Humma Humma Song : యువ కథానాయకుడు సందీప్ కిషన్, దర్శకుడు వీఐ ఆనంద్‌... ఇద్దరిది హిట్ కాంబినేషన్. వీళ్ళిద్దరూ కలిసి 'టైగర్' చేశారు. ఆ సినిమా మంచి విజయం సాధించింది. ఇప్పుడు కొత్త సినిమా 'ఊరు పేరు భైరవకోన'తో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నారు. 


సందీప్ కిషన్ హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న తాజా 'ఊరు పేరు భైరవకోన' చిత్రాన్ని ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత అనిల్ సుంకర సగర్వ సమర్పణలో హాస్య మూవీస్ పతాకంపై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. బాలాజీ గుత్తా ఈ చిత్రానికి సహ నిర్మాత. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... ఈ సినిమాలో 'హమ్మ హమ్మ' పాటను ఇవాళ విడుదల చేశారు. 


శేఖర్ చంద్ర సంగీతంలో రామ్ మిరియాల పాట
'ఊరి పేరు భైరవకోన' సినిమాకు శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు. ఆల్రెడీ 'నిజమే నే చెబుతున్నా...' పాటను విడుదల చేశారు. సిద్ శ్రీరామ్ పాడిన ఆ పాట సూపర్ హిట్ అయ్యింది. మిలియన్స్ వ్యూస్ వచ్చాయి. తాజాగా 'హమ్మ హమ్మ...' సాంగ్ విడుదల చేశారు. 


'హమ్మ హమ్మ...' పాటను సందీప్ కిషన్, వర్షా బొల్లమ్మపై తెరకెక్కించారు. ఈ పాటను రామ్ మిరియాల పాడగా... తిరుపతి జావనతో కలిసి సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర సాహిత్యం అందించడం విశేషం. ట్యూన్ క్యాచీగా ఉంది. మేకింగ్ వీడియోను ఖర్చుకు వెనుకాడకుండా తీశారని అర్థం అవుతోంది. 


Also Read నవంబర్‌లో క్రేజీ క్రేజీ ఫిలిమ్స్ - థియేటర్లలో సందడి చేసే సినిమాలు



ఆల్రెడీ విడుదల చేసిన టీజర్, 'నిజమే నే చెబుతున్నా...' పాటకు మంచి స్పందన రావడం పట్ల దర్శక, నిర్మాతలు సంతోషం వ్యక్తం చేశారు. ఇదొక ఫాంటసీ అండ్ అడ్వెంచరస్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా అని పేర్కొన్నారు. 


Also Read లింగోచ్చా రివ్యూ : హైదరాబాద్ నేపథ్యంలో హిందూ ముస్లిం ప్రేమకథ - కార్తీక్ రత్నం సినిమా ఎలా ఉందంటే?


'ఊరి పేరు భైరవకోన' ఫస్ట్ లుక్ చూస్తే... పాడుబడిన భవంతుల మధ్య నిలబడిన సందీప్ కిషన్, ఆయన చేతిలో ఒక కర్ర, వెనుక అగ్ని కీలలతో మండుతున్న చందమామ... ఆసక్తికరంగా ఉంది. మేకింగ్ వీడియోలోనూ మంటలు కనిపించాయి. ఒంటికి మంట అంటుకోవడంతో నీళ్ళలోకి ఒకరు దూకడం కనిపించింది. మరి, ఆ మంటల్లో ఏం జరిగింది? అనేది ప్రస్తుతానికి మిస్టరీ. ''ఎవరికీ అంతుచిక్కని రహస్య ప్రపంచం భైరవకోనలోకి ప్రవేశించండి'' అని చిత్రబృందం పేర్కొంది.



సందీప్ కిషన్ సరసన 'ఏక్ మినీ కథ' ఫేమ్ కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి కూర్పు : ఛోటా కె ప్రసాద్, కళా దర్శకత్వం : ఎ రామాంజనేయులు, సంభాషణలు: భాను భోగవరపు, నందు సవిరిగాన, ఛాయాగ్రహణం  : రాజ్ తోట, సంగీతం : శేఖర్ చంద్ర, నిర్మాణ సంస్థలు : ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్, సహ నిర్మాత: బాలాజీ గుత్తా , సమర్పణ: అనిల్ సుంకర, నిర్మాత: రాజేష్ దండా, కథ, స్క్రీన్‌ప్లే & దర్శకత్వం: విఐ ఆనంద్.  


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial