'మహారాణి రుక్మిణీ దేవి'గా రీతూ వర్మ
'స్వాగ్' సినిమా నుంచి ఇప్పటికే శ్రీ విష్ణు ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ లుక్ లో శ్రీ విష్ణు సరికొత్త గెటప్ తో ఆకట్టుకున్నారు. ఇక ఈ సినిమాలో శ్రీ విష్ణు సరసన రీతూ వర్మ హీరోయిన్ గా నటిస్తోంది. నేడు ఆమె పుట్టిన రోజు కావడంతో రీతు వర్మ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేస్తూ ఆమెకు బర్త్ డే విషెస్ తెలియజేశారు. 'రాజులను తలదన్నేలా మా వింజామర వంశ మహారాణి రుక్మిణి దేవికి జన్మదిన శుభాకాంక్షలు' అంటూ ఈ ఫస్ట్ లుక్ లో పేర్కొన్నారు. దాని ప్రకారం ఈ సినిమాలో రీతు వర్మ మహారాణి రుక్మిణి దేవిగా ఆకట్టుకోనుందని అర్థమవుతుంది. ఇక ఈ పోస్టర్లో రీతూ వర్మ వైట్ శారీ ధరించి, మెడ నిండా బంగారు ఆభరణాలతో మహారాణిగా సింహాసనంపై కూర్చోవడం గమనించవచ్చు. తాజాగా రిలీజ్ చేసిన రీతూ వర్మ ఫస్ట్ లుక్ ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటోంది.
'రాజ రాజ చోర' ప్రీక్వెల్ గా 'స్వాగ్'
'స్వాగ్' సినిమా శ్రీ విష్ణు నటించిన 'రాజరాజ చోర' సినిమాకి ప్రీక్వెల్ గా తెరకెక్కుతోంది. హసిత్ గోలి ఈ సినిమాని డైరెక్ట్ చేశారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో కామెడీ ని జత చేస్తూ తెరకెక్కిన ఈ సినిమా ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకుని బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకుంది. ముఖ్యంగా సినిమాలో దొంగగా శ్రీ విష్ణు తన నటనతో అదరగొట్టేసాడు. ఇందులో శ్రీ విష్ణు సరసన సునైనా, మేఘ ఆకాష్ హీరోయిన్స్ గా నటించారు. ఇప్పుడు ఇదే సినిమాకి ప్రీక్వెల్ గా 'స్వాగ్'ని తెరకెక్కిస్తున్నట్లు ఇప్పటికే అనౌన్స్ చేశారు మేకర్స్. ఇందులో అసలు హీరో దొంగ ఎలా అవుతాడు? అనే అంశాన్ని మరింత ఎంటర్టైనింగ్ గా చెప్పబోతున్నారట. 'రాజరాజ చోర' లో సునైన, మెగా ఆకాష్ హీరోయిన్స్ గా నటిస్తే 'స్వాగ్' లో మాత్రం రీతు వర్మ కథానాయికగా నటిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
Also Read : బాక్సాఫీస్ దగ్గర ‘గామి’ దూకుడు, రెండో రోజు కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే?