Shiva Rajkumar Ghost Telugu Release : కన్నడ చిత్రసీమలో అగ్ర హీరోలలో ఒకరైన కరుణాడ చక్రవర్తి శివ రాజ్ కుమార్ నటించిన పాన్ ఇండియా యాక్షన్ సినిమా 'ఘోస్ట్'. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించారు. 'ఘోస్ట్' చిత్రానికి కన్నడ హిట్ 'బీర్బల్' ఫేమ్ శ్రీని దర్శకత్వం వహించారు. సందేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై 31వ సినిమాగా ప్రముఖ నిర్మాత, రాజకీయ నాయకులు సందేశ్ నాగరాజ్ నిర్మించారు.
కర్ణాటకలో విజయ దశమి కానుకగా చిత్రాన్ని విడుదల చేశారు. అక్టోబర్ 19 నుంచి అక్కడ థియేటర్లలో సినిమాను ప్రదర్శిస్తున్నారు. తెలుగులో వచ్చే వారం విడుదల చేయనున్నట్లు చెప్పారు.
నవంబర్ 4న తెలుగులో 'ఘోస్ట్' విడుదల
ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ... రెండు తెలుగు రాష్ట్రాల్లో నవంబర్ 4న 'ఘోస్ట్' చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు ఈ రోజు అనౌన్స్ చేశారు. తెలుగులో భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేశారు. తెలుగులో నవంబర్ 3న తరుణ్ భాస్కర్ 'కీడా కోలా', 'సత్యం' రాజేష్ 'మా ఊరి పొలిమేర 2', రక్షిత్ అట్లూరి 'నరకాసుర', వికాస్ ముప్పాల 'ప్లాట్'తో పాటు మరో రెండు మూడు సినిమాలు విడుదల అవుతున్నాయి.
Also Read : నవంబర్‌లో క్రేజీ క్రేజీ ఫిలిమ్స్ - థియేటర్లలో సందడి చేసే సినిమాలు
నిజానికి... కన్నడతో పాటు తెలుగులో కూడా ఒకే రోజు విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే... దసరాకు తెలుగులో గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ, శ్రీ లీల ప్రధాన పాత్రల్లో నటించిన 'భగవంత్ కేసరి'తో పాటు మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందిన బయోపిక్ 'టైగర్ నాగేశ్వర రావు' విడుదల అయ్యాయి. ఈ రెండు చిత్రాలకు తోడు తమిళ స్టార్ విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన 'లియో' కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్లు ఆ మూడు సినిమాలకు సరిపోలేదని చెప్పాలి. 'లియో' కంటే 'టైగర్ నాగేశ్వర రావు'కు తక్కువ థియేటర్లు వచ్చాయి. అందుకని, 'ఘోస్ట్' తెలుగు రిలీజ్ కొంచెం వెనక్కి వెళ్ళింది.
Also Read : కనికరమే లేని యువతి - ప్రియాంకా ఉపేంద్ర షీరోయిజం ఎలివేట్ చేసే 'డిటెక్టివ్ తీక్షణ' టైటిల్ సాంగ్
అనుపమ్ ఖేర్, జయరామ్, ప్రశాంత్ నారాయన్, అర్చనా జాయిస్, సత్య ప్రకాష్, దత్తన్న తదితరులు నటిస్తున్న 'ఘోస్ట్' చిత్రానికి యాక్షన్ కొరియోగ్రఫీ: చేతన్ డిసౌజా, వెంకట్ (హైదరాబాద్), అర్జున్ రాజ్, మాస్ మద, కూర్పు : దీపు ఎస్ కుమార్, ఛాయాగ్రహణం : మహేంద్ర సింహ, సంగీతం: అర్జున్ జన్య, సమర్పణ : ఎమ్మెల్సీ సందేశ్ నాగరాజ్, కథ - దర్శకత్వం: శ్రీని.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial