Nivetha Pethuraj Gets Emotional On Her Boyfriend Cheating: నటి నివేద పేతురాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తమిళ నటి అయినా ఆమె తెలుగులో 'చిత్రలహరి', 'అల వైకుంఠపురంలో' వంటి చిత్రాలతో తెలుగు ఆడియన్స్‌కి దగ్గరైంది. రీసెంట్‌గా పరువు అనే వెబ్ సిరీస్‌తో అలరించింది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ట్రాఫిక్‌లో పోలీసుల గొడవ పడిన ఆమె వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ మధ్య జోమోటో ఫుడ్ క్వాలిటీ లేదంటూ రచ్చ చేసింది. ఇలా తరచూ తన కామెంట్స్‌తో వార్తల్లో నిలిచే నివేద తనకు వింత వ్యాధి గురించి బయటపెట్టింది. ఇటీవల తమిళ యూట్యూబ్ చానల్‌తో ముచ్చటించిన నివేదా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. "నాకు మ్యానిఫెస్టేషన్ (manifestation) వంటి ఫోభియా ఉంది. దానివల్ల నిజం జరిగే సంఘటలను నేను ముందుగానే ఊహించగలుగుతాను. నా చిన్నతనంలో మా తాతతో కలిసి బ్యాక్‌యార్డ్‌లో వెతుకుతుంటే డబ్బు దొరుకుతుందని ఊహించేదాన్ని. ఒకసారి సరిగ్గా అదే జరింది. నేను ఊహించినట్టుగానే నాకు డబ్బులు దొరికేవి అని తెలిపింది. అలాగే నేను రిలేషన్‌లో ఉన్నప్పుడు నా బాయ్‌ఫ్రెండ్ నన్ను చీట్ చేస్తాడని అనుకున్నాను. అలా నేను ఊహించిన కొద్ది రోజులకే నిజంగానే నా బాయ్‌ఫ్రెండ్ నన్ను మోసం చేసి మరోకరితో వెళ్లాడు. ఇలా నా జీవితంలో నేను ఊహించిన సంఘటలు కొద్ది రోజులకు నిజంగా జరుగుతుంటాయి" అంటూ చెప్పుకొచ్చింది.
అలాగే ప్రస్తుతం జరుగుతున్న, జరగబోయే చాలా అంశాలు కూడాతాను చాలాసార్లు ఎప్పుడో ఒక్కసారి ఊహించినవే జరుగుతున్నాయని చెప్పింది. ప్రస్తుతం తాను వాడుతున్న కార్ల విషయంలోనూ ఇదే జరిగిందని తెలిపింది. తనకు మెకనోఫిలియా ఉందని.. అందుకే తనను మోటార్ స్పోర్ట్స్ బాగా ఎట్రాక్ట్ చేస్తాయని ఆమె చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే నివేద పేతురాజ్ నటి మాత్రమే కాదు క్రిడాకారిణి అనే విషయం తెలిసిందే. బైక్ రేసింగ్‌తో పాటు బాడ్మింటన్ ప్లేయర్ కూడా. ఇటీవల తమిళనాడులో జరిగిన రాష్ట్రస్థాయి బాడ్మింటన్ పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచింది. మధురైకు ప్రాతినిథ్యం వహించిన నివేదా మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్లో ప్రత్యర్థి జంటపై గెలిచి ఛాంపియన్‌గా నిలిచింది.
మొదట్లో డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ఆడియన్స్‌ను ఆకట్టుకున్న నివేద ఆ తరువాత చిత్రలహరి, పాగల్, అల వైకుంఠపురములో వంటి సినిమాల్లో సెకండ్ హీరోయిన్‌గా, సహానటిగా నటించి మంచి గుర్తింపు పొందింది. అయితే 'మెంటల్ మదిలో' సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌కు పరిచయమై నివేద ఆ తర్వాత బ్రోచేవారెవరురా, రెడ్, దాస్ కా ధమ్కీ వంటి హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. తెలుగు, తమిళ సిమిమాల్లో తళుక్కున మెరిసిన ఈ భామ ఓటీటీలోనూ వరుసగా వెబ్ సిరీస్, మూవీస్ చేస్తూ బిజీగా ఉంటుంది. రీసెంట్‌గా ఆమె నటించిన పరువు వెబ్ సిరీస్ ప్రస్తుతం జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది.