Pawan Kalyan And Akira Meets Modi: ఏపీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ అనూహ్య విజయం సాధించినప్పటి నుంచి తన మాజీ భార్య రేణు దేశాయ్ సోషల్ మీడియా పోస్టులన్నీ పరోక్షంగా పవన్ కళ్యాణ్ చుట్టూనే తిరుగుతున్నాయి. అంతే కాకుండా ఇప్పటివరకు ఎక్కువగా పబ్లిక్ ముందుకు రాని పవన్ కుమారుడు అకిరా సైతం ఎన్నికల్లో తన తండ్రి పవన్ విజయం సాధించినప్పటి నుంచి తనతోనే బయట ఎక్కువగా కనిపిస్తున్నాడు. అంతే కాకుండా అకిరా ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు అని ఎప్పటికప్పుడు ప్రేక్షకులతో షేర్ చేసుకుంటున్నారు తన తల్లి రేణు దేశాయ్. తాజాగా అకిరా.. మోదీని కలిసిన విషయం కూడా పోస్ట్ ద్వారానే బయటపెట్టింది.
ఎమోషనల్‌గా అనిపిస్తోంది..
ఎన్నికల్లో గెలిచిన తర్వాత మొదటిసారి మోదీని ప్రత్యేకంగా కలిశారు పవన్ కళ్యాణ్. తన కుమారుడు అకిరాను కూడా తన వెంటే తీసుకెళ్లాడు. ఈ విషయాన్ని రేణు దేశాయ్ స్వయంగా పోస్ట్ చేశారు. ‘‘నేను ముందు నుంచే బీజేపీకి పెద్ద ఫ్యాన్’’ అంటూ అసలు సంగతి చెప్పేసింది రేణు. తన కొడుకు మోడీని కలవడంపై స్పందిస్తూ.. ‘‘ఈరోజు నా కొడుకు అకిరాను ప్రధాన మంత్రి మోదీగారి పక్కన నిలబడడం చూస్తుంటే చాలా ఆనందంగా, ఎమోషనల్‌గా అనిపిస్తోంది. దీని గురించి చాలా చెప్పాలని, రాయాలని అనిపిస్తోంది. కానీ నాలోని ఎమోషన్స్‌ను సరిగా చెప్పడానికి మాటలు రావడం లేదు’’ అంటూ సంతోషాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నానంటూ పోస్ట్ చేశారు రేణు దేశాయ్.
కామెంట్స్ ఆఫ్..
అంతే కాకుండా అకిరా.. మోదీని కలిసిన తర్వాత తన ఫీలింగ్ ఏంటని కూడా ఈ పోస్ట్‌లో చెప్పుకొచ్చారు రేణు. ‘‘ప్రధాని మోదీ గారిని కలిసిన తర్వాత అకిరా నాకు ఫోన్ చేశాడు. మోదీ గారి చుట్టూ ఒక అద్భుతమైన వైబ్ ఉందని, ఆ రూమ్‌లో ఉన్నంతసేపు ఆయన స్ట్రాంగ్ గొప్పతనాన్ని ఫీల్ అవుతూనే ఉన్నాను అని చెప్పాడు’’ అని బయటపెట్టారు రేణు దేశాయ్. ఇక అకిరా గురించి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ప్రతీసారి తనను పవర్ స్టార్ 2 అంటూ రకరకాల పేర్లతో పిలుస్తున్నారని రేణు ఫైర్ అయ్యారు. అందుకే ఈ పోస్ట్‌పై ఆమె కామెంట్స్ పూర్తిగా ఆఫ్ చేసేశారు.
అలా పిలవద్దు..
పవన్ కళ్యాణ్ కుమారుడు అకిరా నందన్.. కొన్నిరోజులుగా ఎక్కువగా పబ్లిక్‌లో కనిపిస్తుండడంతో మరోసారి తను హీరో అయితే బాగుంటుందంటూ ఫ్యాన్స్ తెగ కామెంట్స్ పెడుతున్నారు. ఇప్పటికే అకిరాకు హీరో అవ్వడం, యాక్టింగ్ చేయడం ఇష్టం లేదని తన తల్లి రేణు దేశాయ్ పలుమార్లు క్లారిటీ ఇచ్చారు. కానీ ఫ్యాన్స్ మాత్రం ఆ మాటలను పట్టించుకోకుండా పవన్ లాగానే అకిరా కూడా హీరో అయితే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అది రేణుకు నచ్చక తాజాగా తన కొడుకును అకిరా అని మాత్రమే పిలవమని, తన డెబ్యూ గురించి చర్చించడం మానేయమని సూచించింది.