Crazy Update On Chiranjeevi’s Vishwambhara : మెగాస్టార్ చిరంజీవి హీరోగా 'బింబిసార' మూవీ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో 'విశ్వంభర' అనే సోషియో ఫాంటసీ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి రోజుకో అప్డేట్ ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. ఈ అప్డేట్స్ తో సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోతున్నాయి. స్టార్ కాస్ట్ ఈ సినిమా లో భాగమవుతున్నారు. ఇందులో చిరంజీవి సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. ఈమెతో పాటు ఇంకా ఐదుగురు హీరోయిన్లు ప్రత్యేక పాత్రల్లో కనిపించబోతున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ఈ సినిమా నుంచి మరో క్రేజీ అప్డేట్ బయటికి వచ్చింది. ఈ అప్డేట్ తో సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవెల్ కి చేరుకున్నాయి.


మెగాస్టార్ తో పాటూ త్రిష కూడా డ్యూయల్ రోల్


'విశ్వంభర' సినిమాలో చిరంజీవి ద్విపాత్రాభినయం చేస్తున్నారట. ఆయన పాత్రలో రెండు రకాల షేడ్స్ ఉంటాయని చెబుతున్నారు. ఇక మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ సినిమాలో చిరంజీవితో పాటు ఆయనకు జోడిగా నటిస్తున్న త్రిష కూడా డ్యూయల్ రోల్ లోనే నటిస్తున్నట్లు సమాచారం. ఇందులో త్రిష కూడా రెండు డిఫరెంట్ వేరియేషన్స్ కలిగిన పాత్రల్లో కనిపిస్తుందని అంటున్నారు. ఫాంటసీ ఎలిమెంట్స్ లో ఓ గెటప్, అలాగే సోషల్ ఎలిమెంట్స్ లో మరో గెటప్ లో కనిపిస్తుందట త్రిష. మామూలుగా హీరోలు డ్యూయల్ రోల్ చేయడం కామనే. కానీ హీరోయిన్స్ డ్యూయల్ రోల్ లో కనిపించడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. అలాగే త్రిష ఇప్పటివరకు డ్యూయల్ రోల్ చేసింది లేదు. సో మొదటిసారి అది కూడా మెగాస్టార్ చిరంజీవి సినిమాలో త్రిష డ్యూయల్ రోల్ చేస్తుందనే విషయం బయటకు రావడంతో సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవెల్ కి చేరుకున్నాయి. అయితే మూవీ టీం నుంచి దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.


మెగాస్టార్ కి చెల్లెల్లుగా ఐదుగురు హీరోయిన్లు


'విశ్వంభర' లో సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్ తో పాటు సిస్టర్ సెంటిమెంట్ కూడా ఉంటుందట. ఈ సినిమాలో చిరంజీవికి ఐదుగురు చెల్లెళ్ళు ఉంటారని టాక్ వినిపిస్తోంది. ఆషిక రంగనాథ్, ఇషా చావ్లా, మీనాక్షి చౌదరి, మృణాల్ ఠాగూర్, సురభి ఇందులో చిరంజీవి చెల్లెలి పాత్రల్లో కనిపిస్తారని సమాచారం. వీరితో పాటు నవీన్ చంద్ర, రాజ్ తరుణ్ లాంటి యంగ్ హీరోలు సైతం కీలక పాత్రలు పోషిస్తున్నట్లు తెలిసింది. 


రూ.200 కోట్ల భారీ బడ్జెట్ తో


'విశ్వంభర' మూవీ మెగాస్టార్ కెరియర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతోంది. ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ నిర్మాణ సంస్థ సుమారు రూ.200 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. సోషియో ఫాంటసీ జోనర్ కావడంతో సినిమాలో భారీ గ్రాఫిక్స్ కూడా ఉండబోతోంది. అందుకే ఈ ప్రాజెక్టు కోసం నిర్మాతలు ఖర్చుకు ఎక్కడా వెనకాడకుండా బడ్జెట్ పెడుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి రీసెంట్ గానే ఓ సాంగ్ షూట్ చేశారు. త్వరలోనే మరో షెడ్యూల్ కి రెడీ అవుతున్నారు. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాని రిలీజ్ చేయనున్నారు మేకర్స్.


Also Read : లెజెండరీ నటుడికి వీరాభిమానిగా.. కొత్త చిత్రానికి కొబ్బరికాయ కొట్టిన కార్తి!