులతో, హీరోయిన్లతో, సంగీత దర్శకులు, సాంకేతిక నిపుణులతో దిగిన ఫోటోలను ఆయన పోస్ట్ చేశారు. 


''మన బంధం ఇలానే కొనసాగాలని, మరెన్నో మధురమైన జ్ఞాపకాల్ని పంచుకోవాలని ఆశిస్తూ...'' అంటూ ఆయన ఈ పోస్ట్ చేశారు. 


Also Read : మహేష్ బాబు కుమార్తె గొప్ప మనసు - ఆ డబ్బులన్నీ ఛారిటీకే...






Pawan Kalyan Upcoming Movies : ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాలకు వస్తే... ఈ నెలాఖరున మేనల్లుడు సాయి ధరమ్ తేజ్, ఆయన కలిసి చేసిన 'బ్రో' థియేటర్లలోకి రానుంది. ఆ సినిమాలో రెండో పాట 'జాణవులే'ను ఈ రోజు విడుదల చేశారు. సముద్రఖని రచన, దర్శకత్వం వహించిన చిత్రమిది. త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ, మాటలు రాశారు. 


Also Read ప్రభాస్, దీపిక సినిమా టైటిల్ 'కాలచక్రం'- కె మీనింగ్ అదేనా?



'బ్రో' కాకుండా పవన్ కళ్యాణ్ సినిమాలు మూడు చిత్రీకరణ దశలో ఉన్నాయి. 'హరి హర వీరమల్లు' ఎప్పుడో ప్రారంభమైనా నిదానంగా అడుగులు వేస్తోంది. 'సాహో' ఫేమ్ సుజీత్ దర్శకత్వం వహిస్తున్న 'ఓజీ' చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. పవన్ కళ్యాణ్ అవసరం లేని సన్నివేశాలను చకచకా తీస్తున్నారు. 'గబ్బర్ సింగ్' తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్'. ఆ సినిమా చిత్రీకరణ సైతం మొదలైంది. ఆ మధ్య విడుదలైన గ్లింప్స్ అభిమానులను, ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాలు అన్నీ వచ్చే రెండేళ్లలో విడుదల కానున్నాయి. ఒకవైపు సినిమాలు చేస్తూ మరోవైపు రాజకీయాల్లో పవన్ బిజీ బిజీగా ఉన్నారు. 














ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial