Actress Hamsa Nandini About Hero Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియన్ స్టార్ గా దుమ్మురేపుతున్నారు. ‘బాహుబలి’ మొదలుకొని వరుస పాన్ ఇండియన్ చిత్రాలతో సత్తా చాటుతున్నారు. తాజాగా ‘కల్కి’ మూవీతో బాక్సాఫీస్ దగ్గర రికార్డుల మోత మోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభాస్ గురించి హీరోయిన్ హంస నందిని ఆసక్తికర విషయాలను చెప్పింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. అతడికి సిగ్గు చాలా ఎక్కువని చెప్పింది. ‘మిర్చి’ సినిమా సమయంలో జరిగిన ఓ సంఘటనను గుర్తు చేసుకుంది.  


ప్రభాస్ కు చాలా సిగ్గు- హంసనందిని


హంసనందిని ప్రభాస్ తో కలిసి ‘మిర్చి’ సినిమాలో నటించింది. ఈ సినిమా టైటిల్ సాంగ్ లో తన అందచందాలతో ఆకట్టుకుంది. ‘మిర్చి మిర్చి’ అంటూ సాగే ఈ పాట కుర్రకారును ఓ రేంజిలో అలరించింది. ఈ సినిమా టైటిల్ సాంగ్ మంచి హిట్ అయినా.. ఆమె వేరే సినిమా షూటింగ్ లో బిజీగా ఉండటంతో సినిమా చూడలేదట. ప్రభాస్ కు విషయం తెలిసి తనే టికెట్ బుక్ చేసి మరీ సినిమాకు పంపించినట్లు వెల్లడించింది.


“ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయినా, ఆయనకు సిగ్గు చాలా ఎక్కువ. సినిమా సెట్స్ లోనూ ఎవరితోనూ పెద్దగా మాట్లాడరు. అతడితో కలిసి నేను ‘మిర్చి’ సినిమా చేశాను. ఆ సినిమాలో స్పెషల్ సాంగ్ చేశాక, నేను వేరే సినిమా షూటింగ్స్ లో బిజీగా ఉన్నాను. ఆ సినిమా ఆడియో ఫంక్షన్ కూడా వెళ్లలేదు. మూవీ రిలీజ్ టైమ్ లోనూ ఇక్కడ లేను. కొద్ది రోజుల తర్వాత వేరే సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ కు వచ్చాను. అప్పుడు ప్రభాస్ ఓ పార్టీలో కలిశారు. “మిర్చి సినిమాలో నీ పాట పెద్ద హిట్ అయ్యింది తెలుసా?” అని అడిగారు. “నేను సినిమా చూడలేదు” అని చెప్పాను. వెంటనే తనే టికెట్ బుక్ చేసి, సినిమా చూడాలని చెప్పారు. సినిమాలో నా పాట ఎప్పుడు వస్తుందో కూడా చెప్పాడు. నేను థియేటర్ కు వెళ్లి సినిమా చూశాను” అని చెప్పింది. 






రియల్ లైఫ్ ప్రభాస్ వేరు


వాస్తవానికి ప్రభాస్ రియల్ లైఫ్ లో చాలా తక్కువగా మాట్లాడుతారు. సినిమాల్లో ఫుల్ జోష్ లో కనిపించినా, బయట మాత్రం ఎవరితోనూ త్వరగా కలిసిపోరు. సినిమా సెట్స్ లోనూ తోటి వారితో పెద్దగా మాట్లాడరు. సినిమా ఫంక్షన్స్ లోనూ మాట్లాడేందుకు చాలా ఇబ్బంది పడతారు. ఒకసారి ఫ్రెండ్స్ అయితే మాత్రం చాలా జోవియల్ గా ఉంటారు. ఫ్యామిలీ మెంబర్ లాగే చూసుకుంటారట. ఇక సినిమా షూటింగ్స్ సమయంలో తనతోటి నటులకు ఇంటి నుంచే భోజనాలు తెప్పించడం ప్రభాస్ ప్రత్యేకత. ఎంతో మంది సినీ సెలబ్రిటీలో ప్రభాస్ ఇంటి ఫుడ్ పై ప్రశంసలు కురిపించారు.


‘కల్కి 2898 AD’ తో ప్రేక్షకులను అలరిస్తున్న ప్రభాస్


ఇక తాజాగా ప్రభాస్ ‘కల్కి 2898 AD’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. జూన్ 27న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కొత్త రికార్డులు నెలకొల్పుతోంది. ఆరు రోజుల్లో ఈ సినిమా దాదాపు రూ. 600 కోట్లు వసూళు చేసి సత్తా చాటింది. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశాపటానీ సహా పలువురు నటీనటులు కీలక పాత్ర పోషించారు. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమాపై పలువురు సినీ దిగ్గజాలు ప్రశంసలు కురిపిస్తున్నారు.  



Read Also: ‘విరుపాక్ష’ స్థాయిలో వరుణ్ సందేశ్ థ్రిల్లర్ మూవీ ‘విరాజీ’ - టైటిల్ రిలీజ్ వీడియో చూశారా?