Kalki 2898 AD Overseas Collections: మామూలుగా ఒక సినిమా ప్రేక్షకులకు నచ్చిందంటే అది ఎంత బడ్జెట్‌లో తెరకెక్కింది, అందులో స్టార్ హీరోలు ఎవరు ఉన్నారు అనేది పట్టించుకోకుండా దాన్ని బ్లాక్‌బస్టర్ హిట్ చేస్తారు. ఇక నాగ్ అశ్విన్ లాంటి యంగ్ డైరెక్టర్ విజన్‌కు, ప్రభాస్ లాంటి ప్యాన్ ఇండియా స్టార్ యాడ్ అయితే ఆ రెస్పాన్స్ ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘కల్కి 2898 AD’ క్రియేట్ చేస్తున్న రికార్డులు చూస్తుంటే ఈ విషయం స్పష్టమవుతోంది. ఇండియన్ బాక్సాఫీస్‌పై ప్రభాస్ దండయాత్ర చేయడం కామన్.. కానీ ఓవర్సీస్‌లో ఈ జోరు కొనసాగుతుండడం విశేషం.


నార్త్ అమెరికా..


‘కల్కి 2898 AD’ మూవీకి తెలుగు రాష్ట్రాల్లో, ఇండియాలో రికార్డ్ స్థాయి కలెక్షన్స్ వస్తాయని ప్రేక్షకులు ముందుగానే ఊహించారు. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా ఈ సినిమా ఓవర్సీస్‌లో కూడా కలెక్షన్స్ విషయంలో దూసుకుపోతోంది. కేవలం దూసుకుపోవడం మాత్రమే కాదు.. ఎన్నో రికార్డులు కూడా క్రియేట్ చేస్తోంది. ‘కల్కి 2898 AD’ ఓవర్సీస్ కలెక్షన్స్ గురించి మూవీ టీమ్ స్వయంగా ప్రకటించింది. విడుదలయ్యి 5 రోజులు పూర్తయ్యేసరికి నార్త్ అమెరికాలో 839 వేల డాలర్లును కలెక్ట్ చేసింది ‘కల్కి 2898 AD’. అయితే ఇప్పటివరకు ఏ తెలుగు సినిమా కూడా నార్త్ అమెరికాలో ఈ రేంజ్‌లో కలెక్షన్స్ సాధించకపోవడం విశేషం.






6వ రోజు..


ప్రస్తుతం ‘కల్కి 2898 AD’.. నార్త్ అమెరికాలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన 6వ ఇండియన్ సినిమాగా రికార్డ్ సాధించింది. అక్కడ ఈ మూవీ రన్ పూర్తయ్యేసరికి ఈ లిస్ట్ మరింత ముందుకు చేరుకునే అవకాశం ఉందని సినీ నిపుణులు భావిస్తున్నారు. మొత్తానికి ప్రభాస్‌కు ఇండియాలో మాత్రమే కాకుండా ఓవర్సీస్‌లో విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉందని మరోసారి ప్రూవ్ అయ్యింది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే ‘కల్కి 2898 AD’ 6వ రోజు రూ.8 కోట్ల వరకు వసూలు చేసిందని సమాచారం. ప్రపంచవ్యాప్తంగా 6వ రోజు రూ.20 కోట్ల షేర్ వసూళ్లను సాధించింది ఈ సినిమా. ఇక 6 రోజుల్లోనే ‘కల్కి 2898 AD’కి రూ.300 కోట్లు షేర్ లభించిందని తెలుస్తోంది.


ప్రీ రిలీజ్ బిజినెస్..


‘కల్కి 2898 AD’ కలెక్షన్స్‌పై మూవీ టీమ్ అంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఓ రేంజ్‌లో జరిగింది. నైజాంలో రూ.65 కోట్లు, సీడెడ్‌లో రూ.27 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లో రూ.76 కోట్లు.. ఇలా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ‘కల్కి 2898 AD’కి రూ.168 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇక కర్ణాటకలో రూ.25 కోట్లు, తమిళనాడులో రూ.16 కోట్లు, దేశవ్యాప్తంగా మిగతా రాష్ట్రాల్లో రూ.85 కోట్ల బిజినెస్‌తో అందరినీ ఆశ్చర్యపరిచింది. కేవలం ఇండియాలో మాత్రమే కాదు.. ఓవర్సీస్‌లో కూడా ప్రీ రిలీజ్ బిజినెస్‌తో, కలెక్షన్స్ రికార్డ్స్‌ క్రియేట్ చేసింది ఈ మూవీ.



Also Read: బాక్సాఫీస్ దగ్గర తగ్గిన ‘కల్కి 2898 ఏడీ’ జోరు, ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని కోట్లు వసూళ్లు చేసిందో తెలుసా?