Paruchuri Gopala Krishna Interesting Comments on Pawan Kalyan Over Victory in AP Electioఆంధ్రప్రదేశ్‌ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌పై సినీ రచయిత పరుచూరి గోపాల కృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డిప్యూటీ సీఎంగా ఆయన ప్రమాణ స్వీకారం చేసినప్పుడు తాను ఎమోషనల్‌ అయ్యానన్నారు. ఎప్పుడు సినిమాల విషయంలో తన పాయింట్‌ ఆఫ్‌ వ్యూ చెబుతూ అందులోని ప్లస్‌లు మైనస్‌ వివరిస్తుంటారు. అంతేకాదు మూవీ కథ విషయంలో డైరెక్టర్‌ తీసుకున్న టాకాఫ్‌ నుంచి మొదలు కథను మలుపు తిప్పే అంశాలపై చర్చిస్తున్నారు. దీంతో పరుచూరి ఇచ్చే మూవీ రివ్యూలు ప్రాధాన్యతను సంతరించుకుంటాయి. అలాంటి పరుచూరి డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌పై చేసిన కామెంట్స్‌ ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి.


పవన్ చరిత్ర సృష్టించారు..


ఈ ఎన్నికల్లో పవన్‌ కళ్యాణ్‌ గెలుపు చరిత్ర అనే చెప్పాలి. ఇప్పుడు అదే విషయాన్ని పరుచూరి కూడా ప్రస్తావించారు. 2024 ఏపీ ఎన్నికల్లో పవన్‌ కళ్యాణ్‌ కీలకంగా వ్యవహిరంచారన్నారు. అసలు రాజకీయాల్లోనే పనికి రాడు అని విమర్శించిన వారికి ఆయన గెలుపే సమాధానం అన్నారు. సుధీర్ఘ అనుభవం ఉన్న రాజకీయ నాయకుడిలా ఎత్తుగడ వేశారంటూ పవన్‌పై ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. "ఒకసారి ఆయనను గమనిస్తే అప్పుడప్పుడు పవన్‌ సడెన్‌గా చిరు నవ్వులు చిందిస్తుంటారు. చాలా సార్లు గమనించాను ఎప్పుడు నవ్వుతాడు, ఎందుకు అని. ఆ నవ్వు వెనక చాలా అర్థం ఉంటుంది. నేను ఆయనకు వీరాభిమానిని. ఆయన సినిమాలకు కథలు అదృష్టం మాకు రాలేదు. కానీ ఆయన రాజకీయాలకు పనికిరాడు.. నిలబడలేడు అని విమర్శించినవారికి చరిత్ర సృష్టించి చూపించారు.


చంద్రబాబు రాముడు.. పవన్ లక్ష్మిణుడు..


ఇనాళ్లు ఆయన మాట్లాడింది సినిమా డైలాగ్స్‌ కాదని నిరూపించారు. చాలా ఆలోచించి ఎన్నికల్లో హుందాగా వ్యవహించారు.  ఆయన చెప్పినట్టుగానే గెలిచి దానికి తగినట్టు పని చేస్తున్నారు. సినీరంగలో పవన్‌ స్థాయి మనందరికి తెలుసు. ఆయన ఉపముఖ్యమంత్రిగా ఎంతో హుందాగా ఒప్పిగ్గా పని చేస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు అన్ని నెరవేర్చే దిశగా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. ఆయన డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు కళ్లార్పకుండా ఆయననే చూస్తుండిపోయాను. చిన్న పిల్లాడు ఎంత ఎదిగిపోయాడో అనిపించింది. ఎదిగేకొద్ది ఒదిగేపోయే తత్త్వంలో ఆయనలో చూస్తుంటే ముచ్చటేస్తుంది. ఏపీలో చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌లు ఒకరు రాముడైతే మరొకరు లక్ష్మిణుడు. ఒకరు కృష్ణుడు అయితే మరొకరు అర్జునుడు" అని పరుచూరి వ్యాఖ్యానించారు. 



అప్పట్లో సీనియర్‌ ఎన్టీఆర్‌ రాజకీయాల్లో ఉంటూనే సినిమాలు చేశారు. పవన్‌ కూడా అలాగే చేయాలని నా కోరిక. నిజానికి పవన్ సినిమాలకు వీఎఫ్‌ఎక్స్‌ ఎఫెక్ట్స, భారీ ఫైటింగ్‌లు అవసరం లేదు. డైలాగ్స్‌ చాలు. అత్తారింటికి దారేది చిత్రంలో గుండెలను హత్తుకునే డైలాగ్స్‌ ఉన్నాయి. అందుకే అంతటి ప్రేక్షాకాదరణ పొందింది. అలాంటి సినిమాలే పవన్‌ నుంచి మరిన్ని కోరుకుంటున్నా. ఆయన డిప్యూటీ సీఎంగా పవన్‌ రాష్ట్ర ప్రజలకు ఎంత మేలు చేస్తారో.. సినీ రంగానికి కూడా అంతే మేలు చేయాలని ఆశిస్తున్నాను" అంటూ ఆయన చెప్పుకొచ్చారు. ప్రస్తుతం పరుచూరి కామెంట్స్‌ హాట్‌టాపిక్‌ అవుతున్నాయి. 


Also Read: నివేద పేతురాజ్‌కు వింత వ్యాధి - బాయ్‌ఫ్రెండ్‌ మోసం చేస్తాడని ముందే ఊహించానంటూ షాకింగ్‌ కామెంట్స్