Pavitra Lokesh Funny Comments On Naresh In Veeranjaneyulu Viharayathra Teaser Launch : సీనియర్ నటుడు నరేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం ‘వీరాంజనేయులు విహారయాత్ర’. ఈ సినిమాకి సంబంధించి టీజ‌ర్ లాంచ్ ఈవెంట్ ని హైద‌రాబాద్ లో నిర్వ‌హించారు. టీజ‌ర్ ని ప్ర‌ముఖ న‌టి ప‌విత్ర లాంచ్ చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ మీడియా మొఘ‌ల్ రామోజీ రావును గుర్తు చేసుకున్నారు. సినిమా ఇండస్ట్రీకి ఆయ‌న సేవ‌ల‌ను కొనియాడారు ప‌విత్ర‌. ఇక ఆమె మాట్లాడుతూ బేబీని వెతికి పెట్టానని, చాలా క‌ష్ట‌ప‌డ్డాన‌ని న‌రేశ్ తో కామెడీ చేశారు.


ఫిలిమ్ సిటీ ఓ అద్భుతం.. 


‘వీరాంజనేయులు విహారయాత్ర’ టీజ‌ర్ లాంచ్ కి స్పెష‌ల్ గెస్ట్‌గా వ‌చ్చారు ప‌విత్ర‌. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడారు. త‌న‌ను ఈవెంట్ కి, టీజ‌ర్ లాంచ్ కి పిలిచినందుకు స్పెష‌ల్ థ్యాంక్స్ చెప్పారు. ఈ సంద‌ర్భంగా ఆమె రామోజీ రావును గుర్తు చేసుకున్నారు. ఈటీవీ గురించి మాట్లాడారు. ఈటీవీలో త‌ను మొద‌టి సీరియ‌ల్ చేశాన‌ని, త‌న‌కు అవ‌కాశం ఇచ్చింది ఈటీవీనే అని చెప్పుకొచ్చారు ఆమె. ఈటీవీ క‌న్న‌డ‌లో త‌ను చేసిన సీరియ‌ల్ ఐదేళ్లు ఆడింద‌ని, అది ఎప్పుడూ ఫ‌స్ట్ ప్లేస్ లోనే ఉండేద‌ని గుర్తు చేసుకున్నారు ప‌విత్ర‌. రామోజీ ఫిలిమ్ సిటీ నిజంగా ఒక అద్భుతం అని అన్నారు. ఢిల్లీలో కొన్ని మాన్యుమెంట్స్ ఉన్న‌ట్లు హైద‌రాబాద్ కి రామోజీ ఫిలిమ్ సిటీ ఒక మాన్యుమెంట్ అని చెప్పారు ఆమె. సామాన్య ప్ర‌జ‌ల‌కు స్టూడియోస్ ఎలా ఉంటాయి? షూటింగ్ ఎలా జ‌రుగుతుందో రామోజీ ఫిలిమ్ సిటీ ద్వారా తెలిసింద‌ని అన్నారు. త‌న చుట్టాలు, ఫ్రెండ్స్ ఎవ‌రు క‌ర్నాట‌క నుంచి వ‌చ్చినా త‌ను క‌చ్చితంగా రామోజీ ఫిలిమ్ సిటీకి తీసుకొస్తాన‌ని చెప్పుకొచ్చారు ప‌విత్ర‌. 


బేబీని తీసుకొచ్చాను.. 


టీజర్ గురించి మాట్లాడుతూ.. "బేబీ కోసం న‌రేశ్ గారు తెగ వెతుకుతున్నారు. అందుకే వెతికి తీసుకొచ్చాను బేబీని. మ‌ళ్లీ ఆ బేబి ఎక్క‌డికైనా వెళ్లిపోతే నేనేం చేయ‌లేను. అంద‌రూ సినిమా చాలా బాగుంటుంది అంటున్నారు. ఆల్ ది బెస్ట్. న‌రేశ్ గారి గురించి నేను ప్ర‌త్యేకంగా చెప్పక్క‌ర్లేదు. గ్రెట్ యాక్ట‌ర్ ఇన్ ఇండియ‌న్ సినిమా. ఏ క్యారెక్ట‌ర్ అయినా చాలా హోం వ‌ర్క్ చేస్తారు. నేను చూస్తూనే ఉంటాను. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఒక క్యారెక్ట‌ర్ ఇస్తే దాన్ని ఎలా ప్ర‌జంట్ చేయాలి? మేకోవ‌ర్ ఎలా చేయాలి? అని చాలా చాలా హార్డ్ వ‌ర్క్ చేస్తారు. క్యారెక్ట‌ర్ చేశాక కూడా ఆయ‌న జీవిస్తాడు. ఈ సినిమా గురించి చెప్పాలంటే. మొద‌టి రోజు నుంచి చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాడు. ఔట్ పుట్ కూడా అలానే వ‌చ్చింది అనుకుంటున్నాను. న‌న్ను ఈ కార్య‌క్ర‌మానికి పిలిచినందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ప్ర‌తి ఒక్క‌రికి ఆల్ ది బెస్ట్" అని సినిమా టీమ్ ని విష్ చేశారు ప‌విత్ర‌. 


ఈ సినిమాలో సీనియ‌ర్ న‌టుడు న‌రేశ్ ముఖ్య పాత్ర‌లో న‌టించారు. ఆయ‌న‌తో పాటు శ్రీలక్ష్మి, ప్రియా వడ్లమాని, రాగ్‌ మయూర్ ఇతరులు కీలక పాత్రల్లో న‌టించారు. సినిమాకు అనురాగ్‌ పలుట్ల దర్శకత్వం వహించారు. బాపినీడు.బి, సుధీర్‌ ఈదర సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. కుటుంబమంతా కలిసి చేసే ఓ విహార యాత్ర చుట్టూ తిరిగే కథనంతో ఈ సినిమా తెరకెక్కింది. 


Also Read: ఆ చెంబులో బ్రహ్మానందం, ‘వీరాంజనేయుల విహారయాత్ర’ టీజర్ చూస్తే పడీపడీ నవ్వాల్సిందే!