Rage of Teekshana Song : ప్రముఖ కన్నడ కథానాయకుడు, తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితుడైన ఉపేంద్ర భార్య, యాక్షన్ క్వీన్ డా. ప్రియాంక ఉపేంద్ర ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'డిటెక్టివ్ తీక్షణ' (Detective Teekshana Movie). కథానాయికగా ఆమెకు 50వ చిత్రమిది. త్రివిక్రమ్ రఘు దర్శకత్వం వహిస్తున్నారు. ఈవెంట్ లింక్స్ ఎంటర్టైన్మెంట్, ఎస్డిసి సినీ క్రియేషన్స్ సంస్థలపై గుత్తా ముని ప్రసన్న, ముని వెంకట చరణ్, పురుషోత్తం బి. కోయురు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో తొలి పాటను ఇటీవల విడుదల చేశారు. 


''రణరణమున రధము నిలిపి...
రుధిర నదిని ఎదురు మలిపి... 
కుత్తుకల కోట కూల్చే తీక్షణా!
కణకణమున యుద్ధ నీతి... 
కనికరమే లేని యువతి... 
క్రూర కథల కత్తివేటు తీక్షణా!''
అంటూ సాగిన టైటిల్ సాంగ్ (Detective Teekshana Title Song)ను హైమత్ మొహమ్మద్, సాయి చరణ్ భాస్కరుని, అరుణ్ కౌండిన్య ఆలపించారు. ఈ చిత్రానికి టాలీవుడ్ యంగ్ మ్యూజిక్ కంపోజర్ పెద్దపల్లి రోహిత్ (పీఆర్) సంగీతం అందిస్తున్నారు. ఈ పాటను కూడా ఆయనే రాశారు. తాను అనుకున్నది సాధించేందుకు ఎంతకైనా తెగించే యువతిగా 'రేజ్ ఆఫ్ తీక్షణ'లో ప్రియాంక ఉపేంద్రను చూపించారు. లిరికల్ వీడియో కూడా ఆకట్టుకుంది. 


Also Read : నవంబర్‌లో క్రేజీ క్రేజీ ఫిలిమ్స్ - థియేటర్లలో సందడి చేసే సినిమాలు






ఏడు భాషల్లో 'డిటెక్టివ్ తీక్షణ' విడుదల!
తెలుగు, కన్నడతో పాటు తమిళ, మలయాళ, ఒరియా, బెంగాలీ, హిందీ భాషల్లో 'డిటెక్టివ్ తీక్షణ'ను విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నామని, ఇదొక స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ అని నిర్మాతలు తెలిపారు. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకుందని సంతోషం వ్యక్తం చేశారు. త్వరలోనే సినిమా విడుదల తేదీ వెల్లడిస్తామన్నారు.  


Also Read ఏవయ్యా అట్లీ - నీకు హీరోయిన్లను చంపే శాడిజం ఏంటయ్యా?


భయంకరమైన హత్యల నేపథ్యంలో 'డిటెక్టివ్ తీక్షణ' తెరకెక్కించారు. ఆ హత్యలు చేసిన వాళ్ళను ప్రియాంక ఉపేంద్ర ఎలా పట్టుకున్నారు? ఆ కేసును ఆమె ఎలా సాల్వ్ చేశారు? అనేది చిత్ర కథాంశమని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. థ్రిల్లింగ్, యాక్షన్, ఎమోషనల్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని దర్శకుడు చెప్పారు.



 
ప్రియాంక ఉపేంద్ర ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈ సినిమాలో అవినాష్, మంజునాథ హెగ్డే, ముని వెంకట చరణ్, విజయ్ సూర్య, సిడ్లింగు శ్రీధర్ ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి  కూర్పు : వైఎస్ శ్రీధర్, కళా దర్శకత్వం : బిఎం నవీన్ కుమార్, ఛాయాగ్రహణం : మను దాసప్ప, సంగీతం: రోహిత్ పెద్దపల్లి, రచన & దర్శకత్వం: త్రివిక్రమ్ రఘు, నిర్మాతలు: గుత్తా ముని ప్రసన్న, ముని వెంకట చరణ్, పురుషోత్తం బి. కోయురు. 


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial