Pawan Kalyan looks fiercely handsome in OG song: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులలో జోష్ తీసుకొచ్చారు 'దే కాల్ హిమ్ ఓజీ' ఫిల్మ్ మేకర్స్. సినిమాలో మొదటి పాట విడుదల చేశారు. సాంగ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నాలుగు నిమిషాల పాటు గూస్ బంప్స్ వచ్చేలా చేశారు. 

పవన్ కళ్యాణ్ లుక్స్ కిర్రాక్ అంతే!'ఓజీ' సినిమా నుంచి ఆగస్టు 2న ఫస్ట్ సాంగ్ విడుదల చేస్తామని ముందు చెప్పారు. ఆ పాటను శనివారం సాయంత్రం విడుదల అవుతుందని భావించారంతా! కానీ, చెప్పిన సమయానికి అంటే ముందుగా సాంగ్ రిలీజ్ చేశారు. పవన్ కళ్యాణ్ అభిమానులకు మాత్రమే కాదు... సామాన్య ప్రేక్షకులకు సైతం గూస్ బంప్స్ వచ్చేలా సాంగ్ ఉందని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. 

'ఓజీ' సినిమాలో ఫస్ట్ సాంగ్ 'ఫైర్ స్ట్రోమ్'కు మాంచి హై అండ్ ఎనర్జిటిక్ ట్యూన్ ఇచ్చారు తమన్. ఆయన బీట్స్ మామూలుగా లేవు. వింటుంటే ఒక హై రావడం గ్యారంటీ. సాంగ్ అంతా ఒక ఎత్తు... పాటలో పవన్ కళ్యాణ్ లుక్స్ మరో ఎత్తు. ఈ సినిమాలో ఆయన ఉన్నంత హ్యాండ్సమ్‌గా ఇటీవల మరొక సినిమాలో లేరని చెబితే అతిశయోక్తి కాదు.

శింబు పాడిన పాట ఇదే... ఆయనతో!'ఓజీ'లో తానొక పాట పాడినట్టు తమిళ హీరో, తెలుగు ప్రేక్షకులకు సైతం బాగా తెలిసిన శింబు చెప్పారు. ఆ పాటే ఈ 'ఫైర్ స్ట్రోమ్'. అయితే... ఈ పాటను శింబు ఒక్కరే పడలేదు. ఆయనతో పాటు సంగీత దర్శకుడు తమన్, నజీరుద్దీన్ & భరద్వాజ్, దీపక్ బ్లూ కూడా పాడారు. పాటలో వినిపించే ఫిమేల్ వాయిస్ రాజ కుమారిది. విశ్వ, శ్రీనివాస్ మౌళి కలిసి తెలుగు లిరిక్స్ రాయగా... ఇంగ్లీష్ లిరిక్స్ రాజ కుమారి రాశారు. జపనీస్ లిరిక్స్‌ను అద్వితీయ వొజ్జాల రాశారు. ఈ సాంగ్ పవన్ కళ్యాణ్ అభిమానులకు గూస్ బంప్స్ ఇస్తుంది.

Also Read: జపాన్‌లో 'మనం' రీ రిలీజ్... అక్కడ మన కింగ్ నాగార్జున క్రేజ్ నెక్స్ట్ లెవల్

'ఓజీ' సినిమాకు సుజీత్ దర్శకుడు. 'సాహో' తర్వాత ఆయన చేస్తున్న చిత్రమిది. పవన్ కళ్యాణ్ అంటే విపరీతమైన అభిమానం కూడా! డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకం మీద డీవీవీ దానయ్య, దాసరి కళ్యాణ్ ప్రొడ్యూస్ చేస్తున్న చిత్రమిది. ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్. బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ విలన్ రోల్ చేశారు. సెప్టెంబర్ 25న సినిమా విడుదల కానున్న సంగతి తెలిసిందే. సినిమా మీద ముందు నుంచి విపరీతమైన హైప్ ఉంది. ఇప్పుడీ పాట ఆ హైప్ మరింత పెంచింది.  

Also Readమ‌హేష్‌ బాబు రిజెక్ట్ చేసిన క‌థ‌తో నాగార్జున సినిమా - క‌ట్ చేస్తే బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్ - ఆ మూవీ ఏదో తెలుసా?