Ooru Peru Bhairavakona Release Date: ఒక సినిమా పూర్తి చేయడంలో మాత్రమే కాదు.. దానికి ఒక రిలీజ్ డేట్ చూసి ప్రేక్షకుల ముందుకు రావడంలో కూడా ఎన్నో అడ్డంకులు ఉంటాయి. గత కొన్నిరోజులుగా తెలుగు సినిమాలకు అలాంటి రిలీజ్ కష్టాలే వచ్చాయి. ముందుగా ఒక విడుదల తేదీ అనౌన్స్ చేసిన తర్వాత కూడా వాయిదా పడిన సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి ‘ఊరు పేరు భైరవకోన’. సందీప్ కిషన్ హీరోగా నటించిన ఈ సినిమాకు ముందుగా రిలీజ్ డేట్ కష్టాలు రాగా.. తాజాగా ఈ మూవీపై న్యాయపరమైన వివాదం మొదలయ్యింది. దీంతో అసలు అనుకున్న సమయానికి ‘ఊరు పేరు భైరవకోన’ ప్రేక్షకుల ముందుకు వస్తుందా, రాదా అనే సందేహాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు దీని రిలీజ్‌కు లైన్ క్లియర్ కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
రిలీజ్ డేట్ కష్టాలు..
సందీప్ కిషన్ హీరోగా వీఐ ఆనంద్ తెరకెక్కించిన చిత్రమే ‘ఊరు పేరు భైరవకోన’. ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల అవ్వాల్సింది. కానీ అప్పటికే పలు హైప్ ఉన్న సినిమాలు రేసులో ఉండడంతో ఈ మూవీ సైలెంట్‌గా తప్పుకుంది. ఆ తర్వాత ఫిబ్రవరీ 9న ప్రేక్షకుల ముందుకు రావాలనుకుంది. కానీ ‘ఈగల్’కు సోలో రిలీజ్ అందించాలని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ రిక్వెస్ట్ చేయడంతో ఆ డేట్ నుండి కూడా తప్పుకుంది. ఫైనల్‌గా ఫిబ్రవరీ 16న ‘ఊరి పేరు భైరవకోన’ రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేసుకుంది. అంతే కాకుండా ఈ మూవీపై ప్రేక్షకుల్లో హైప్ క్రియేట్ చేయడం కోసం ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టింది. ఇంతలోనే ‘ఊరి పేరు భైరవకోన’కు లీగల్ సమస్య ఎదురయ్యింది.
హైదరాబాద్ సివిల్ కోర్టులో కేసు..
‘ఊరు పేరు భైరవకోన’ మూవీ రిలీజ్‌ను హోల్డ్‌లో పెట్టాలంటూ వైజాగ్‌కు చెందిన ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ బత్తుల సత్యానారాయణ అలియాస్ వైజాగ్ సతీష్ హైదరాబాద్ సివిల్ కోర్టులో కేసు పెట్టారు. అక్కినేని అఖిల్ హీరోగా నటించిన ‘ఏజెంట్’ మూవీ డిస్ట్రిబ్యూషన్ విషయంలో ముందుగా ఒక అగ్రిమెంట్ చేసుకున్నారని, దాని ప్రకారం సినిమా నిర్మాతలు తనకు ప్రసార హక్కులు ఇవ్వలేదని ఆరోపించారు. ఇందుకు సమాధానం ఇవ్వాలని ‘ఊరు పేరు భైరవకోన’ టీమ్‌ను అడిగినా స్పందించకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో లీగల్ యాక్షన్ తీసుకోవాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. కానీ ఈ కేసు విషయంలో వైజాగ్ సతీష్‌కు ఎదురుదెబ్బ తగిలింది.
కేసు ముగిసిపోలేదు..
కేసు విచారించిన హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు.. ‘ఊరు పేరు భైరవకోన’కు, ‘ఏజెంట్’కు ఏమీ సంబంధం లేదని తేల్చిచెప్పింది. అందుకే ‘ఊరు పేరు భైరవకోన’ రిలీజ్‌కు ఆపడం సాధ్యం కాదని వెల్లడించింది. కానీ కేసును పూర్తిగా క్లోజ్ చేయకుండా తరువాతి విచారణను ఏప్రిల్ 4కు వాయిదా వేసింది. ఇక ఇప్పటికే ‘ఊరు పేరు భైరవకోన’ పలు ప్రాంతాల్లో విడుదల అయ్యింది. ఈ పెయిడ్ ప్రీమియర్స్‌కు ప్రేక్షకుల దగ్గర నుండి పాజిటివ్ రెస్పాన్స్ లభించింది. ఫిబ్రవరీ 16న దేశవ్యాప్తంగా ఈ మూవీ విడుదలకు సిద్ధమయ్యింది. ఇందులో సందీప్ కిషన్ జంటగా వర్ష బొల్లామా నటించగా.. సెకండ్ హీరోయిన్‌గా కావ్య థాపర్ కనిపించనుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలయిన ‘నిజమేనే చెబుతున్న’ పాట బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది.
Also Read: ఆ వీడియో చూశాక నేనేనా ఇంకా బ్రతికున్నది అనిపించింది - పల్లవి ప్రశాంత్ ఎమోషనల్