పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పుట్టినరోజు సంబరాలు రెండు మూడు రోజుల ముందు ప్రారంభం అయ్యాయని చెప్పాలి. సెప్టెంబర్ 2న జనసేనాని జన్మదినం. అయితే... ఆగస్టు 30 నుంచి అభిమానులు సంబరాలు షురూ చేశారు. పవన్ పుట్టినరోజు సందర్భంగా 'తమ్ముడు', 'జల్సా' సినిమాలను రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.


'తమ్ముడు' (Thammudu Movie Re Release) థియేటర్లలో విడుదలై 23 సంవత్సరాలు దాటింది. టీవీల్లో చాలా సార్లు టెలికాస్ట్ అయ్యింది. యూట్యూబ్‌లో అందుబాటులో ఉంది. 'జల్సా' విడుదలై సుమారు 14 ఏళ్ళు. అదీ యూట్యూబ్‌లో ఉంది. ఇప్పుడు ఈ రెండు సినిమాలు రీ రిలీజ్ అవుతున్నాయా? లేదంటే కొత్తగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమాలా? అనే స్థాయిలో ఆ రెండిటిని ప్రదర్శిస్తున్న థియేటర్ల దగ్గర సందడి నెలకొంది.


Pawan Kalyan Birthday Special : హైదరాబాద్ సిటీలో ప్రముఖ మల్టీప్లెక్స్‌ల‌లో ఒకటైన ప్రసాద్స్‌లో బుధవారం ఉదయం పవర్ స్టార్ అభిమానుల సందడి స్పష్టంగా కనిపించింది. విక్రమ్ కొత్త సినిమా 'కోబ్రా' కంటే పవన్ పాత సినిమాకు వచ్చిన ప్రేక్షకులు ఎక్కువ. స్క్రీన్స్ హౌస్‌ఫుల్స్‌ అవుతున్నాయి. అలాగే, సెప్టెంబర్ 1న రీ రిలీజ్ అవుతున్న 'జల్సా' షోస్ కూడా హౌస్ ఫుల్స్ అవుతున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ ఏంటనేది చెప్పడానికి ఇదొక ఉదాహరణ. 


ప్రపంచవ్యాప్తంగా 500లకు పైగా 'జల్సా' షోలు
Jalsa Special Shows : 'తమ్ముడు' ఆల్రెడీ కొన్ని స్క్రీన్‌ల‌లో రిలీజ్ చేశారు. 'జల్సా'ను సెప్టెంబర్ 1వ తేదీన భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఐదు వందలకు పైగా షోలు ప్లాన్ చేశారు. ఒక్క అమెరికాలో 51 షోస్ వేస్తున్నారు. ఇప్పటి వరకూ అక్కడ రీ రిలీజ్ సినిమాకు ఈ స్థాయిలో షోలు పడలేదు. ఇదొక రికార్డ్ అని చెప్పాలి. రీ రిలీజ్ సినిమాల్లో హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా 'జల్సా' రికార్డు క్రియేట్ చేస్తుందని ట్రేడ్ వర్గాల అంచనా.
 
ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఏడు షోలూ హౌస్‌ఫుల్స్‌
ఒక్క హైదరాబాద్ సిటీలో యాభైకు పైగా స్క్రీన్‌ల‌లో 'జల్సా' విడుదల అవుతోంది. ప్రసాద్ మల్టీప్లెక్స్‌లో సుమారు 20 షోలు వేస్తున్నారు. అందులో బిగ్ స్క్రీన్ మీద వేస్తున్న షోలు కూడా ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్ని స్క్రీన్స్‌లు హౌస్ ఫుల్స్ అవుతున్నాయి. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఏడు షోలు వేస్తుంటే... ఏడూ హౌస్‌ఫుల్స్‌ అయ్యాయి. సంధ్య 70ఎంఎం థియేటర్ దగ్గర పవన్ కళ్యాణ్ 50 అడుగుల కటౌట్ పెట్టారు. 


Also Read : మహేష్ - త్రివిక్రమ్ సినిమా గురించి నోరు విప్పిన తరుణ్


మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా 'పోకిరి' సినిమాను రీ రిలీజ్ చేశారు. అప్పుడు కూడా అద్భుత స్పందన లభించింది. థియేటర్ల దగ్గర అభిమానుల సందడి కనిపించింది. మహేష్ కెరీర్‌లో బెస్ట్ సినిమాల్లో 'పోకిరి' ఒకటి. ఇండస్ట్రీ హిట్ కూడా! పవన్ కళ్యాణ్ కెరీర్‌లో 'తమ్ముడు', 'జల్సా' సినిమాలకు స్పెషల్ ప్లేస్ ఉంటుంది. అయితే... 'ఖుషి', 'అత్తారింటికి దారేది' తరహాలో అవి ఇండస్ట్రీ హిట్స్ కావు. ఆ సినిమాలకూ ఈ స్థాయిలో ఆదరణ లభించడానికి కారణం... పవన్ కళ్యాణ్ క్రేజ్, మాస్ ఇమేజ్.


Also Read : 'కోబ్రా' రివ్యూ : విక్రమ్ సినిమా ఎలా ఉంది? తెలుగులో హిట్ అవుతుందా?