Dhanashree Verma: క్రికెటర్ చాహల్‌తో విడాకులు - గృహహింసపై ధనశ్రీ వర్మ కొత్త పాట.. యూట్యూబ్‌లో ట్రెండింగ్

Dhanashree Verma Song: సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ధనశ్రీ వర్మ తాజాగా విడుదల చేసిన పాట ట్రెండింగ్‌గా మారింది. భర్త చాహల్ నుంచి విడాకులు తీసుకున్న మరుసటి రోజే ఆమె ఈ సాంగ్ రిలీజ్ చేశారు.

Continues below advertisement

Dhanashree Verma's Song On Domestic Violence Trending In Youtube: క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ (Yuzvendra Chahal), సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ధనశ్రీ వర్మ (Dhanashree Verma) వారి వివాహ బంధానికి స్వస్తి పలికిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ధనశ్రీ వర్మ తాజాగా విడుదల చేసిన ఓ ప్రైవేట్ ఆల్బమ్‌లోని సాంగ్ వైరల్ అవుతోంది. 

Continues below advertisement

గృహ హింసపై సాంగ్.. యూట్యూబ్‌లో ట్రెండింగ్

'దేఖా జీ దేఖా మైనే' (Dekha ji Dekha Maine) అంటూ సాగే ఈ పాటలో ధనశ్రీ వర్మ గృహ హింస బాధితురాలిగా, భర్త చేతిలో మోసపోయిన మహిళగా కనిపించారు. టీ సిరీస్ బ్యానర్‌పై విడుదలైన ఈ పాటను జ్యోతి సూరన్ ఆలపించారు. ఇష్వాక్, ధనశ్రీ కలిసి ఈ పాట కోసం కలిసి వర్క్ చేయగా.. ఇందులో వారు భార్యాభర్తలుగా కనిపించారు. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌లో ట్రెండింగ్‌గా మారింది. క్రికెటర్ చాహల్‌తో విడాకులు మంజూరైన మరుసటి రోజే ధనశ్రీ ఈ పాట విడుదల చేయడంపై నెట్టింట చర్చ మొదలైంది.

భర్తను ఎంతగానో ప్రేమించే మహిళగా ఆమె పాటలో కనిపించారు. ఆమె ఎంతగానో ప్రేమించినప్పటికీ అతను మాత్రం వేరే అమ్మాయితో రిలేషన్‌లో ఉండడం.. దీనిపై ప్రశ్నిస్తే ఆమెపై దాడికి పాల్పడడం, చివరకు వైవాహిక జీవితానికి స్వస్తి పలకడం వంటి సీన్స్‌ పాటలో ఉన్నాయి. ఈ సాంగ్‌కు ఇప్పటికే 12 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.

Also Read: సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన సుకుమార్ కుమార్తె మూవీ - 'గాందీ తాత చెట్టు' స్ట్రీమింగ్ ఎందులోనో తెలుసా..?

విడాకులు మంజూరు

భారత స్పిన్నర్ చాహల్, ధనశ్రీల వివాహం 2020లో జరిగింది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ జంట గతంలో పెట్టిన పోస్టులు వైరల్‌గా మారాయి. ఇరువురూ విభేదాలతో 2022 నుంచి విడివిడిగానే ఉంటున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాల్లో వీరిద్దరూ ఒకరినొకరు అన్ ఫాలో చేసుకోవడం, ధనశ్రీ తన పేరు నుంచి చాహల్ అనే పదం తొలగించడంతో వీరిద్దరూ విడిపోతున్నారనే వార్తలు హల్చల్ చేశాయి. ఆ వార్తలను నిజం చేస్తూ వీరిద్దరూ విడాకుల కోసం ఈ ఏడాది ఫిబ్రవరిలో కోర్టును ఆశ్రయించగా.. విచారించిన న్యాయస్థానం వీరికి విడాకులు మంజూరు చేసింది.

ముంబయిలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసినట్లు చాహల్ తరఫు న్యాయవాది నితిన్ కుమార్ గుప్తా వెల్లడించారు. పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుంటున్నందున 6 నెలలు తప్పనిసరి గడువును బాంబే హైకోర్టు రద్దు చేసింది. విడాకుల పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవాలని ఫ్యామిలీ కోర్టును ఆదేశించగా.. విచారించి ఈ నెల 20న విడాకులు మంజూరు చేసింది. 

భరణం కింద రూ.4.75 కోట్లు

ధన శ్రీకి భరణం కింద రూ.4.75 కోట్లు ఇవ్వడానికి చాహల్ అంగీకరించినట్లు తెలుస్తోంది. ఆ మొత్తంలో ఇప్పటివరకూ రూ.2.37 కోట్లు చెల్లించినట్లు సమాచారం. విడాకుల తీర్పులో భాగంగా గురువారం ఇద్దరూ కోర్టుకు హాజరుకాగా.. కారు దిగి ధనశ్రీ కోర్టులో అడుగుపెడుతున్న సమయంలో కొందరు విలేకరులు, ఫోటోగ్రాఫర్లు అత్యుత్సాహం ప్రదర్శించారు. దీంతో వారిపై ఆమె అసహనం వ్యక్తం చేశారు.

Continues below advertisement