Operation Valentine OTT streaming details : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇటీవల 'ఆపరేషన్ వాలెంటైన్' మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో వైమానిక దాడులు, దేశభక్తి కలబోతగా కొన్ని రియల్ ఇన్సిడెంట్ ని ఆధారంగా చేసుకుని ఈ సినిమాని రూపొందించారు. వరుణ్ తేజ్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ పాత్రలో నటించిన ఈ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కింది. రిలీజ్ కు ముందు పోస్టర్స్, టీజర్, సాంగ్స్, ట్రైలర్ తో ఆడియన్స్ లో మంచి హైప్ క్రియేట్ చేసుకున్న ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయి కమర్షియల్ గా సక్సెస్ కాలేకపోయింది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కి రెడీ అయినట్లు తెలుస్తోంది. 'ఆపరేషన్ వాలెంటైన్' ఓటీటీ స్ట్రీమింగ్ కి సంబంధించిన వివరాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
'ఆపరేషన్ వాలెంటైన్' ఓటీటీలోకి వచ్చేది అప్పుడే..
'ఆపరేషన్ వాలెంటైన్' ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ సంస్థ భారీ ధరకు కొనుగోలు చేసినట్లు సమాచారం. థియేటర్లో రిలీజ్ అయిన నాలుగు వారాలకు ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా నిర్మాతలతో అమెజాన్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు టాక్. దాని ప్రకారం ఈ సినిమా మార్చ్ 29 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగుతో పాటూ మిగతా దక్షిణాది భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కి అందుబాటులో రానున్నట్లు సమాచారం. మాములుగా థియేటర్ లో రిలీజ్ అయిన సినిమాలు నెల రోజుల తర్వాతే ఓటీటీ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వస్తుంటాయి. కానీ వరుణ్ తేజ్ 'ఆపరేషన్ వాలెంటైన్' మాత్రం నెల కాకముందే ఓటీటీలోకి వస్తుండడం గమనార్హం. త్వరలోనే అమెజాన్ ప్రైమ్ నుండి దీనిపై అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం.
హిందీలో మరింత ఆలస్యంగా
తెలుగుతోపాటు దక్షిణాది భాషల్లో మార్చి 29న ఓటీటీలోకి రాబోతున్న 'ఆపరేషన్ వాలెంటైన్' మూవీ హిందీలో మాత్రం కొంత ఆలస్యంగా స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. ఒప్పందం ప్రకారం ఈ సినిమా ఎనిమిది వారాల తరువాతే హిందీలో స్ట్రీమింగ్ అవ్వనున్నట్లు చెబుతున్నారు. తెలుగులో విభిన్న తరహా సినిమాలు చేసి నటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వరుణ్ తేజ్.. 'ఆపరేషన్ వాలెంటైన్' సినిమాతోనే బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా వరుణ్ కి హిందీలో మంచి డెబ్యూ మూవీ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ ఊహించని విధంగా ఈ సినిమా నార్త్ ఆడియన్స్ ని కూడా నిరాశపరిచింది.
ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ అండ్ టీం చాలా కష్టపడ్డారు. కానీ అందుకు తగ్గ రిజల్ట్ రాలేదు. 2019 పుల్వామా టెర్రరిస్ట్ అటాక్ జరిగిన సమయంలో సర్జికల్ స్ట్రైక్స్ తో పాటు ఉరి సంఘటనల ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు. శక్తి ప్రతాప్ సింగ్ హడా ఈ మూవీతో వెండితెరిపి దర్శకుడిగా ఆరెంగేట్రం చేశాడు. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రినైసెన్స్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతమందించారు. సినిమాలో వరుణ్ తేజ్ సరసన మనుషి చిల్లర్ హీరోయిన్గా నటించగా.. నవదీప్, రుహాని శర్మ, పరేష్ పహుజ, అలీ రేజా, సంపత్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
Also Read : త్రిషకి స్పెషల్ గిఫ్ట్ పంపిన మెగాస్టార్ - థ్యాంక్స్ చెప్పిన 'విశ్వంభర' హీరోయిన్!