Hari Hara Veera Mallu Dubbing Started: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu) గురించి ఫ్యాన్స్ ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ మూవీకి సంబంధించి ఏ అప్ డేట్ వచ్చినా నిమిషాల్లోనే ట్రెండ్ అవుతోంది. తాజాగా, సినిమాపై మరో అప్ డేట్‌ను మేకర్స్ షేర్ చేశారు.


డబ్బింగ్ పనులు షురూ..


ఈ మూవీకి సంబంధించి డబ్బింగ్ పనులు ప్రారంభమయ్యాయి. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా మూవీ టీం వెల్లడించింది. 'డబ్బింగ్ పూర్తి స్థాయిలో జరుగుతోంది. అసమాన హీరోయిజం ప్రయాణం వెండితెరకు దగ్గరగా వస్తోంది.' అని పేర్కొంది. అయితే.. ఈ మూవీని తొలుత ఈ నెల 28న థియేటర్లలోకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేశారు. కొన్ని కారణాల వల్ల రిలీజ్ వాయిదా పడింది.


Also Read: 'రాబిన్ హుడ్' ట్రైలర్ రిలీజ్ వాయిదా - నితిన్, వెంకీ కుడుముల ఫన్నీ వీడియో.. వార్నర్ చేతుల మీదుగా ట్రైలర్ ఎప్పుడంటే..?


మార్క్ ద డేట్..


ఇటీవలే మూవీ కొత్త తేదీని మేకర్స్ ప్రకటించారు. మే 9న మూవీ రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. 'మార్క్ ద డేట్' అంటూ కొత్త పోస్టర్‌లో చెప్పారు. డిప్యూటీ సీఎంగా పవన్ ప్రజా పాలనలో ఫుల్ బిజీగా మారగా.. ఆయన హీరోగా నటిస్తోన్న ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన సాంగ్స్ ట్రెండింగ్‌గా మారాయి. ఈ చిత్రాన్ని 2 భాగాలుగా తెరకెక్కిస్తుండగా ఫస్ట్ పార్ట్‌ను 'స్వార్డ్ వర్సెస్ స్పిరిట్' పేరుతో మే 9న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.






పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. బాబీ డియోల్, అనుపమ్ ఖేర్, నోరాహి ఫతేహి, విక్రమ్ జీత్, జిషుసేన్ గుప్తా, సునీల్, నాజర్, కబీర్ సింగ్, సుబ్బరాజు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై ఎ.దయాకర్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు.


ఈ చిత్రం ఫస్ట్ పార్ట్‌ను సగానికి పైగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. కొన్ని కారణాల వల్ల ఆయన తప్పుకోవడంతో మిగిలిన భాగానికి నిర్మాత ఏఎం రత్నం కుమారుడు జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. సెకండ్ పార్ట్‌ను సైతం ఆయనే తెరకెక్కించనున్నారు. అనుకున్న టైంకు చిత్రాన్ని రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీ విడుదల వాయిదా పడడంతో అదే రోజున నితిన్ 'రాబిన్ హుడ్' మూవీ రిలీజ్ కానుంది.