పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు 2025లో డబుల్ ధమాకా. ఈ ఏడాది థియేటర్లలో డబుల్ సెలబ్రేషన్స్. ఆయన సినిమాలు ఒక్కటి కాదు... రెండు విడుదల కానున్నాయి. ఫ్యాన్స్, ఆడియన్స్ ఎదురుచూస్తున్న 'ఓజీ' సైతం ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.
సెప్టెంబర్ నెలాఖరున థియేటర్లలో 'ఓజీ' రిలీజ్OG Movie Release Date: పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా ఆయన వీరాభిమానులలో ఒకరైన సుజీత్ దర్శకత్వం వహిస్తున్న సినిమా 'ఓజీ' (They Call Him OG). ఈ సినిమాను సెప్టెంబర్ నెలాఖరున... 25వ తేదీన థియేటర్లలోకి తీసుకు వస్తున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్ అనౌన్స్ చేసింది. డీవీవీ దానయ్య, ఆయన తనయుడు కళ్యాణ్ దాసరి సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు.
Also Read: థియేటర్స్ బంద్ కుట్ర వెనుక ద్వారంపూడి... వైసీపీ ఆటలో 'ఆ నలుగురు' పావులు అయ్యారా?
పవన్ కథానాయకుడిగా రూపొందిన చారిత్రాత్మక చిత్రం 'హరి హర వీరమల్లు' జూన్ 12వ తేదీన థియేటర్లలోకి రానున్న సంగతి తెలిసింది. ఆ సినిమా విడుదలైన మూడు నెలలకు 'ఓజీ' సైతం విడుదల కానుంది. పవన్ అభిమానులకు ఇది డబుల్ సెలబ్రేషన్స్ మూమెంట్ అని చెప్పాలి.
Also Read: టాలీవుడ్ 'కింగ్ పిన్'కు పవన్ కళ్యాణ్ చెక్‌మేట్... చిన్న గూగ్లీకి హడల్... దెబ్బకు సెట్టయ్యారా?
'ఓజీ' సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. ఆల్రెడీ 'నెత్తురుకు మరిగిన హంగ్రీ చీతా' సాంగ్ అభిమానులకు గూస్ బంప్స్ ఇచ్చింది. ఈ సినిమా సాంగ్స్ కోసం కూడా ఫాన్స్ ఎదురు చూస్తున్నారు. 'ఓజీ' సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక అరుల్ మోహన్ కథానాయికగా నటిస్తున్నారు. బాలీవుడ్ హీరో, సీరియల్ కిస్సర్ కింద ముద్ర పడిన ఇమ్రాన్ హష్మీ విలన్ రోల్ చేస్తున్నారు. శ్రియా రెడ్డి మరొక కీలక పాత్ర చేస్తున్నారు. వీళ్ళతో పాటు మరి కొంతమంది పేరు ఉన్న నటీనటులు సినిమాలో కనిపించనున్నారు.