Nithiin's Robinhood Movie Trailer Release Latest Date: యంగ్ హీరో నితిన్ (Nithiin), వెంకీ కుడుముల లేటెస్ట్ మూవీ 'రాబిన్ హుడ్' (Robinhood). ఈ నెల 28న మూవీ థియేటర్లలో రిలీజ్ కానుండగా.. 21న ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్లు మూవీ టీం ప్రకటించింది. అయితే, కొన్ని అనివార్య, సాంకేతిక కారణాలతో ట్రైలర్ ఈ రోజు రిలీజ్ చేయడం లేదని ప్రకటించింది.
ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే..?
ఈ మూవీ ట్రైలర్‌ను ఈ నెల 23న గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రిలీజ్ చేస్తామని సోషల్ మీడియా వేదికగా మూవీ టీం వెల్లడించింది. 'ఊహించని పరిస్థితులు, సాంకేతిక సమస్యల కారణంగా ఈ రోజు ట్రైలర్ విడుదల కావడం లేదు. మార్చి 23న గ్రాండ్‌గా ట్రైలర్‌ను రిలీజ్ చేస్తాం. ఈ సమయం వేచి ఉండడానికి విలువైనది. మీ అంచనాలను అలానే ఉంచండి.' అని పేర్కొంది.
ఫన్నీ వీడియోతో..
అయితే, ట్రైలర్ రిలీజ్ పోస్ట్ పోన్ అయిన విషయాన్ని హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల ఓ ఫన్నీ వీడియోతో డిఫరెంట్‌గా చెప్పారు. 'చెప్పిన టైంకు ఎప్పుడైనా కంటెంట్ రిలీజ్ చేశారా..?' అని ఏఐ కామెంట్స్ రూపంలో అడుగుతున్నట్లు ఉండగా.. 'మీరే హ్యాండిల్ చెయ్యండన్నా' అంటూ వెంకీ నితిన్‌కు చెప్తారు. ఈ క్రమంలోనే కొన్ని ఫన్నీ మీమ్స్ కూడా వీడియోలో ప్రత్యక్షమవుతాయి.
వార్నర్ చేతుల మీదుగా..
ఈ ఫన్నీ కామెంట్స్ నడుమ.. ఫైనల్‌గా నితిన్, వెంకీ కలిసి ట్రైలర్ లాంఛ్ ఈ నెల 23న ఉంటుందని తెలిపారు. క్రికెటర్ డేవిడ్ వార్నర్ చేతుల మీదుగా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.
భీష్మ' వంటి హిట్ తర్వాత యంగ్ హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల (Venky Kudumula) నుంచి వస్తోన్న లేటెస్ట్ మూవీ 'రాబిన్ హుడ్'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీలో నితిన్ సరసన శ్రీలీల నటిస్తున్నారు. ఈ మూవీని నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ మూవీలో అతిథి పాత్రలో క్రికెటర్ వార్నర్ కనిపించనున్నారు. అలాగే, సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ నెల 28న మూవీ థియేటర్లలోకి రానుంది. మరోవైపు, ఈ మూవీలో 'అది దా సర్ ప్రైజు' సాంగ్ స్టెప్పులపై విమర్శలు రాగా.. నితిన్ స్పందించారు. తాము అందరి అభిప్రాయాలను గౌరవిస్తామని చెప్పారు.